వీటి కోసమైనా తరచూ శృంగారంలో పాల్గొనాలి, అవేంటో తెలుసుకోండి

క్యాన్సర్ సహా గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య ప్రమాదాలను తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడాలా.. మంచి నాణ్యమైన నిద్ర కావాలా.. వీటన్నింటికి మంచి పరిష్కారంతో పాటు సుఖాన్ని, సంతృప్తిని, సౌఖ్యాన్ని ఇచ్చే దివ్యౌషధమే శృంగారం. సెక్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలకు శృంగారం చక్కటి పరిష్కారమని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్‌. ఈ ప్రయోజనాల కోసమైనా తరచూ సెక్స్‌ చేస్తుండాలని చెబుతున్నారు.

తరచూ శృంగారం చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక, భావోద్వేగ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి.

Five Healthy Reasons You Should Have Romance In Telugu


1. మెరుగైన గుండె ఆరోగ్యం:

శృంగారం అనేది ఏరోబిక్ వ్యాయామం లాంటిది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. వారానికి రెండు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులు, నెలకు ఒకసారి మాత్రమే చేసే వారి కంటే గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తక్కువగా ఉంటుందని తేలింది. సెక్స్ చేయడం మంచి వ్యాయామంగా చూడాలని అంటారు వైద్యులు. PLoS వన్ జర్నల్‌లో 2013లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ట్రెడ్‌మిల్‌పై చేసే వ్యాయామం కంటే సెక్స్ వల్ల కరిగే కేలరీలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని తేలింది.


2. పెయిన్ రిలీఫ్:

సెక్స్ లో పాల్గొనడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయట. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం, అనస్థీషియాలజిస్టులు కొంత మంది ఔత్సాహికులకు శృంగార భాగస్వాములు ఫోటోలు, మరికొంత మందికి ఇంకేదైనా పని చేయాలని చెప్పారు. అందులో శృంగారం భాగస్వాములను చూడటం వల్ల నొప్పి గణనీయంగా తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే శృంగారంలో మహిళలు పొందే భావప్రాప్తి వల్ల మహిళల్లో వచ్చే ఋతు తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తున్నట్లు తేలింది.


3. ఒత్తిడి, రక్తపోటు తగ్గుతుంది:

సెక్స్ చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఇది మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుంది. బయోలాజికల్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించిన స్కాటిష్ అధ్యయనంలో లైంగిక చర్య ఒత్తిడిని తగ్గించడంతో పాటు రక్తపోటు పెరుగుదలను నిరోధిస్తుందని వెల్లడైంది. హస్త ప్రయోగం కంటే కూడా భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎక్కువ ప్రయోజం ఉంటుందని తేలింది.


4. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

యూరోపియన్ యూరాలజీ జర్నల్ లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. ఎక్కువగా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని వెల్లడైంది.

5. శృంగారంతో మరింత మెరుగైన నిద్ర:

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, శృంగార ఉద్వేగం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మంచి నిద్రను, విశ్రాంతిని కలిగిస్తుంది. గాఢమైన సెక్స్ చేసిన తర్వాత నిద్రలోకి జారుకోవడం, చాలా రిఫ్రెష్ గా మేల్కోవడం చాలా సాధారణమని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అలాగే ఇది రివర్స్ లో కూడా పని చేస్తుందని 2015 లో జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో పాల్గొన్న ఓ అధ్యయనం తేల్చింది. మహిళలు ఎక్కువ సేపు నిద్రపోయి మేల్కొంటే వారికి లైంగిక కోరికలు సాధారణం కంటే ఎక్కువగా వస్తాయని వెల్లడైంది.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Sunday, June 25, 2023, 20:30 [IST]
Desktop Bottom Promotion