Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
మొదటిసారి శృంగారం తర్వాత.. మహిళల శరీరంలో జరిగే సహజ మార్పులివే..!
ఎవరికైనా జీవితంలో ఏదైనా తొలి అనుభూతి ఎప్పటికీ మధురంగానే ఉండిపోతుంది. అది తొలిసారి మనసు పంచుకున్న ప్రేమ అయినా.. తొలిసారి ఇష్టంగా శరీరాన్ని పంచుకున్న కలయిక అయినా. అయితే తమ భాగస్వామితో ఏకాంతంగా, అందంగా సమయం గడపాలని ప్రతి జంటా కోరుకుంటుంది.
అయితే తొలిసారి మంచం మీద అడుగుపెట్టే ముందు, కలయిక తర్వాత మహిళల శరీరంలో జరిగే కొన్ని సహజ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన భయాలకు గురయ్యే బదులు ఈ శారీరక మార్పులపై సరైన అవగాహన పెంచుకుంటే ఆ క్షణాలు మరింత అందంగా మారతాయని నిపుణులు సూచిస్తున్నారు.

నొప్పి ఎందుకు వస్తుంది?
మొదటిసారి కలయికలో మహిళలు ఆనందం కంటే నొప్పినే ఎక్కువగా అనుభవిస్తారని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) తాజా అధ్యయనంలో తేలింది. దాదాపు 75 శాతం జంటలు దీనిని ఎదుర్కొంటారు.
మన సమాజంలో శృంగారంలో మీద ఉన్న ఎన్నో అపోహల వల్ల మహిళల్లో ఒకరకమైన భయం, ఆందోళన ఉంటాయి. ఈ మానసిక ఒత్తిడి వల్ల జననేంద్రియాలు పొడిబారుతాయి. తగినంత లూబ్రికేషన్ లేకపోవడం వల్లే తొలిసారి నొప్పి కలుగుతుంది.
రక్తస్రావం కావడం సహజమేనా?
కెనడియన్ మెడికల్ జర్నల్ డేటా ప్రకారం..తొలి కలయిక తర్వాత కొద్దిమందిలో (0.7-9%) జననేంద్రియాల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కన్నెపొర (Hymen) చిరగడం వల్లే ఇలా జరుగుతుందంట. దీనికి కంగారు పడాల్సిన పనిలేదని.. ఇది గంటల్లో లేదా మహా అయితే ఒక రోజులో తగ్గిపోతుందని.. ఒకవేళ రక్తస్రావం ఆగకపోతే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
మంట, చికాకు, ఇన్ఫెక్షన్లు
చాలామంది మహిళలు మొదటిసారి తర్వాత జననేంద్రియాల్లో మంట, చికాకును ఎదుర్కొంటారు. లూబ్రికేషన్ లేనప్పుడు జరిగే ఘర్షణే దీనికి కారణం. నడుస్తున్నప్పుడు లేదా మూత్రవిసర్జన సమయంలో ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ఒక్క రోజులో సర్దుకుంటుందట.
అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు (UTI), అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే జంటలు ఖచ్చితంగా కండోమ్ వాడాలని.. ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా సురక్షితంగా ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
తాత్కాలిక శారీరక మార్పులు
మొదటిసారి శారీరక కలయిక సమయంలో ఉద్వేగం కారణంగా రొమ్ముల పరిమాణంలో తాత్కాలిక మార్పులు రావడం, నిపుల్స్ దృఢంగా మారడం సహజమని.. ఇది కేవలం ఆ సమయంలో మాత్రమే ఉంటుంది, కొద్దిసేపటికే స్త్రీ శరీరం మునుపటి సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు.
దీర్ఘకాలిక ప్రయోజనాలు
తొలిసారి కాస్త ఇబ్బంది పెట్టినా.. కన్నెపొర తొలగిపోయి జననేంద్రియాల నిర్మాణంలో మార్పు రావడం వల్ల క్రమంగా అలవాటు పడిన తర్వాత నొప్పి తగ్గి ఆనందం పెరుగుతుందట.. వారానికి కనీసం ఒక్కసారైనా ఆరోగ్యకరమైన కలయికలో పాల్గొంటే శరీరంలో ఆక్సిటోసిన్(హ్యాపీ హార్మోన్) విడుదలవుతుంది.
ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications