Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మగాళ్లారా ఇంకా ఒంటరిగా ఉన్నారా? ఈ తప్పుల వల్లేనే..
ప్రస్తుతం చాలామంది యువకులు 40 ఏళ్లు దాటుతున్నా కూడా సింగిల్ గానే మిగిలిపోతున్నారు. దీనికి వాళ్ల వాళ్ల కారణాలు అనేకం ఉండవచ్చు. అయితే చాలామంది యువకులు తాము ఎంత ప్రయత్నించినా సరే సరైన భాగస్వామి దొరకట్లేదు అని తరుచుగా చెబుతుంటారు. దీంతో నిరాశపడిపయి తమకు అదృష్టం లేదు అనే మాటలు చెబుతుంటారు. అయితే వాస్తవానికి దీనికి కారణం అదృష్టం బాగలేకపోవటం కాదు..మీకు తెలియకుండా మీరు చేసే చిన్న పొరపాట్లే దీనికి కారణం. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటే నిజమైన ప్రేమను కనుగొనడం అసాధ్యమేమీ కాదు.
ఆన్ లైన్ ప్రపంచం దాటి చూడండి
ప్రస్తుతం నడిచేది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో లవర్ ని వెతుక్కోడానికి చాలామంది డేటింగ్ యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే నిజమైన బంధం అనేది కేవలం మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లోనే దొరకాలని లేదు. మీకోసం ఎదురుచూసే ఆ ప్రత్యేక వ్యక్తి ఎక్కడైనా ఉండవచ్చు. లైబ్రరీలో, కేఫ్ లో, బీచ్ లో లేదా మీకు ఇష్టమైన మ్యూజియంలో కూడా తారసపడవచ్చు. మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లినప్పుడు, మీలాంటి అభిరుచులు ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఫోన్ పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టండి.

మొదటి చూపులోనే మనసులో కోటలు కట్టకండి
ఒక అమ్మాయి నచ్చగానే మొదటి డేట్ లోనే ఆమెతో మీ భవిష్యత్తును ఊహించుకోవడం చాలా పెద్ద పొరపాటు. చాలామంది మనలో ఈ పొరపాటు చేస్తుంటారు. తనే నా జీవిత భాగస్వామి అని గుండెల్లో తాజ్ మహల్ కట్టం మొదలుపెడితే మీరు సహజంగా ప్రవర్తించలేరు. ప్రతి విషయాన్ని మొదటి రోజే మాట్లాడేయాలనే ఆత్రుత కూడా మంచిది కాదు. బంధం అనేది నెమ్మదిగా వికసించే ఒక అందమైన పువ్వు లాంటిది. ఒకరినొకరు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ సంభాషణలను సహజంగా సాగనివ్వండి. ఆ తొందరపాటు మీ బంధానికి అందాన్ని దూరం చేస్తుంది.
ప్రేమను డబ్బుతో కొనలేరు
డబ్బులుంటే చాలు అమ్మాయిలు పడిపోతారు అనేది పాతకాలపు అపోహ మాత్రమే. ఈ రోజుల్లో అమ్మాయిలె ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వారు పురుషుడి బ్యాంకు బ్యాలెన్స్ కన్నా, అతని వ్యక్తిత్వాన్ని, పరిణతిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తనను అర్థం చేసుకుని, తన ఆశయాలకు అండగా నిలిచే, తన బలహీనతలను సైతం ప్రేమించే భాగస్వామి కోసం చూస్తున్నారు. మీ ఆస్తుల గురించి గొప్పలు చెప్పుకోవడం మీ స్నేహితుల ముందు బాగుంటుందేమో కానీ ప్రేమలో అది పనిచేయదు. మీ నిజాయితీ, ఆమెపై మీరు చూపించే గౌరవమే అసలైన ఆస్తి.
గతాన్ని గుండెల మీద మోయకండి
గతంలో కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ ఎదురై ఉండవచ్చు. అంతమాత్రానికే ప్రతి ఫెయిల్యూర్ కి మిమ్మల్ని మీరు నిందించుకోవడం గడిచిపోయిన చేదు అనుభవాలను పదేపదే గుర్తుచేసుకుంటూ కుమిలిపోతే, కొత్త బంధాన్ని ప్రారంభించలేరు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ బలాలు, బలహీనతలను అంగీకరించండి. సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు పెంచుకున్నప్పుడే, మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. డేటింగ్‌లో వైఫల్యం సహజమని గ్రహించి, ప్రతి ఎక్స్ పీరియెన్స్ ఒక పాఠమని ముందుకు సాగండి.

పోలికలతో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి
మీ స్నేహితులందరూ ప్రేమలో ఉన్నారని, మీరొక్కరే ఒంటరిగా మిగిలిపోయారని బాధపడుతున్నారా? ఈ పోలికే అసలైన సమస్య. ప్రతి పువ్వు వికసించడానికి దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం ఆపి మీలోని ప్రత్యేకతను గుర్తించండి. మీ వ్యక్తిత్వాన్ని, మీ ప్రత్యేకతను ఇష్టపడే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉంటారు. ప్రేమలో ఓపిక చాలా ముఖ్యం. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కన్నా సరైన వ్యక్తి కోసం ఓపికగా ఎదురుచూడటమే మీకు మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications