Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అలసట రాకుండా శృంగారంలో పాల్గొనాలంటే ఈ టిప్స్ పాటించండి,అస్సలు అలసిపోరు!
వివాహబంధంలో శృంగారం అనేది చాలా ముఖ్యం. శృంగార జీవితం బాగుంటుంటేనే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది. కానీ చాలా మంది శృంగారంలో పాల్గొనేటప్పుడు తీవ్రంగా అలసిపోతారు. దీని కారణంగా వారి వారు శృంగారంలో రాణించలేరు. దీంతో ఆ దంపతుల మధ్య దూరం ఏర్పడుతుంది. ఆ దూరం గొడవలకు కారణమవుతుంది. అయితే శృంగారంలో పాల్గొనేటప్పుడు అలసట రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శృంగారంలో అలసట రాకూడదంటే ఏం చేయాలంటే
ఆరోగ్యకరమైన ఆహరం
శృంగారంలో అలసట లేకుండా ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వలన శరీరంలో శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా అలసట అనేది రాకుండా ఉంటుంది.

సరైన నిద్ర
శృంగారంలో అలసట లేకుండా పాల్గొనాలంటే సరైన నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగ్గా లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది. దీనిద్వారా శృంగారంలో పాల్గొన్నప్పుడు తొందరగా అలసట వస్తుంది. దీని కారణంగా శృంగార జీవితం అనేది తీవ్రంగా ప్రభావితం అవుతుంది.
వ్యాయామం
శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే శరీరం అనేది త్వరగా అలసిపోతుంది. అందుకే ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. దీంతో శృంగారంలో పాల్గొన్నప్పుడు అలసట రాకుండా ఉంటుంది.
ఒత్తిడిని తట్టుకోవాలి..
శృంగారంలో విఫలమవడానికి ముఖ్యమైన కారణాలు ఏదైనా ఉందంటే అది ఒత్తిడి. ఒత్తిడి కారణంగా శృంగారంలో చాలా మంది విఫలమవుతుంటారు. అయితే ఒత్తిడిని సరిగ్గా నిర్వహించుకోగలిగితే శృంగారంలో మీరే కింగ్ అవుతారు. దీనిని జయించడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది.
ఆల్కహాల్, ధూమపానం వదిలేయాలి..
శృంగారంలో అలసట రాకుండా ఉండాలంటే కచ్చితంగా చెడు అలవాట్లను మానేయాలి. అందులో ధూమపానం, ఆల్కహాల్ వంటి అలవాట్లను మానేయాలి. ఈ అలవాట్లు శృంగారంలో పాల్గొన్నప్పుడు తొందరగా అలసిపోవడానికి కారణమవుతాయి. అలాగే పుష్కలంగా నీరు తాగాలి.



Click it and Unblock the Notifications