Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Pineapple dating: డేటింగ్ యాప్స్ మర్చిపోండి..ఫైనాఫిల్ డేటింగ్ ట్రెండ్ వచ్చేసింది..చాలా ఈజీగా..
ఈ రోజుల్లో ప్రేమించనోళ్లు తక్కువే ప్రేమికులే ఎక్కువ ఉంటున్నారు. అయితే ఆ ప్రేమలు ఎన్ని గంటలు ఉంటున్నాయనేది వేరే విషయం. నిమిషాల్లో ప్రేమలు పుట్టి గంటల్లో బ్రేకప్ లు జరుగుతున్న రోజులివి. ఒకప్పుడు ప్రేమ అంటే రెండు కళ్ల మధ్య పుట్టి, గుండెల్లో గూడు కట్టుకునే ఓ అద్భుతమైన భావన. చూపులతోనే ప్రేమలేఖలు రాసుకున్న ఆ రోజులు ఇప్పుడు పాత కథలుగా మిగిలిపోయాయి. నేటి డిజిటల్ యుగంలో ప్రేమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్లతో మొదలయ్యే బంధాలు, డేటింగ్ యాప్ లలో స్వైపులతో దొరికే భాగస్వాములు నేటితరం ప్రేమకు చిరునామాగా మారాయి. ఈ మార్పులో భాగంగానే సిట్యుయేషన్ షిప్ వంటి కొత్తరకం రిలేషన్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, కమిట్ మెంట్స్, పెళ్లి బంధాలకు దూరంగా కేవలం అవసరాల కోసం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే ఈ ట్రెండ్ సర్వసాధారణమైపోయింది. ఇలాంటి కొత్త ట్రెండ్స్ కోవలోకే ఇప్పుడు మరో వింత ట్రెండ్ వచ్చి చేరింది. అదే పైనాపిల్ డేటింగ్.

ఏంటీ పైనాపిల్ డేటింగ్?
ఒకప్పుడు ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ పువ్వును వాడేవారు. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నవారు తమకు ఒక తోడు కావాలని చెప్పడానికి పైనాపిల్ పండును వాడుతున్నారు. ఇది స్పెయిన్ లో పుట్టిన ఒక వినూత్న ఆలోచన. దీని ప్రకారం ఎవరైనా భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే,వారు సూపర్ మార్కెట్ కు వెళ్లి తమ షాపింగ్ ట్రాలీలో ఒక పైనాపిల్ ను తలక్రిందులుగా పెడతారు. నేను సింగిల్, నా మనసుకు నచ్చిన వారి కోసం వెతుకుతున్నాను అని ఎదుటివారికి ఇచ్చే నిశ్శబ్ద సంకేతం ఇది. అదే సూపర్ మార్కెట్ లో ట్రాలీలో తలక్రిందులుగా ఉన్న పైనాపిల్ తో మరో వ్యక్తి కనిపిస్తే వారిద్దరూ ఒకే ఆలోచనతో ఉన్నారని అర్థం చేసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు.
ప్రయోజనాలు, జాగ్రత్తలు
ఈ ట్రెండ్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఆన్ లైన్ డేటింగ్ లాగా ఫోటోలు చూసి మోసపోయే అవకాశం ఉండదు. ముఖాముఖిగా కలుసుకోవడం వల్ల నిజాయితీకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సూపర్ మార్కెట్ వంటి పబ్లిక్ ప్రదేశం కాబట్టి భద్రత కూడా ఉంటుంది. అయితే నాణేనికి రెండో వైపు ఉన్నట్లే, ఇందులోనూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అపరిచితులతో పరిచయం ఎంత ఉత్తేజకరంగా ఉన్నా, వారిని పూర్తిగా నమ్మే వరకు మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్ వంటివి పంచుకోకపోవడం ఉత్తమం. ఏది ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమను వెతుక్కునే మార్గాలు కూడా ఎంత క్రియేటివ్ గా మారుతున్నాయో చెప్పడానికి ఈ పైనాపిల్ డేటింగ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.



Click it and Unblock the Notifications