Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఇలాంటి భార్యలు ఉంటే భర్తలు మరో అమ్మాయి మొహమే చూడరు, మీరూ అలాగే ఉండాలనుకుంటే.. ఓ లుక్కేయాల్సిందే!
చాలా మంది భార్యలు తమ భర్తలు తమను పట్టించుకోవడం లేదని, అసలు తమతో కలిసి సమయం గడిపేందుకు కూడా పెద్దగా ఇష్టపడరని చెబుతుంటారు. అలాంటి వాళ్లు తమలో ఉండే కొన్ని లక్షణాలను మార్చుకుంటే మీ భర్తలు మీ కొంగు పట్టుకునే తిరుగుతారు. అలా అని అందంగా తయారవండి, ఎక్స్ పోజ్ చేయండని మేము చెప్పం. అలా చేస్తే మీ మీద మోజు పెరుగుతుందే తప్ప గరౌవంతో కూడిన ప్రేమ మాత్రం పెరగదు. ఈ మధ్య కాలంలో భర్త వేరే అమ్మాయితో తిరిగితే భార్యామణి మరింత రెచ్చిపోయి వేరొకరొతే సంబంధం పెట్టుకుంటుంది.

కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే మేము చెప్పబోయే కొన్ని టిప్స్ ను పాటించి మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. హాయిగా, హ్యాపీగా గడిపేలా చేసుకోండి. ముఖ్యంగా మీకు మీ భర్తకు మధ్య బలాన్ని బాగా పెంచుకోండి. ఇవన్నీ జరగాలంటే మీరు పాటించాల్సిన పది లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ భర్తతో నిజాయితీగా ఉండండి:
భార్యాభర్తల మధ్య బంధం చాలా పవిత్రమైనది. అలాగే చాలా సున్నితమైనది. ఒక చిన్న అబద్ధం,ద్రోహం కూడా ఈ సంబంధంలో చీలికను కలిగిస్తుంది. జీవితంలో, సంబంధాలలో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. భర్త పట్ల నమ్మకంగా ఉండడం ప్రతి భార్య విధి. మీరు నిజాయితీగా ఉన్నప్పుడే మీరే తప్పు చేయరని మీ భర్త నమ్ముతారు. అప్పుడు మీ మాట తప్ప మరొకరి మాట నమ్మరు.
2. తప్పులు ఒప్పుకోండి:
తరచుగా మహిళలు తప్పు చేసినప్పుడు ఒప్పుకోరు. వారు తప్పుకు తమ జీవిత భాగస్వామిని నిందించటం ప్రారంభిస్తారు. ఈ అలవాటు మీ సంబంధాన్ని బలహీన పరుస్తుంది. కాబట్టి భార్యలు తమ తప్పులను అంగీకరించాలి. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది.
3. ఎప్పుడూ అబద్ధం చెప్పకండి:
వివాహ బంధంలో నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పాలి. అలాగే సంబంధంలో ఎప్పుడూ అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పే అలవాటు మీ వైవాహిక జీవితపు పునాదిని కదిలిస్తుంది. నిజం ఎంత చేదుగా ఉన్నా.. మీ భర్త ముందు దాచి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల బంధం బలపడుతుంది.
4. మంచి శ్రోత:
ఆడవాళ్ళ నోళ్లలో ఏదీ దాగదు అనడంలో సందేహం లేదు. అయితే మహిళలు కూడా మంచి శ్రోతలుగా ఉండాలి. మీ భర్త చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ భర్త ఆలోచనలు కూడా మీకు అర్థం అవుతాయి.
5. మీ భర్తకు సహాయకురాలిగా ఉండండి:
విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుందని అంటారు. దీని కోసం భార్య తన భర్తకు సహాయకురాలుగా ఉండాలి. ఆయనతో చేయి కలిపి నడవండి. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు నిందించకుండా సాయంగా ఉండాలి. తరచుగా మీ భర్తను ప్రోత్సహిస్తూ.. ముందుకు సాగాలి. మీరిచ్చే భరోసాతోనే ఆయన మళ్లీ మామూలుగా మారుతారు.
6. బలవంతపు నిర్ణయాలు తీసుకోవద్దు:
చాలా మంది మహిళలు తమ భర్తలపై బాధ్యతలు మోపుతారు. ఇది తప్పు. మీ భర్త నిర్ణయాలను మెచ్చుకోండి. మీ భాగస్వామి ఒక నిర్ణయం తీసుకుంటే లేదా మీ అభిప్రాయాన్ని కోరినట్లయితే, పరిస్థితిని పరిశీలించి దానిని అంగీకరించండి.
7. మీ భర్తకు స్వేచ్ఛ ఇవ్వండి:
కొన్నిసార్లు భార్యలు తమ భర్తల జీవితాలపై ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ ఇది మీ సంబంధంలో చీలికకు కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో భాగస్వామికి అవసరమైన స్వేచ్ఛను ఇవ్వడానికి భార్య శ్రద్ధ వహించాలి. మీరు మీ భర్తకు అతని స్థలాన్ని ఇచ్చినప్పుడు అతను మీకు బదులుగా అదే స్వేచ్ఛను ఇస్తాడు.
8. మీ భర్త ప్రయోజనాలలో పాల్గొనండి:
మీ భర్త ప్రయోజనాలపై మీ ఆసక్తిని చూపించడం కూడా చాలా ముఖ్యం. మీ భర్త వంట చేయడం లేదా ప్రయాణం చేయడం ఇష్ట పడితే.. మీరు అతనికి పూర్తి మద్దతు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ బంధం కూడా బలపడుతుంది.
9. సమయం వెచ్చించాలి:
ప్రస్తుతం చాలా మందికి బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల సమయం దొరకడం లేదు. పని చేసే జంటలకు సమయం దొరకడం చాలా మరీ కష్టం. కానీ మీరు మీ భాగస్వామితో గరిష్ట సమయం గడపడానికి ప్రయత్నించాలి. మీరు ఒకరితో ఒకరు ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నారో దాన్ని బట్టే మీకు వారిపై ఉండే ప్రేమ తెలుస్తుంది.
10. మీ భర్తను గౌరవించండి:
ప్రతి భర్త తన భార్య తనను గౌరవించాలని కోరుకుంటాడు. వారిని వ్యక్తిగతంగానే కాకుండా ఇతరుల ముందు కూడా గౌరవంగా చూడాలి. మీరు మీ భాగస్వామిని గౌరవిస్తే, అతను మిమ్మల్ని గౌరవిస్తాడు. ఇలా చేయడం వల్ల భర్త ప్రేమను పొందగలరు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications