Latest Updates
-
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే
బ్రేకప్ అయ్యి బాధపడుతున్నారా?..లవర్ పదే పదే గుర్తుకొస్తుంటే ఇలా చేయండి..జీవితాంతం హ్యాపీ
ప్రేమ అనేది ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఇద్దరు కలిసి నడుస్తారు, కలలు కంటారు,భవిష్యత్తును ఊహించుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ ప్రయాణం అనుకోకుండా మధ్యలోనే ఆగిపోతుంది. దానినే మనం బ్రేకప్ అంటాం. ఈ ఒక్క పదంలోనే ఎన్నో భావోద్వేగాలు, కన్నీళ్లు, గుండెకోత దాగి ఉంటాయి. సంవత్సరాల పాటు పెనవేసుకున్న బంధం అకస్మాత్తుగా తెగిపోయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. మోసం, ప్రేమ తగ్గిపోవడం, కుటుంబ సభ్యులు పెళ్లికి లేదా ప్రేమకు అంగీకరించకపోవడం లేకపోవడం కారణం ఏదైనా, ఫలితం మాత్రం తీవ్రమైన వేదన. ఆ సమయంలో ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది. ఒంటరితనం చుట్టుముడుతుంది. రాత్రులు నిద్రలేని జ్ఞాపకాలతో గడిచిపోతాయి. ఏడుపు ఆగదు, ఏ పనీ చేయాలనిపించదు. అయితే ఆ బ్రేకప్ గాయాన్ని మాన్పుకుని, తిరిగి మిమ్మల్ని మీరు కనుగొనడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
ఫ్యామిలీ,ఫ్రెండ్సే అసలైన బలం
బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా గదిలో బందీ అవ్వడం కన్నా ప్రమాదకరమైనది మరొకటుండదు. ఒంటరితనం మీలోని బాధను రెట్టింపు చేస్తుంది. అందుకే ఆ నాలుగు గోడల నుండి బయటకు రండి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. వారి ఆత్మీయ స్పర్శ, పలకరింపు మీ గాయానికి సంజీవనిలా పనిచేస్తుంది. మీ ఫ్రెండ్స్ తో కలిసి చిన్ననాటి అల్లరిని,సరదా సంఘటనలను గుర్తుచేసుకోండి. వారి నవ్వుల మధ్య మీ కన్నీళ్లు ఆవిరైపోతాయి. మీ జీవితంలో లవర్ రాక ముందు కూడా మీకు అండగా ఉన్నది వారే అని గుర్తుంచుకోండి. ఆ బంధాలను తిరిగి పటిష్టం చేసుకోండి.

మీలోని శక్తిని సరైన మార్గంలో పెట్టండి
ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల కార్ఖానా అంటారు. మీరు ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే మీ మనసు పదేపదే గతాన్నే తవ్వుతుంది. అందుకే మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోండి. మీకు ఇష్టమైన గేమ్స్ ఆడండి, జిమ్ లో చెమట చిందించండి. శారీరక శ్రమ మీలోని ఆవేదనను, కోపాన్ని బయటకు పంపించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి,మీ దృష్టిని పూర్తిగా మళ్లిస్తుంది.
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టండి
బ్రేకప్ తర్వాత చాలామంది తమ జీవితం ఆ ఒక్క వ్యక్తితోనే ముగిసిపోయిందని భావిస్తారు. ఇది పెద్ద పొరపాటు. మీ ప్రపంచం ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాదు. కొంతకాలం మీకు మీరు సమయం ఇచ్చాక బయటకు వెళ్లండి. కొత్త ఫ్రెండ్స్ ను కలవండి,కొత్త ప్రదేశాలను సందర్శించండి. ఇది వెంటనే కొత్త రిలేషన్ లోకి వెళ్లమని కాదు,మీ సోషల్ లైఫ్ ని తిరిగి నిర్మించుకోమని అర్థం. కొత్త మనుషులు, కొత్త అనుభవాలు మీ ఆలోచనా విధానాన్ని మార్చి, జీవితం ఎంత విశాలమైనదో మీకు గుర్తుచేస్తాయి.
గతాన్ని గతంగానే వదిలేయండి
విడిపోయాక మనం ఉందాం అనే మాట ఒక పెద్ద ఎర. దానికి అస్సలు ఒప్పుకోవద్దు. మీ మాజీతో మాట్లాడటం, వారి సోషల్ మీడియాను చూడటం వంటివి చేస్తూ ఉంటే, అది మీ గాయాన్ని పదేపదే కెలుక్కోవడం లాంటిదే. మీరు ముందుకు సాగలేరు. సంపూర్ణంగా దూరం పెట్టడం,అనేది మిమ్మల్ని మీరు గౌరవించుకోవడానికి, మీ భావోద్వేగాలకు విరామం ఇవ్వడానికి అవసరం. వారి జ్ఞాపకాల నుండి బయటపడాలంటే వారితో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకోవడమే సరైన మార్గం.



Click it and Unblock the Notifications











