Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ ఫ్రెండ్ మంచోళ్లా? లేక తేనె పూసిన కత్తా? ఈజీగా ఎలా కనిపెట్టాలంటే..
స్నేహం అంటే కలిసి తాగడమో,కలిసి తిరగడమో కాదు..మనకు కష్టమైనా,సంతోషమైనా అన్ని వేళలా మనకు తోడుగా ఉండేవాళ్లే ఫ్రెండ్ అంటే. నిస్వర్థమైన ఫ్రెండ్ మనకు ఉండే ఇక దాన్ని మించిన సంపద మరొకటి ఉండదు అని అంటారు. అయితే స్నేహం ముసుగులో మంచేసేవాళ్లు ఈ కలికాలంలో బోలెడు మందే ఉంటారు. మన చుట్టూ ఉన్న సంబంధాల సంక్లిష్ట ప్రపంచంలో ఎవరు మనవారు, ఎవరు పరాయివారో తెలుసుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ చిక్కుముడిని విప్పడానికి వేల సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు కొన్ని అద్భుతమైన మార్గదర్శకాలను అందించారు. ఆయన చెప్పిన 6 సూత్రాలు నిజమైన స్నేహితుడిని గుర్తించి, ఫేక్ స్నేహితుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి సహాయపడతాయి.
సుఖదుఃఖాలలో తోడుండేవాడు
జీవితమనే కాయిన్ కి సుఖదుఃఖాలు రెండు వైపులా ఉంటాయి. మీ సంతోషంలో పాలుపంచుకోవడానికి వందల మంది ముందుకు రావచ్చు, కానీ మీ కన్నీళ్లు తుడవడానికి నిలబడేవాడే నిజమైన ఆత్మబంధువు. చాణక్యుడి ప్రకారం మీ ఆనందంలో పొంగిపోయి, మీ కష్టంలో భుజం తట్టి ధైర్యం చెప్పేవాడిని ఎన్నటికీ వదులుకోకూడదు. కేవలం అవకాశాల కోసం మీతో ఉండేవాళ్లు కష్టం రాగానే నీడలా మాయమవుతారు. అలాంటి వారు స్నేహితులు అవరు, కేవలం పరిచయస్తులు మాత్రమే.

మీ విజయాన్ని తనదిగా భావించేవాడు
ఒక ఫ్రెండ్ నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడానికి అత్యుత్తమ సమయం మీరు విజయం సాధించినప్పుడు. మీ గెలుపును చూసి ఎవరైతే తన సొంత విజయంగా భావించి, స్వచ్ఛమైన మనసుతో ఆనందిస్తారో అతడే మీ నిజమైన శ్రేయోభిలాషి. అలా కాకుండా మీ ఎదుగుదల చూసి అసూయపడేవాడు, పైకి నవ్వుతూ లోపల కుమిలిపోయేవాడు మీ ఫ్రెండ్ రూపంలో ఉన్న శత్రువుతో సమానం. అతని కళ్ళల్లోని అసూయను గమనిస్తే అతని నిజస్వరూపం బయటపడుతుంది.
ఓటమిలో చేయూతనిచ్చేవాడు
స్నేహానికి అసలైన అగ్నిపరీక్ష ఓటమి సమయంలోనే ఎదురవుతుంది. మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసేవాడు లేదా మీ నుండి దూరంగా జరిగేవాడు ఒక కపట స్నేహితుడు. కానీ అదే సమయంలో మీకు చేయూతనిచ్చి, నేనున్నానంటూ మిమ్మల్ని పైకి లేవనెత్తేవాడే నిజమైన మిత్రుడు. వైఫల్యం ఒక పాఠమని గుర్తుచేసి మళ్ళీ ప్రయత్నించేలా ప్రోత్సహించేవాడి స్నేహం వెలకట్టలేనిది.
మీ వెనుక మీ గౌరవాన్ని కాపాడేవాడు
మీరు ఉన్నప్పుడు మీ ముఖంపై పొగడ్తలు కురిపించడం సులభం. కానీ మీరు లేనప్పుడు కూడా మీ గౌరవాన్ని కాపాడేవాడే నిజమైన స్నేహితుడు. మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని అడ్డుకునేవాడు, మీ రహస్యాలను తనలోనే దాచుకునేవాడు నమ్మకానికి ప్రతీక. మీ వెనుక మిమ్మల్ని విమర్శించేవాడు మీ బలహీనతలను నలుగురిలో ప్రచారం చేసేవాడు వెన్నుపోటు పొడిచే ద్రోహి అని చాణక్యుడు హెచ్చరించాడు.

మాటల కన్నా చేతలను నమ్మండి
తేనె పూసిన కత్తిలాంటి మనుషులు కొందరు ఉంటారు. వారి మాటలు తియ్యగా ఉంటాయి, కానీ వారి చేతలు మాత్రం శూన్యం. అవసరమైనప్పుడు సహాయం చేయకుండా కేవలం తీపి మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టే వారిని ఎప్పటికీ నమ్మవద్దు. నిజమైన స్నేహితుడు మాటలతో కోటలు కట్టడు, కష్టకాలంలో చేతలతో తన స్నేహాన్ని నిరూపించుకుంటాడు.
అద్దంలా నిజాన్ని చూపించేవాడు
నిజమైన స్నేహితుడు ఒక అద్దం లాంటివాడు. అది మీ ముఖానికి అంటిన మచ్చను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. అలాగే నిజమైన స్నేహితుడు మీకు నచ్చకపోయినా, మీ మంచికోసం కఠినమైన నిజాన్ని చెప్పడానికి వెనుకాడడు. కానీ నకిలీ స్నేహితుడు మీరు తప్పు చేస్తున్నా, మిమ్మల్ని మెప్పించడం కోసం దాన్ని కూడా సమర్థిస్తాడు. మిమ్మల్ని సంతోషపెట్టే అబద్ధం కన్నా, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే నిజం చెప్పేవాడే గొప్ప స్నేహితుడు.



Click it and Unblock the Notifications