Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
స్నేహమా? సరసమా?..ఈ సిగ్నల్స్ ఇస్తున్నారంటే అర్థం అదే
మన లైఫ్ లో కొన్ని రిలేషన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. కొన్నిసందర్భాల్లో మనం ఎదుటోళ్ల ప్రవర్తన స్నేహమా లేక సరసమా అని తేల్చుకోలేక గందరగోళానికి గురవుతాం. వారు మనతో కేవలం స్నేహంగా ఉంటున్నారా లేక వారి మనసులో ఇంకేమైనా ఉందా? దీనికి సమాధానం తెలుసుకోవడం చాలా ఈజీ
స్నేహానికి, సరసానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి కొన్ని కీలకమైన సంకేతాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని గమనిస్తే వారి మనసులోని మాటను సులభంగా కనిపెట్టవచ్చు.

ఆ ప్రత్యేకత మీకేనా?
వారు అందరితో ఒకలా, మీతో మాత్రం మరోలా బిహేవ్ చేస్తున్నారా? వారి పొగడ్తలు, చిలిపి పనులు, అదనపు శ్రద్ధ కేవలం మీకే పరిమితమైతే అది ఖచ్చితంగా సరసమే. అందరినీ ఒకేలా చూస్తుంటే బహుశా వారు సహజంగానే స్నేహశీలి అయి ఉండవచ్చు.
చిన్న పరీక్ష పెట్టండి
వారి ఉద్దేశం తెలుసుకోవడానికి మీరు కూడా చిన్నగా సరసాలాడి చూడండి. వారు ఉత్సాహంగా స్పందించి, ఆ సంభాషణను ముందుకు తీసుకెళ్తే వారికి మీపై ఆసక్తి ఉన్నట్టే. ఒకవేళ వారు ఇబ్బందిగా ఫీలైనా, వెనక్కి తగ్గినా అది కేవలం ఫ్రెండ్ షిప్ అని అర్థం చేసుకోండి.
మాటలే కాదు, చేతలు కూడా గమనించండి
వారి చర్యలు వారి ఉద్దేశాలను స్పష్టంగా చెబుతాయి. మాట్లాడేటప్పుడు మీ దగ్గరికి రావడం, అనుకోకుండా మీ చేతిని తాకడం లేదా మీ మాటలను శ్రద్ధగా వింటూ మీ వైపు వంగడం వంటివి చేస్తున్నారా? ఇవి ఆకర్షణకు బలమైన సంకేతాలు.
కళ్ళతోనే కబుర్లు
కంటిచూపు చాలా విషయాలు చెబుతుంది. వారు మీతో మాట్లాడుతున్నప్పుడు లేదా గదికి అవతలి వైపు ఉన్నప్పుడు కూడా మీ కళ్ళలోకి దీర్ఘంగా,సూటిగా చూస్తున్నారంటే అది సాధారణ స్నేహం కంటే ఎక్కువే. ఆ చూపులో ఏదో అర్థం దాగి ఉందని గ్రహించండి.
పైపైన కాదు, లోతుగా అడుగుతారు
బాగున్నారా? అని అడగడం వేరు..మీ జీవిత లక్ష్యాలేంటి? అని అడగడం వేరు. వారు మీ ఇష్టాలు, అభిరుచులు, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే వారికి మీపై నిజమైన ఆసక్తి ఉందని అర్థం.
నేను సింగిల్ అని చెప్పకనే చెబుతారు
సంభాషణ మధ్యలో తాము ఒంటరిగా ఉన్నామని లేదా ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని పరోక్షంగా చెబుతున్నారా? వారు మీకు అవకాశం ఇస్తున్నారని, తమ లభ్యతను తెలియజేస్తున్నారని దీని అర్థం.
మీకే పూర్తి ప్రాధాన్యత
చుట్టూ ఎంతమంది ఉన్నా వారి పూర్తి శ్రద్ధ మీపైనే కేంద్రీకరిస్తున్నారా? మీతో మాట్లాడటానికి ఏకాంతాన్ని వెతుక్కుంటూ మిమ్మల్ని పక్కకు పిలుస్తున్నారంటే మీరు వారికి ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు.

సరదాగా ఆటపట్టించడం
చిన్ననాటి స్నేహంలాగే, సరదాగా ఆటపట్టించడం కూడా ఇష్టాన్ని చూపించే ఒక మార్గం. ఇతరుల కంటే మిమ్మల్నే ఎక్కువగా ఏడిపిస్తూ, చిలిపిగా జోకులు వేస్తున్నారంటే వారు మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
మీకోసం వెతుకుతారు
ఒక పార్టీలో లేదా ఫంక్షన్ లో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, మీరు వెళ్ళిపోయాక మీ గురించి ఫ్రెండ్స్ ని అడగడం వంటివి చేస్తున్నారా? ఈ అదనపు ప్రయత్నం స్నేహాన్ని దాటిన ఆకర్షణను సూచిస్తుంది.
ఇద్దరే కలుద్దామంటారు
స్నేహితులు కలిసి సమయం గడపడం సహజమే. కానీ వారు గుంపుగా కాకుండా, కేవలం మీతో ఒంటరిగా సమయం గడపడానికి, కాఫీకి లేదా డిన్నర్ కు ఆహ్వానిస్తున్నారంటే అది సరసానికి స్పష్టమైన సంకేతం. వారు మిమ్మల్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications