Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఫస్ట్ నైట్.. మీకు ఫస్ట్ టైమా? శోభనం గురించి ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి
పెళ్లి.. ఇద్దరు వ్యక్తులకు, రెండు కుటుంబాలకు సంబంధించిన అంశం. వివాహంతో కొత్త జీవితం మొదలవుతుంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు జీవితాంతం కలిసి మెలిసి, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని కోరుకుంటారు. పెళ్లి గురించి ఎన్ని కలలు కంటారో.. శోభనం గురించి అంతే ఎక్కువగా ఆలోచిస్తుంటారు చాలా మంది. చాలా మందికి ఇదో కొత్త అనుభవం. శృంగారం ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనను పెంచడమే కాకుండా బంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే ఫస్ట్ నైట్ విషయానికి వస్తే చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహలనే నిజాలు అనుకుని బాధపడతారు, బాధపెడతారు. కాబట్టి శోభనానికి ముందు ఆ అపోహలు ఏంటో, వాటి వెనక నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తస్రావం, నొప్పి కలగాలి!
చాలా మందిలో ఉన్న అపోహ ఇది. మొదటిరాత్రి స్త్రీలకు రక్తస్రావం కావాలని, పురుషులైతే అంగం యొక్క ముందరి చర్మం వెనక్కి వెళ్లి నొప్పి కలగాలని చాలా మంది తప్పుగా భావిస్తారు. రక్తస్రావం జరగడం, నొప్పి కలగడం వ్యక్తులను ఆధారపడి ఉంటుంది. చాలా మంది స్త్రీలలో సెక్స్ కు ముందే క్రీడలు ఆడటం, సైకిల్ తొక్కడం లాంటి పనుల వల్ల హైమెన్ చిరిగిపోయి రక్తస్రావం జరిగిపోతుంది. ఈ హైమెన్ చిరిగిపోని ఆడవారిలో మాత్రమే సెక్స్ సమయంలో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి అంతే.
లైంగిక వ్యాధుల భయం లేదు!
జీవితంలో భాగస్వామి వచ్చినందున ఇక లైంగిక వ్యాధుల(సెక్సువల్లీ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్-STD) రావనకుకోవడం పొరపాటే. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా లైంగిక వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. వ్యాధులేవీ లేవని నిర్ధారించుకునేంత వరకు, మీకు వ్యాధుల భయం పోయేంత వరకు శృంగారంలో కండోమ్ వాడటం మంచిది.
శబ్దాలు చేయకూడదు!
మొదటి సారి శృంగారం గొప్ప అనుభూతితో పాటు కొంత అసౌకర్యాన్ని కూడా ఇస్తుంది. మొదటి సారి సంభోగం ఆడా మగ ఇద్దరిలోనూ కాస్త బాధించవచ్చు. నొప్పి రావొచ్చు. ఇలా నొప్పి వచ్చినా, బాధగా ఉన్నా.. నిశ్శబ్దంగా ఉండాలని అనుకోవద్దు. నొప్పిగా అనిపించినా, సంతృప్తిగా అనిపించినా వ్యక్తీకరించడానికి చిన్న పాటి మూలుగులు చేయవచ్చు. అయితే పోర్న్ వీడియోల్లో చూసినట్లు మాత్రం అస్సలు చేయడానికి ప్రయత్నించొద్దు. పోర్న్ అంటేనే అసహజం, నకిలీ.
కండోమ్ వాడితే సంతృప్తి ఉండదు!
ఇది కేవలం అపోహ మాత్రమే. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పిల్లలు వద్దు అనుకూనే వారు ఉంటారు. సంవత్సరం, రెండేళ్ల తర్వాతే పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి శోభనం రోజు కండోమ్ వాడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అయితే కండోమ్ వాడితే సంతృప్తి ఉండదని, అసలైన మజా ఉండదని చాలా మంది తప్పుగా భావిస్తారు. మార్కెట్ లో చాలా రకాల కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఏదో ఒకటి మీకు సంతృప్తిని ఇస్తుంది
సినిమాల్లో చూసినట్లే ఉంటుంది!
సినిమాలు చూసి అచ్చంగా అలాగే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కాని రియాల్టీలో అలాంటిదేం ఉండదు. సినిమాలు చాలా సార్లు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. సినిమాల్లో చూపినట్లు కావాలనే కోరుకోవడం కూడా హాస్యాస్పదమే. నిజ జీవితానికి, సినిమాకు చాలా తేడా ఉందని గుర్తించడం ముఖ్యం.



Click it and Unblock the Notifications