Latest Updates
-
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది?
శృంగారాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలా? ఏం తినాలో, ఏం తినొద్దో తెలుసా?
శృంగారాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని, తనివితీరా ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ అందరికీ, అన్ని సమయాల్లో అలాగే ఎంజాయ్ చేయడం కుదరదు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మానసిక, శారీరక, భావోద్వేగ కారణాల వల్ల శృంగారాన్ని ఆస్వాదించలేకపోవచ్చు.
లైంగిక జీవితాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి, మరింత మెరుగ్గా ఆస్వాదించడానికి, ఆనందించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. శృంగారం చేయడానికి పడకగదిలోకి వెళ్లే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారానికి దూరంగా ఉంటే శృంగారాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుల్లలు(ఆయిస్టర్స్):
ఆయిస్టర్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగపరచడంలో, సెక్స్ డ్రైవ్‌ను పెంచడంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ది కీలక పాత్ర. పురుషుల్లో స్పెర్మ్ ని తయారు చేయడానికి జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే స్పెర్మ్ కదలికను మెరుగుపరుసుతంది. ఆయిస్టర్స్ తినడం ఇష్టం లేకపోతే జింక్ ఎక్కువగా ఉండే బీఫ్, పోర్క్, తృణధాన్యాలు, గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు, పెరుగు వంటివి తీసుకోవాలి.
2. దానిమ్మ:
దానిమ్మను సంతానోత్పత్తికి చిహ్నంగా, సెక్స్ ను మెరుపరిచేదిగా చూస్తారు. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి పడకగదిలో శృంగారాన్ని ఎంజాయ్ చేసే అంశాలే.
3. డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ తినడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ఆనందాన్ని, మంచి మూడ్ ను కలిగిస్తుంది. డార్క్ చాకొలెట్ మూడ్ బూస్ట్ గా కూడా పని చేస్తుంది. దీని వల్ల సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుంది. దీని వల్ల ఫెనిలేథైలమైన్ కూడా ఉంటుంది.
4. పాలకూర:
పాలకూరను తీసుకోవడం వల్ల శృంగారం మెరుగుపడుతుందట. ఆకుకూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది. పాలకూరలో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల కోరిక, ఉద్రేకం, ఉద్వేగం, లైంగిక సంతృప్తి కలుగుతుంది.
5. పుచ్చకాయ:
పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని శరీరం ఆర్జినైన్ గా మారుస్తుంది. ఇది రక్తనాళాలను విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే మరో అమైనో ఆమ్లం. రక్తప్రసరణను పెంచి అంగస్తంభన సమస్యలను పరిష్కరిస్తుంది.
6. అవకాడో:
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పైబర్ పుష్కలంగా ఉంటాయి. అవకాడోలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఇది అలసట, ఉబ్బరం, క్రాంకినెస్ వంటి పీఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో ఒక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ స్త్రీలు రొమాంటిక్ మూడ్ లోకి రావడాన్ని సులభతరం చేస్తాయి.

శృంగారానికి ముందు వీటిని తీసుకోవద్దు:
ఆల్కహాల్:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైంగిక జీవితంపై విపరీతమైన ప్రభావం పడుతుంది. ఆల్కహాల్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ, నరాల సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తులు శృంగారాన్ని ఆస్వాదించలేరు. అలాగే అతిగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. దీని వల్ల అలసట, తలనొప్పితో పాటు యోని పొడిగా మారి శృంగారం అసౌకర్యంగా ఉంటుంది.
శాచురేటెడ్ ఫ్యాట్స్:
కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొవ్వు రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ నెమ్మదించి శృంగారం అసౌకర్యంగా మారుతుంది.
ఉల్లిపాయలు:
శృంగారానికి ముందు ఎట్టిపరిస్థితుల్లో ఉల్లిపాయలు తినకుండా ఉండటం ముఖ్యం. ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుంది. కేవలం నోటి నుండే కాకుండా శరీరం నుండి కూడా దుర్వాసన వస్తుంది. దీని వల్ల మూడ్ పోతుంది.
బీన్స్:
బీన్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో పోషకాలు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే బీన్స్ తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది మలద్వారం గుండా బయటకు వచ్చి చెడు వాసన వస్తుంది. శృంగారం సమయంలో చెడు వాసన మూడ్ ను పాడు చేస్తుంది.



Click it and Unblock the Notifications