Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
ఆఫీసుల్లో పెరిగిపోతున్న ఎఫైర్స్? సహోద్యోగులతో ప్రేమలో పడటానికి కారణాలివే
ఈ డిజిటల్ యుగం మన లైఫ్ స్టైయిల్ తో పాటు మన వర్క్ కల్చర్ ని కూడా పూర్తిగా మార్చివేసింది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ ఇంటికొచ్చేదాకా జీవితంలో ఎక్కువ భాగం ఆఫీసులోనే గడిచిపోతోంది చాలామందికి. ఇదే సమయంలో ఆఫీసు గోడల మధ్య కొత్త రిలేషన్స్ చిగురించడం, ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పెరగడం అనేది నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఒక చేదు నిజంగా మారింది. ఒకప్పుడు అరుదుగా వినిపించే ఆఫీస్ ఎఫైర్ అనే మాట ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా పెళ్లైన స్త్రీ, పురుషుల్లో ఈ ధోరణి ఆందోళనకరంగా పెరుగుతోంది. కుటుంబ బంధాలను పణంగా పెట్టి సహోద్యోగులతో సంబంధాలకు దారితీస్తున్న కారణాలేంటి? దీనిపై సైకాలజీ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
వివాహేతర సంబంధాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలు
గంటలతో పాటు పెరిగే సాన్నిహిత్యం
రోజుకు 9 నుండి 12 గంటల సుదీర్ఘ పని వేళలు సహోద్యోగులను కేవలం టీమ్ సభ్యులుగా కాకుండా ఫ్రెండ్స్ గా, ఆపై అంతకుమించి దగ్గర చేస్తున్నాయి. కలిసి పనిచేయడం, ప్రాజెక్టుల ఒత్తిడిని షేర్ చేసుకోవడం, సక్సెస్ లను కలిసి ఆస్వాదించడం వంటివి వారి మధ్య ఒక తెలియని సాన్నిహిత్యాన్ని పెంచుతున్నాయి. ఈ స్నేహం ప్రేమగా ఎప్పుడు మలుపు తీసుకుంటుందో వారికే తెలియడం లేదు.

టెక్నాలజీ అనే రహస్య స్నేహితుడు
వర్క్ కోసం మొదలైన వాట్సాప్ చాట్, అర్ధరాత్రి వ్యక్తిగత సంభాషణగా ఎప్పుడు మారుతుందో తెలియదు. ఆఫీస్ కాల్స్ కాస్తా పర్సనల్ కాల్స్ గా మారి, రహస్యంగా ఫోటోలు, వీడియోలు పంచుకునే లెవల్ కి వెళ్తున్నాయి. టెక్నాలజీ ఈ రహస్య బంధాలను కాపాడటంలో ఒక సాధనంగా మారుతోంది. ఈ విధంగా టెక్నాలజీ అండతో ఈ సంబంధాలు ఎఫైర్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
జీవనశైలి తెస్తున్న ఒత్తిడి
నగరాల్లోని ఆధునిక జీవనశైలి కూడా ఒక ప్రధాన కారణం. ఆఫీసులో గంటల తరబడి గడిపి అలసిపోయి ఇంటికి చేరేసరికి కుటుంబంతో గడపడానికి సమయం, ఓపిక రెండూ ఉండటం లేదు. కుటుంబ బాధ్యతలు, నెలవారీ ఖర్చులు, EMIల గొడవలో పడి భార్యాభర్తల మధ్య బంధం భారంగా మారుతోంది. ఈ ఒంటరితనం, ఒత్తిడి కొత్త బంధం వైపు చూసేలా చేస్తున్నాయి.
భావోద్వేగ బంధం కొరవడటం
పని ఒత్తిడి వల్ల భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోతున్నారు. దీనివల్ల వారి మధ్య ఎమోషనల్ కనెక్షన్ కొరవడుతుంది. ఈ మానసిక దూరం ఒకరినొకరు అర్థం చేసుకునే సహోద్యోగి వైపు ఆకర్షితులు కావడానికి కారణమవుతోంది.
కష్టసుఖాలు పంచుకునే కొలీగ్
మనసులోని భారాన్ని, ఆఫీస్ టెన్షన్‌ను పక్కనే ఉన్న సహోద్యోగితో పంచుకున్నప్పుడు దొరికే సాంత్వన వారిపై ఒక ప్రత్యేక అభిమానాన్ని పెంచుతుంది. నన్ను అర్థం చేసుకునే వారు ఒకరున్నారు అనే భావన కొన్నిసార్లు హద్దులు దాటి వివాహేతర సంబంధానికి పునాది వేస్తుంది.
క్షణం సుఖం.. శాశ్వత నరకం
ఆఫీస్ ఎఫైర్ మొదట్లో ఉత్సాహంగా, థ్రిల్లింగ్ గా అనిపించవచ్చు. కానీ అది మీ జీవితాన్ని సర్వనాశనం చేసే ఒక నిప్పు కణం లాంటిది. ఈ బంధం వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు.
వృత్తిపరమైన జీవితం: ఆఫీస్ లో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. గాసిప్స్ వల్ల మీ ఇమేజ్ నాశనమవుతుంది. పనిపై ఏకాగ్రత కోల్పోయి కెరీర్‌లో వెనుకబడిపోతారు.
వ్యక్తిగత జీవితం: కుటుంబంలో కలహాలు, అపనమ్మకం చోటుచేసుకుంటాయి. మీ భాగస్వామిని మోసం చేస్తున్నారన్న అపరాధ భావన మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది.
మానసిక ఆరోగ్యం: బంధం ముగిసినప్పుడు లేదా బయటపడినప్పుడు తీవ్రమైన ఆందోళన, నిరాశ, ఒత్తిడికి లోనవుతారు.
ఆర్థిక నష్టం: విడాకులు, భరణం వంటి సమస్యలతో మీ పొదుపు మొత్తం కరిగిపోవచ్చు.



Click it and Unblock the Notifications