మొదటి రాత్రి స్త్రీని మెప్పించడానికి మగవారికి పెళ్ళికి ముందే సెక్స్ అనుభవం అవసరమా?

First Night Pros and Cons: మొదటి రాత్రి స్త్రీని మెప్పించడానికి మగవారు పెళ్ళికి ముందే సెక్స్ అనుభవం అవసరమా? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కొంత మంది మగాళ్ళు పెళ్ళి తర్వాత భార్యను పెంపించడం కోసమో..ఆమెను సుఖ పెట్టడం కోసమనో పెళ్ళికి ముందే ఇతరులతో సెక్స్ అనుభవించాలనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వివాహానికి ముందే సెక్స్ అనుభవం అనేది చాలా చెడు అలవాటు. ఎందుకంటే అలా చేయాలనుకున్నప్పుడు ఆ మగాడు పరాయి స్త్రీని ఆశ్రయించాల్సి వస్తుంది. కొంత మంది వేశ్యల వద్దకు వెళుతుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి మొదటి సారి బిడియం, భయంతో వారితో సరిగ్గా గడపలేకపోతారు.

Pre Marital Intercourse

దాంతో ఆ మగాడిలో ఆత్మనూనతా భావం ఏర్పడుతుంది. దానికి తోడు ఆ పాల్గొన్న మహిళ అతని ముఖాన్నే ఛీ...ఛీ నువ్వు దానికి పనికి రావు, నువ్వు వేస్ట్ ఫెలోవి అని ఎగతాలిచేయడం ..ఇలా అయితే నీ పెళ్ళాం ఎవరితోనైనా లేచిపోతుంది అంటూ ఇలాంటి మాటలు నోటికి వచ్చినవి మాట్లాడేస్తుంటారు. దాంతో వారు మరికొంత భయభాంత్రులకు గురిఅవుతారు.

ఇలా చాలా ఈజీగా మగాడి గురించి మాట్లాడటం వారికి చాలా చులకనగా మాట్లాడి ఫన్ గా ఫీలయ్యే స్త్రీలు ఉంటారు. అంతే కాదు ఆ మగాడు కాస్త అమాయకుడు అయితే ఇక అంతే.. వాళ్ళతో ఇంకా భయపెట్టే విషయాలు చెబుతూ ఆడుకుంటారు. దాంతో ఆ మగాడు తన మీద తనకే అస్యహించుకోవడం, ఇక నా జీవితం ఎందుకు అని ఒత్తడికి లోనవ్వడం, డిప్రెషన్ కు గురి అవుతారు. కాబట్టి, వివాహానికి పూర్వ లైంగిక సంబంధాలు అనేవి ఏమాత్రం ఉపయోగపడవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇలాంటి విషయాలు లేనిపోని నష్టాలకు గురి చేస్తాయి. అంతే కాదు కొంత మంది ఒకసారి అలవాటు పడి, తిరిగి వెళ్ళాలనే కోరికతో మళ్ళీ మళ్ళీ వెళ్లడం వల్ల లేనిపోని జబ్బులను తగిలించుకుంటారు. ముఖ్యంగా మగవారిలో సెక్స్ కు సంబంధించిన వ్యాది హెర్పిస్ , సిఫిలిస్, గనేరియా, హెచ్ ఐవి రావచ్చు. సైకలాజికల్ గా మాత్రమే కాకుండా మానసికంగా కుంగుబాటుకు దారి తీసి ప్రాణాలను తీసుకునేందుకు కారణం అవుతుంది.

Pre Marital Intercourse

కొంత మంది కండోమ్ లు వాడేటప్పుడు వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇలాంటి మానసిక, ఆర్థిక మరియు ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఒకసారి ఏదై జబ్బుల బారిన పడినప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది? కాబట్టి, ఎట్టి పరిస్థతిలోనూ ఇలాంటి తప్పులు చేయడం కరెక్ట్ కాదు.

కాబట్టి పెళ్ళైన తర్వాత సెక్స్ అనుభవం నేర్చుకోవాలి. కావాలంటే సెక్స్ పైన సెక్స్ ఎడ్జుకేషన్, సెక్స్ అంటే ఏమిటి , యాంగిల్స్ ఏంటి, మొదటి రాత్రి ఎలా ఉంటుంది. ఇలాంటి వన్నీ, పుస్తకాలు, పేపరల్స్ , కొన్ని హెల్త్ అండ్ సెక్స్ ఎడ్జుకేషన్ వెబ్ సైట్ లో పొందుపచడబడి ఉంటుంది. ఇలాంటి వాటిని నాలెడ్జ్ కోసం మాత్రం తెలుసుకోవచ్చు. ఇందులో ఎలాంటి తప్పు ఉండదు.

ఇలాంటి ఇన్ఫెర్మేషన్ బుక్స్ లో అన్ని విషయాలు వివరించబడి ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వీటిని ఎలా అధిగమించాలి, మానసిక, శారీరక నియమాలు ఏ విధంగా ఉండాలి. ఇలాంటి విషయాలన్నింటిని తెలుసుకోవచ్చు. ఇలా నాలెడ్జ్ కోసం తెలుసుకోవడంలో తప్పేముండదు. కానీ ఈ రకంగా పరాయి స్త్రీ తో అనుభాలు పొందాలనుకోవడం చాలా తప్పు. దీని వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభాలుండవు. హాని కలుగుతుంది. అందుచేత ఇలాంటివి ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఆరోగ్యంతో పాటు మీపై మీ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. హెల్తీగా మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేయండి.

Desktop Bottom Promotion