Latest Updates
-
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
శృంగారానికి సంజీవని..అది ఎక్కడ లభిస్తుందంటే..
పెళ్లి తర్వాత శృంగారంలో రెచ్చిపోవాలని చాలామంది కలలు కంటారు. అయితే పెళ్లయ్యాక కొన్ని రోజులకే పడకగదిలో పక్కకు తిరిగి పడుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి కొందరిది. వివాహ బంధంలో శారీరక సాన్నిహిత్యం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం రెండు శారీరాల కలయిక మాత్రమే కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య మానసిక బంధాన్ని కూడా బలపరుస్తుంది. అయితే చాలా మందిలో శృంగారం పట్ల ఆసక్తి తగ్గడం, నీరసం, శక్తి లేకపోవడం వంటి సమస్యలకి కారణం మీ శరీరంలో ఒక కీలకమైన పోషకం లోపించడమే కావచ్చు.
ఆసక్తి తగ్గడానికి కారణాలేంటి?
నిపుణుల ప్రకారం లైంగిక కోరికలు తగ్గడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, అలసట, కొన్ని రకాల మెడిసిన్స్ వాడకం, భాగస్వామితో సంబంధంలో ఉన్న ఉద్రిక్తతలు వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే మనం తరచుగా పట్టించుకోని మరో ముఖ్యమైన కారణం విటమిన్ B-12 లోపం.

శృంగారానికి సంజీవని
లైంగిక జీవితం ఉత్తేజంగా, ఆనందంగా సాగాలంటే శరీరానికి తగినంత శక్తి, ఓర్పు, మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఇక్కడే విటమిన్ B-12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మన మెదడులో ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఫీల్ గుడ్ హార్మోన్లయిన సెరోటోనిన్, డోపమైన్ ల ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల మానసిక చురుకుదనం పెరిగి, శృంగారం పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా విటమిన్ B12 శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జననేంద్రియాలకు సరైన రక్త ప్రసరణ అందడం లైంగిక పనితీరుకు చాలా ముఖ్యం. ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని శృంగారానికి సిద్ధం చేస్తుంది.
ఈ విటమిన్ ఎక్కడ లభిస్తుంది?
విటమిన్ B-12 ప్రధానంగా జంతు సంబంధిత ఆహార పదార్థాలలో పుష్కలంగా ఉంటుంది.
మాంసాహారులు: మాంసం, గుడ్లు, చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారంలో ఇది అధికంగా లభిస్తుంది.
శాకాహారులు: పాలు, పెరుగు, జున్ను, పనీర్ వంటి పాల ఉత్పత్తులను తప్పనిసరిగా తమ ఆహారంలో చేర్చుకోవాలి.
ఒకవేళ ఆహారం ద్వారా తగినంత విటమిన్ B-12 లభించకపోతే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. విటమిన్ B-12 సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కొందరిలో విరేచనాలు, అలెర్జీ వంటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి సప్లిమెంట్లు వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించడం బెటర్.



Click it and Unblock the Notifications