Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శృంగార జీవితంలో కొత్త మెరుపు..దంపతులు కలిసి స్నానం చేయడం వల్ల లాభమిదే!
భార్యాభర్తల మధ్య అత్యంత మధురమైన సమయాల్లో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ,రకరకాల కారణాలతో లైఫ్ బిజీ అయిపోయి చాలామంది శృంగార సమయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఇక, ఏళ్ల తరబడి ఒకే రకమైన శృంగార పద్ధతులు పాటించడం వల్ల దంపతుల మధ్య ఒక రకమైన విసుగు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విసుగుని ఛేదించి, మీ బంధంలో మళ్లీ పాత వెచ్చదనాన్ని తిరిగి పొందడం ఎలా అనే ప్రశ్నకి రిలేషన్ షిప్, సైకాలజిస్టు నిపుణులు ఇచ్చే ఒక అద్భుతమైన సలహా కలిసి స్నానం చేయడం. నీటి ప్రవాహం కింద ఒకరికొకరు దగ్గరవ్వాలనే ఆలోచన మీ బంధంలో సూపర్ హిట్ కావచ్చు.

కోరికలు కలగాలంటే..
దీర్ఘకాలిక సంబంధాల్లో ఉన్న చాలా మంది స్త్రీలు, దాదాపు మూడో వంతు పురుషుల్లో కోరికలు వాటంతట అవిగా కలగవని, దానికి కొంత ప్రేరణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మాత్రమే వారు ఉద్రేకం చెందుతారు.
ఇటువంటి పరిస్థితుల్లో, బెడ్ రూమ్ లో కాకుండా..కలిసి స్నానం చేయడం లేదా నగ్నంగా ఒకరి పక్కన ఒకరు పడుకోవడం వంటివి ఆ మ్యాజిక్ ను తిరిగి తీసుకువస్తాయని చెబుతున్నారు.
మూడ్ సెట్ చేసుకోవడం ఎలా?
కలిసి స్నానం చేయడమంటే కేవలం నీళ్లు పోసుకోవడం మాత్రమే కాదు అదొక అనుభూతి. ముందుగా మంచి మూడ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
మనసుకు హాయినిచ్చే సంగీతం ప్లే చేయండి. బాత్రూమ్ లో సువాసన వెదజల్లే కొవ్వొత్తులను వెలిగిస్తే ఆ దృశ్యం ఎంతో రొమాంటిక్ గా మారుతుంది.
మీకు బాత్ టబ్ ఉంటే అందులో కాస్త సుగంధ తైలాలు వేయండి. ఇవేవీ అందుబాటులో లేకపోయినా పర్వాలేదు..కనీసం బాత్రూమ్ శుభ్రంగా, నీట్ గా ఉండేలా చూసుకోండి చాలు.
ఒత్తిడి లేని సాన్నిహిత్యం
షవర్ లో కలిసేటప్పుడు వెంటనే సంభోగం చేయాలనే ఒత్తిడి పెట్టుకోకండి. కేవలం ఆ నీటి స్పర్శను, మీ భాగస్వామి సాన్నిహిత్యాన్ని ఆస్వాదించండి. తడిసిన శరీరాలు ఒకదానికొకటి తాకుతున్నప్పుడు పుట్టే రసాయన చర్య అద్భుతంగా ఉంటుంది.
ఒకరి శరీరాలను మరొకరు కొత్తగా ఆవిష్కరించుకోండి. ఈ సాన్నిహిత్యం సహజంగానే సంభోగానికి దారితీయవచ్చు. ఒకవేళ అలా జరగకపోయినా మీరు పొందే మానసిక దగ్గరితనం వెలకట్టలేనిది.
జాగ్రత్తలు తప్పనిసరి
సబ్బు నురుగు, నీళ్ళ వల్ల నేల జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేలపై గ్రిప్ ఉండేలా యాంటీ-స్లిప్ మ్యాట్స్ వేసుకోవడం మంచిది.
బాత్రూమ్ అనేది బెడ్ రూమ్ అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. స్థల అభావం ఉండొచ్చు. కానీ ఈ చిన్న చిన్న కష్టాలను పక్కన పెట్టి, ఒకరి కోరికలపై మరొకరు దృష్టి పెడితే, స్నానం అనేది మీ శారీరక ఆనందానికి గొప్ప ఉత్ప్రేరకంగా మారుతుంది.



Click it and Unblock the Notifications