Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
పెళ్లికి ముందే ఇలా చేస్తున్నారా అని గమనించండి, నిలువునా ముంచేస్తే ఏం చేస్తారు
సహజీవనం చేస్తున్న భాగస్వాముల బుద్ది కనుగొనడానికి డేటింగ్ ఒక గొప్ప మార్గం. మీరు మీ జీవితాన్ని వారితో పంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కొన్ని సంకేతాలు మీకు సహాయపడతాయి. కానీ అనారోగ్యకరమైన సంబంధాలను సూచించే హెచ్చరిక సంకేతాల గురించి సహజీవనం చేస్తున్న యువతి, యువకులు తెలుసుకోవడం చాలా అవసరం.
ఎందుకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది కాబట్టి. సహజీవనం చేస్తున్న భాగస్వామిని మీరు పెళ్లి చేసుకోవాలా, వారి బుద్ది ఎలా ఉంటుంది అని ఈ చిన్న చిట్కాల గురించి తెలుసుకోండి. మీ భాగస్వామి అసలు స్వరూపం తెలుసుకున్న తరువాత వారిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలా ?, లేక సహజీవనంతోనే సరిపెట్టుకుని అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలా అని మీరే నిర్ణయించుకోండి.

* ప్రేమ పేరుతో పెద్ద బాంబు వేస్తారు
ప్రారంభంలో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీపై అధిక శ్రద్ధ చూపించి ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ ఎప్పుడంటే అప్పుడు బహుమతులు ఇస్తుంటే అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ టెక్నిక్ తో మీరు ఆవ్యక్తి గురించి తెలుసుకోవటానికి ముందే వారు మిమ్మల్ని తీవ్రమైన భావోద్వేగ బంధంతో కట్టిపడేయాలని చూస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి.
* హద్దుల పట్ల గౌరవం లేకపోవడం
సహజీవనం చెయ్యడం మొదలు పెట్టి కొంతకాలం తరువాత మీ అభ్యర్థనలను వాళ్లు విస్మరిస్తారు, మీకు అసౌకర్యంగా ఉన్న విషయాలలోకి మిమ్మల్ని నెట్టివేస్తారు. కొన్ని విషయాల్లో మీరు'నో చెప్పినా వారు మీ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మీ మనోభావాలను విస్మరిస్తారు. మీ హద్దులను గౌరవించని వ్యక్తి మీకు వ్యక్తిగతంగా విలువ ఇవ్వడు. మీకు జీవితాంతం తోడు ఉండడు అని గుర్తు పెట్టుకోండి.
* మిమ్మల్ని కంట్రోల్ చెయ్యాలని చూస్తారు
మీ ప్రవర్తనను నియంత్రించడానికి ప్రయత్నించడం, చిన్న విషయమైనా బహిరంగంగా మిమ్మల్ని, మీ ప్రవర్తనలను నియంత్రించడాని ప్రయత్నిస్తారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి మిమ్మల్ని వేరుచేయడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎల్లప్పుడూ వారితో ఉండాలని ప్లాన్ చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ ప్రవర్తనను కంట్రోల్ చెయ్యడానికి మీతో సహజీవనం చేస్తున్న వ్యక్తి లేదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని వెంట తిరిగే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడా అని గమనించాలి.
* మీ భావాలను విస్మరిస్తున్నాడా
మీ భావాలను గౌరవించనట్లయితే మీరు మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు వారు పట్టించుకోకపోతే, మీకు ముఖ్యమైన వాటిని వారు విస్మరిస్తే మీరు కచ్చితంగా పప్పులో కాలేసినట్లే. వెంటనే ముందూ వెనుకా ఆలోచించకుండా మీ భాగస్వామిని తిరస్కరించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన భాగస్వామ్యంలో భావోద్వేగ మద్దతు ఉంటుంది. మమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యడం లేదా చిన్నతనంగా చూడటం కచ్చితంగా చెయ్యడు.
* చులకనగా చూడటం....నిరంతరం విమర్శలు చెయ్యడం
నిర్మాణాత్మక అభిప్రాయం వృద్ధిలో భాగమైనప్పటికీ స్థిరమైన ప్రతికూలత మిమ్మల్ని మానసికంగా హరించవచ్చు. ఇలాంటివే రానురాను ఇద్దరి మధ్య విషపూరిత ద్వేష వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని క్రమం తప్పకుండా విమర్శిస్తే లేదా మీ లోపాలపై దృష్టి సారిస్తే అది మీకు రెడ్ సిగ్నల్ పడుతోంది అని గుర్తుంచుకోండి.

* బాధ్యత తీసుకోలేకపోవడం
బాధ్యత అనేది గుర్తు లేకుండా మీతో తిరుగుతూ మీ సంపాధనతో ఎంజాయ్ చేస్తూ గాలికి తిరగడం అలవాటు చేసుకుంటున్నారా అని గమనించండి. ఇలాంటి వాళ్లు నిరంతరం ఇతరులను నిందిస్తారు, హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తారు. వారి ప్రవర్తనకు ఎక్కడాలేని సాకులు వెతుకుతారు-అంటే బాధ్యత నుండి తప్పించుకుంటున్నారని మీరు గమనించాలి. ప్రేమించిన వ్యక్తి అయినా, సహజీవనం చేస్తున్న వ్యక్తి అయినా ఇలాంటి కుంటిసాకులు చెబితే మీరు ఇప్పుడే బ్రేకప్ చెప్పడం మీకే మంచింది.
* విలువలలో తేడాలు అసమతుల్యత
అనేది కొన్ని వ్యత్యాసాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ కొన్ని మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి. జీవిత లక్ష్యాలు, కుటుంబం, ఆర్థిక విషయాలు, కమ్యూనికేషన్ స్టైల్స్ వంటి ప్రధాన విలువలు, ప్రధాన వ్యత్యాసాల తరువాత తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. ప్రేమించే సమయంలో లేదా సహజీవనం చేస్తున్న సమయంలో మీ భాగస్వామికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అని మీరు గమనించి సరైన నిర్ణయం తీసుకుంటే మీకే మంచింది.
తీరా అన్ని అయిపోయిన తరువాత బాధపడితే ఎలాంటి ఫలితం ఉండదు. మీరు ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన సంబంధానికి అర్హులు అవునా కాదా అని తెలుసుకోండి. డేటింగ్ ప్రక్రియలో మీరు చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శ్రేయస్సుకు మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే మన కళ్ల ముందు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి జాగ్రత్తపడండి.



Click it and Unblock the Notifications