Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రియురాలి ఇంటికి వెళ్లిన యువకుడికి దిమ్మతిరిగే షాక్..ఆ సీన్ చూసి కుప్పకూలిపోయాడు!
ఏ బంధంలో అయినా నమ్మకం ఉండాలి. అప్పుడే అది చివరి వరకు నిలబడుతుంది. ముఖ్యంగా ప్రేమలో నమ్మకం కొరవడిన మరుక్షణమే ఆ బంధం కుప్పకూలిపోతుంది. ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యమో, ఆ నమ్మకం దెబ్బతిన్నప్పుడు కలిగే బాధ అంతకంటే భయంకరంగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ యువకుడికి ఎదురైంది.
తన ప్రియురాలిని ఆశ్చర్యపరచాలన్న ఉత్సాహంతో వెళ్లిన అతనికి, అక్కడ కనిపించిన దృశ్యం జీవితాంతం మర్చిపోలేని షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ వేదికగా ఒక యువకుడు పంచుకున్న ఈ విషాద ప్రేమకథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?
ఓ యువకుడు గత తొమ్మిది నెలలుగా ఒక యువతితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఒక రోజు తన ప్రియురాలి ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే గేటు దాటి లోపలికి వెళ్లగానే ఇంటి ఆవరణలోని ఒక మామిడి చెట్టు కింద తన ప్రియురాలు నిలబడి నవ్వుతూ కనిపించింది.
అయితే ఆమె పక్కన ఎనిమిదో తరగతి నుంచి తనకు ప్రాణ స్నేహితుడిగా ఉన్న వ్యక్తి. వారిద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ, క్షణాల్లోనే ఒకరినొకరు గాఢంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో వారికి ప్రపంచంతో సంబంధం లేనట్లు ఎటువంటి సంకోచం లేకుండా ప్రవర్తించారు.
మౌనంగా వెనుదిరిగిన ప్రేమికుడు
తన ప్రాణంగా భావించిన ప్రేయసి తనను అండగా అనుకున్న స్నేహితుడు.. ఇద్దరూ కలిసి తనను వంచిస్తున్నారని అర్థమయ్యాక ఆ యువకుడు కుప్పకూలిపోయాడు. కానీ అతను అక్కడ గొడవ చేయలేదు, అరవలేదు. ఆ దృశ్యాన్ని చూడలేక వణుకుతున్న చేతులతో నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఇంటికి చేరుకుని మంచంపై పడి కన్నీరుమున్నీరయ్యాడు.
తర్వాత వారిద్దరికీ మెసేజ్ చేసినప్పటికీ వారి ప్రవర్తనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడాన్ని చూసి అతను మరింత కృంగిపోయాడు. నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. కానీ 9 నెలల ప్రేమ, చిన్ననాటి స్నేహం నన్ను మోసం చేశాయి. నా స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు? అని రెడ్డిట్ లో తన ఆవేదనను వెల్లగక్కాడు.
నెటిజన్ల మద్దతు
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ యువకుడికి అండగా నిలిచారు. అతనికి ధైర్యం చెబుతూ సలహాలు ఇస్తున్నారు. ముందు ఆ విషపూరితమైన సంబంధం నుంచి బయటపడు. పగ, ప్రతీకారం గురించి ఆలోచించవద్దు. అవి చివరికి నిన్నే దహించేస్తాయి..నువ్వు చేయగలిగిన గొప్ప పని ఒక్కటే..బాగా చదువుకుని, మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించు. నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడమే వారికి నువ్వు ఇచ్చే నిజమైన సమాధానం అని ఒకరు కామెంట్ చేశారు.
ఆ శూన్యత నిన్ను మింగేయకముందే నువ్వు కోలుకోవాలి. నిన్ను నువ్వు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకో అని మరొకరు సూచించారు.
మొత్తానికి ఈ ఘటన, నమ్మినవారే మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.



Click it and Unblock the Notifications