Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అమ్మనాన్నలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పెళ్లి బాజాలు మోగిన కొద్ది రోజులకే మన సమాజంలో వినిపించే సాధారణ ప్రశ్న.. శుభవార్త ఎప్పుడు చెబుతారు? అని. పెళ్లైన ఏడాది తిరిగేసరికి కుటుంబ సభ్యులు, బంధువుల నుండి పిల్లల గురించి ఒత్తిడి మొదలవుతుంది. ఆ ఆత్రుతలోనో, లేదా పెద్దల ఒత్తిడికి తలొగ్గో చాలా జంటలు తల్లిదండ్రులు కావడానికి సిద్ధపడిపోతుంటారు.
ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది కేవలం తొమ్మిది నెలల ప్రక్రియ కాదు, అది జీవితకాలపు బాధ్యత. బిడ్డను కనడం కంటే ఆ బిడ్డను ఒక బాధ్యత గల పౌరుడిగా, ఆరోగ్యంగా పెంచడమే అసలైన సవాలు. అందుకే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందే ముందు కొన్ని కీలకమైన విషయాలను ఆలోచించాలి. అవేంటో ఇక్కడ చూడండి.

మీ బంధం ఎంత బలంగా ఉంది?
చాలామంది దంపతులు తమ మధ్య గొడవలు తగ్గడానికో లేదా బంధం బలపడటానికో పిల్లలను కనాలని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన. పిల్లలు పుట్టాక నిద్రలేని రాత్రులు, అదనపు పనులు, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి.
మీ బంధం ముందే బలహీనంగా ఉంటే ఈ కొత్త బాధ్యతలు దానిని మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. అందుకే మీ ఇద్దరి మధ్య అన్యోన్యత, అర్థం చేసుకునే గుణం బలంగా ఉన్నప్పుడే పిల్లల గురించి ఆలోచించండి.
అది మీ ఇద్దరి ఉమ్మడి నిర్ణయమేనా?
పిల్లల పెంపకం అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, తండ్రి పాత్ర కూడా అంతే కీలకం. అందుకే ఈ విషయంపై ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని చర్చించుకోండి. ఎవరో అడిగారనో, సమాజం ఏమనుకుంటుందోననో కాకుండా, మీ ఇద్దరికీ మానసికంగా పిల్లలు కావాలని అనిపిస్తేనే ముందడుగు వేయండి. ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడమే మంచిది.
ఆరోగ్యం సహకరిస్తుందా?
తల్లిదండ్రులు కావడం అంటే శారీరకంగా కూడా ఎంతో శక్తి అవసరం. గర్భధారణకు ప్లాన్ చేసుకునే ముందే అవసరమైన మెడికల్ చెకప్స్ చేయించుకుని, మీరిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే ప్రణాళిక వేసుకోండి. హెల్దీ లైఫ్ స్టైయిల్, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడినవారవుతారు.
ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా?
పిల్లల పెంపకం ఈ రోజుల్లో చాలా ఖరీదైన వ్యవహారం. గర్భధారణ సమయం నుండి హాస్పిటల్ ఖర్చులు, ఆ తర్వాత స్కూల్ ఫీజులు, వారి అవసరాలు..ఇలా ప్రతి దశలోనూ డబ్బు అవసరం ఉంటుంది. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు పొదుపులను అంచనా వేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా బిడ్డను పెంచగలమన్న నమ్మకం వచ్చాకే ప్లానింగ్ మొదలుపెట్టండి.
కెరీర్, సంరక్షణ
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సహజం. మరి ఇద్దరూ ఆఫీసులకు వెళ్తే బిడ్డను ఎవరు చూసుకుంటారు? ఒకవేళ తల్లి ఉద్యోగం మానేయాల్సి వస్తే, ఆ ఆర్థిక లోటును ఎలా పూడ్చుకుంటారు? ఇలాంటి ప్రశ్నలకు బిడ్డ పుట్టకముందే సమాధానాలు వెతుక్కోవాలి. లేకపోతే తర్వాత వచ్చే గందరగోళం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications