Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
బ్రేకప్ అయ్యిందా? జస్ట్ ఈ పని చేస్తే మళ్లీ హ్యాపీ లైఫ్ మీ సొంతం!
ఈ రోజుల్లో ప్రేమలు ఎంత త్వరగా పుడుతున్నాయో..బ్రేకప్ లు కూడా అంతే స్పీడ్ గా అయిపోతున్నాయి. బ్రేకప్ లేదా విడిపోవడం అనేది ఎవరికైనా అత్యంత బాధాకరమైన అనుభవం. ఒకరిని ప్రాణంగా ప్రేమించి, ఆ జ్ఞాపకాలను, ఆ వ్యక్తిని శాశ్వతంగా వదులుకోవడం అంత సులభం కాదు.
అయితే ఈ కష్టకాలం నుంచి బయటపడి, జీవితాన్ని మళ్లీ కొత్తగా ఎలా ప్రారంభించాలో వివరిస్తూ ప్రముఖ రిలేషన్ షిప్ కోచ్, కౌన్సెలర్ కంఫర్ట్ ఓమోవ్రే.. హార్ట్స్ బ్లూమ్ హియర్ అనే పేరుతో ఉన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని అద్భుతమైన సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ చూడండి.

మిమ్మల్ని మీరు నమ్మండి
బ్రేకప్ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అనే సందేహం మిమ్మల్ని లోపలి నుంచి తొలిచివేస్తుంది. కానీ మీరు ఓడిపోలేదని, మీ ఆనందం కోసం, ప్రశాంతత కోసం మిమ్మల్ని మీరు విడిపించుకున్నారని బలంగా నమ్మండి. అలాగే అపరాధ భావం, కోపం లాంటి గందరగోళ భావోద్వేగాలను అణచిపెట్టుకోకండి. వాటిని డైరీలో రాయండి. ఒక తప్పుడు బంధంలో ఇన్నాళ్లూ ఎందుకు రాజీ పడ్డానో అని మిమ్మల్ని మీరు నిందించుకోకండి. దయతో మిమ్మల్ని మీరు క్షమించండి.
గతాన్ని పారదర్శకంగా చూడండి
మన మెదడు తరచుగా చెడును మర్చిపోయి, గతాన్ని అందంగా ఊహించుకుంటుంది. కానీ ఆ బంధం నుంచి మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో, జరిగిన చేదు సంఘటనలను మీకు మీరే గుర్తుచేసుకోండి. అలాగే మీ మాజీ భాగస్వామి మీ విజయాలను చూసి అసూయపడాలనో, లేదా తిరిగొచ్చి క్షమాపణ అడగాలనో ఎదురుచూడకండి. ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని గతానికే కట్టిపడేస్తాయి.
బాధను స్వీకరించండి
ఏడవడం లేదా బాధపడటం బలహీనత కాదు. మీ బాధను గౌరవించండి, మనసారా ఏడ్చేయండి. ఆ తర్వాత మీపై మీరు దృష్టి పెట్టండి. మీ మనసుకు నచ్చిన సంగీతం వినండి, నడవండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇష్టమైన ఆహారం తింటూ, మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి. బ్రేకప్ వల్ల నేను దేనికీ పనికిరాను అనే ప్రతికూల ఆలోచనలు వస్తాయి. నేను అద్భుతమైన వ్యక్తిని, నిజమైన ప్రేమకు, ఆనందానికి అర్హుడిని అని మీకు మీరే చెప్పుకోండి.
కొత్త భవిష్యత్తును నిర్మించుకోండి
వారు లేకుండా జీవితం శూన్యం అనిపించవచ్చు. కానీ మీకంటూ ఒక అందమైన భవిష్యత్తు ఉందని ఊహించుకోండి. ఆ భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. కొత్త స్నేహితులను కలవండి, కొత్త హాబీలు నేర్చుకోండి, లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు శ్రమించండి. గతం గురించి ఆలోచించడం కంటే, వర్తమానంలో మీకున్న అవకాశాల మీదే ఎక్కువ దృష్టి పెట్టండి.
మార్పును ఆహ్వానించండి, ఓపిక పట్టండి
నొప్పి ఎప్పుడూ మనల్ని మారుస్తుంది. ఆ మార్పును సానుకూలంగా స్వీకరించి, మునుపటి కంటే మరింత పరిణతి చెందిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించండి. అయితే మనసుకి తగిలిన గాయం మానడానికి సమయం పడుతుంది. కాబట్టి ఒక్క రోజులోనే అంతా మారిపోయి, సాధారణ స్థితికి రావాలని ఆశించకండి. మీతో మీరు ఓపికగా ఉండండి, నిరాశపడకండి. కాలమే అన్నింటికీ సరైన మందు.



Click it and Unblock the Notifications