Latest Updates
-
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? - శుక్రవారం, 05 జూన్ 2026 -
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి
First Night: శోభనం రాత్రి ఏం చేస్తారు? అదే అనుకుంటే పొరబడినట్లే..నిజంగా జరిగేది ఇదేనట!
పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతుంది. దీనిని తెలుగులో శోభనం అని పిలుస్తారు. ప్రతి జంటకు ఈ రాత్రి చాలా చాలా ప్రత్యేకమైనది. జంటలు తమ కలలను పండించుకునే రాత్రిగా ఫస్ట్ నైట్ గురించి చెబుతుంటారు. శోభనం రాత్రిని మన సంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. తొలిరేయి అనేది దంపతులిద్దరూ మానసికంగా,శారీరంగా ఒక్కటయ్యే మధురమైన ఘట్టం ఇది. ఫస్ట్ నైట్ అనగానే మన కళ్ల ముందు.. మల్లెపూలు,గులాబీలతో అలంకరించిన మంచం, కొవ్వొత్తులు, శృంగారభరితమైన సంగీతం, మంచం పక్కనే ప్లేట్ నిండా స్వీట్లు, చేతిలో పాలగ్లాసుతో సిగ్గుపడే వధువు,ఆతృతగా మంచం మీద ఎదురుచూస్తుండే వరుడు.. ఇలా ఓ అందమైన కలల ప్రపంచం కళ్ల ముందు కదలాడుతుంది.
అయితే అసలు సినిమాల్లో, నవలల్లో వర్ణించే తొలిరేయి అనుభవం నిజ జీవితంలో కూడా ఉంటుందా? కొత్తగా ఒక్కటైన జంట ఆ రాత్రి ఏం చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి 'లవ్ మ్యాటర్స్ ఇండియా' సంస్థ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది.

సంప్రదాయం వేరు..వాస్తవం వేరు
కొత్తగా పెళ్లయిన జంటలు, సహజీవనంలో ఉన్నవారి ఫస్ట్ సైట్ ఎలా గడిచిందో అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ,బెంగళూరు, హైదరాబాద్,జైపూర్,కొచ్చి,చండీగఢ్,ఇండోర్,ముంబై నగరాల్లో మొత్తం 2500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ల వయస్సు 22-38 ఏళ్ల మధ్య ఉంది. ఈ సర్వేలో బయటపడ్డ వాస్తవాలు మన ఊహలకు పూర్తి భిన్నంగా, ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ఆ రాత్రి నిజంగా ఏం జరుగుతుందో,సర్వేలో పాల్గొన్నవాళ్లు ఏం చెప్పారో ఇక్కడ చూడండి.
కనీసం కదలడానికి కూడా ఓపిక లేదు
సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 42 శాతం మంది చెప్పిన మాట ఇది. అంటే దాదాపు సగం జంటలు తమ మొదటి రాత్రి శృంగారం కంటే హాయిగా నిద్రపోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రోజుల తరబడి లేదా గంటల తరబడి సాగే పెళ్లి తంతు,భావోద్వేగపరమైన ఒత్తిడి, ఆందోళన,సుదీర్ఘ ప్రయాణాలు, వేడుకల వల్ల కలిగిన శారీరక అలసట వల్ల దంపతులు శోభనం రాత్రి నిద్రపోతున్నారట. జైపూర్ కు చెందిన నవ వధువు స్వాతి తన అనుభవం గురించి .."దాదాపు 16 గంటల పాటు పెళ్లి వేడుక జరిగింది. ఆ తర్వాత నా లక్ష్యం ఒకటే. ఎలాగైనా ఆ బరువైన లెహంగా తీసేసి, ముఖం కడుక్కుని మంచం మీద వాలిపోవాలి. అంతే మేమిద్దరం పడుకుని నిద్రపోయాం" అని చెప్పింది.
రాత్రంతా కబుర్లతోనే సరిపోయింది
ప్రతి నలుగురు జంటల్లో ఒక జంటకు వారి ఫస్ట్ నైట్ ఒక లోతైన సంభాషణకు వేదికైంది. పెళ్లి హడావుడి అంతా ముగిశాక, వారికి దొరికిన మొట్టమొదటి ఏకాంత క్షణం అదే. ఆ సమయంలో వారు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు, పెళ్లి గురించిన భయాలు, బంధువుల గురించి, భవిష్యత్ ప్రణాళికలు, కెరీర్, తమ ప్రయాణపు కలల గురించి మాట్లాడుకుంటూ గడిపేశారట.
యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ చూస్తూ గడిపేయడంతోనే సరిపోయింది
సర్వేలో పాల్గొన్న 12శాతం మంది తాము ఫస్ట్ నైట్ రోజు నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ చూస్తూ గడిపినట్లు చెప్పారు. సర్వేలో పాల్గొన్న నీతి అనే అమ్మాయి" మేమిద్దరం చాలా సిగ్గుపడ్డాం, ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకే, మాకు ఇష్టమైన వెబ్ సిరీస్ పెట్టుకుని చూస్తూ, చివరికి ఒకరినొకరం కౌగిలించుకుని నిద్రపోయాం"అని చెప్పింది. స్టాండప్ కామెడీలు, రొమాంటిక్ వెబ్ సిరీస్ లు, క్రైమ్ స్టోరీలు వారి మొదటి రాత్రికి తోడుగా నిలిచాయి.
ఫుడ్ ఆర్డర్ చేసి తినడం
8శాతం మంది ఫస్ట్ నైట్ అప్పుడు ఫుడ్మ ఆర్డర్ చేసుకొని తిన్నారట. పెళ్లి హడావుడిలో సరిగ్గా తినడానికి కూడా సమయం ఉండదు. అందుకే, కొందరు జంటలు తమ మొదటి రాత్రిని ఫుడ్ ఫెస్టివల్‌గా మార్చేశారు. బటర్ చికెన్, బిర్యానీ వంటివి ఆర్డర్ చేసుకుని కడుపునిండా తినడం వారి అత్యంత సన్నిహిత క్షణంగా మారింది. సర్వేలో పాల్గొన్న డానిష్ అనే వ్యక్తి మాట్లాడుతూ..తాము రోజంతా పస్తులున్నాం. అర్ధరాత్రి ఆ పనీర్ టిక్కా తింటుంటే అదే ప్రపంచంలోకెల్లా గొప్ప రొమాన్స్‌లా అనిపించింది" అని అన్నాడు.
స్నానం, స్కిన్ కేర్ తోనే సరిపోయింది
11 శాతం మంది ముఖ్యంగా మహిళలు పెళ్లి వేడుకలో తలనిండా పెట్టుకున్న పిన్నులు, బరువైన దుస్తుల నుండి విముక్తి పొందడమే అతిపెద్ద ఉపశమనంగా భావించారు. ఎక్కువసేపు స్నానం చేయడం, సౌకర్యవంతమైన నైట్ వేర్ వేసుకోవడం, షీట్ మాస్క్‌లు వేసుకోవడం వంటివి చేస్తూ రిలాక్స్ అయ్యారు. ప్రియా అనే అమ్మాయి.." నా తలలో ఉన్న 40 హెయిర్ పిన్నులను తీయడానికి నా భర్త సహాయం చేశాడు. నా దృష్టిలో అదే నిజమైన ప్రేమ" అని చెప్పింది.
అట్టర్ ఫ్లాప్
ప్రతి ఐదు జంటల్లో ఒకరు దాదాపు 20శాతం మంది మొదటి రాత్రిని పూర్తిగా మిస్ చేసుకున్నారు. ఇబ్బంది, పక్క గదిలోనే తల్లిదండ్రులు ఉండటం, అమ్మాయికి అనుకోకుండా పీరియడ్స్ రావడం, లేదా మూడ్ పాడుచేసే సంఘటనలు జరగడం వంటి కారణాల వల్ల వారి ప్రణాళికలు బెడిసికొట్టాయి. అంజలి అనే అమ్మాయి మాట్లీడుతూ.."బహుమతులు ఇవ్వాలంటూ మా అత్తమామలు అర్ధరాత్రి వరకు తలుపు తడుతూనే ఉన్నారు. మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుని, సైలెంట్‌గా ఉండిపోయాం" అని చెప్పారు.

సినిమాల్లో లాగా పర్ఫెక్ట్ ఫస్ట్ నైట్
తెలుగు సినిమాల్లో మనం చూసే క్యాండిల్ లైట్, రొమాన్స్ తో కూడిన పరిపూర్ణమైన ఫస్ట్ నైట్ అనుభవించామని చెప్పింది కేవలం 4శాతం మంది మాత్రమే. కానీ ఆ సందర్భాలలో కూడా వారిలో చాలామంది మొదటిసారి కలిగిన భయం, ఆందోళన వంటి భావాలను వ్యక్తం చేశారు.
నిపుణులు ఏమంటున్నారో చూడండి
సైకాలజీ నిపుణుల ప్రకారం.. ఫస్ట్ నైట్ శారీరక కలయికకు మించిన ఒక పరివర్తన దశ. ఆ రాత్రి శారీరక సాన్నిహిత్యం కంటే భావోద్వేగ భద్రత, పరస్పర గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బలవంతపు సాన్నిహిత్యం బంధాన్ని దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications