Latest Updates
-
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే
తొలిసారి శృంగారంలో పాల్గొంటున్నారా? ఈ కిటుకు తెలిస్తే రెట్టింపు ఆనందం పొందవచ్చు
తొలిసారి శృంగారంలో పాల్గొనేటప్పుడు ఎవరైనా దాని గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు,చాలా ఉద్విగ్నతకు లోనవుతారు. మీ భాగస్వామి ఇష్టాలు, అయిష్టాల గురించి మీకు ఏమీ తెలిసి ఉండకపోవచ్చు.. భయం కారణంగా మీరు వారిని ఏమీ అడగలేకపోయే అవకాశం ఉంటుంది. దీంతో చాలాసార్లు మీరు మీ భాగస్వామికి నచ్చని కొన్ని తప్పులు చేస్తారు. కాబట్టి ఫస్ట్ టైం రతిక్రీడలో పాల్గొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. దీంతో మీ భయం తగ్గుతుంది, ఎటువంటి భయాందోళన లేకుండా భాగస్వామితో మీ సంభోగ సమయాన్ని ఆస్వాదించగలరు.
లైంగిక పరిశుభ్రత
సంభోగంలో పాల్గొనే ముందు, తర్వాత కూడా మీ ప్రైవేట్ భాగాలను పూర్తిగా శుభ్రం చేసుకోండి. రెగ్యులర్ గానే మీ ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు సంభోగానికి ముందు హఠాత్తుగా దాని కోసం గాబరా పడాల్సిన అవసరం లేదు. దీంతో పాటు శృంగారంలో పాల్గొనే ముందు మీ చేతులను బాగా కడగాలి. తద్వారా సంభోగం సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు, మీ భాగస్వామి కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కోకూడదు.

ఇద్దరూ పూర్తిగా సిద్ధం
ఇద్దరూ సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే సంభోగంలో పాల్గొనాలని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు ఒకరిపై ఒకరు విధించుకోకండి, ఒకరినొకరు అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు, మీ భాగస్వామి ఇద్దరూ ఈ ప్రత్యేక క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు.
సురక్షితమైన
మొదటిసారిగా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండబోతున్నందున సురక్షితమైన సంభోగం పట్ల శ్రద్ధ వహించండి . అవాంఛిత గర్భం, ఇన్ఫెక్షన్, ఏ రకమైన వ్యాధిని నివారించడానికి కండోమ్స్ దగ్గర ఉంచుకోండి. అదే సమయంలో మొదటి సారి సంభోగం కారణంగా లూబ్రికేషన్ సమస్య ఉండవచ్చు.
ఓపిక
మొదటిసారి సంభోగం చేయబోతున్నట్లయితే ఓపికతో వ్యవహరించండి. తొందరపాటుతో ఏ తప్పు చేయవద్దు. మీ భాగస్వామిని వెంటనే శృంగారం కోసం బలవంతం చేయకండి, ముందుగా ప్రేమగా మాట్లాడండి. ఒకరి మూడ్‌ని మరొకరు అర్థం చేసుకున్న తర్వాతే సంభోగం వైపు వెళ్లండి. ఈ సమయంలో భాగస్వామి ఏదైనా చేయడానికి సిద్ధంగా లేకుంటే లేదా ఏదైనా చేయడానికి నిరాకరిస్తే బలవంతం చేయవద్దు. ఇది మీ భాగస్వామిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
రెస్ట్
శృంగార కార్యం ఎంతసేపు చేయాలనే విషయంపై అవగాహన చాలా తక్కువ మందికే ఉంటుంది. అయితే ఆ కార్యం ఎంతసేపు జరగాలనేది సంభోగంలో పాల్గొనే ఇద్దరి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీరు లేదా మీ భాగస్వామి సంభోగంలో పాల్గొనడం వల్ల నొప్పిగా అనిపించి తట్టుకోలేనంత బాధతో కన్నీళ్లు వస్తుంటే వెంటనే గ్యాప్ ఇచ్చి కాస్త రెస్ట్ తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
