Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
ప్రేమకు ఓకే,కానీ శృంగారానికి నో.. జెన్-జీ యువతరంతో పడక సుఖం కష్టమేనా?
ఇప్పుడున్న కొత్త తరంలో కొత్త మార్పులు, ధోరణిలు కనిపిస్తున్నాయి. సంబంధాల్లో విపరీత మార్పులు జెన్ జీ లో వచ్చేస్తున్నాయి. 1997-2012 మధ్య జన్మించినవారిని ఈ తరానికి చెందినవారిగా పరిగణిస్తారు. వీరిని జెన్ జీ(Generation Z) అని కూడా పిలుస్తారు. వీరికి ముందు ఉన్న తరాన్ని మిలీనియల్స్ (Millennials) అంటారు.
ప్రేమ, పెళ్లి, శృంగారం ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ముఖ్యంగా వైవాహిక బంధంలో శారీరక సాన్నిహిత్యం ఆ బంధాన్ని మరింత బలపరుస్తుందని అందరూ చెబుతుంటారు. అయితే నేటి యువతరం, జెన్-జీ(Gen-Z) ఆలోచనలు, అలవాట్లు ఈ నమ్మకాలను తలకిందులు చేస్తున్నాయి. ప్రస్తుత యువత ప్రేమను నమ్ముతున్నారు, మానసిక బంధానికి విలువిస్తున్నారు, కానీ శృంగారానికి మాత్రం దూరంగా జరుగుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఎవరీ గ్రేసెక్సువల్స్?
ఈ కొత్త తరం ఆలోచనలకు ప్రతిరూపమే గ్రేసెక్సువల్స్. వీళ్లు గాఢమైన మానసిక, భావోద్వేగ బంధానికే అత్యంత ప్రాధాన్యతనిస్తారు. శారీరక సంబంధాల అవసరాన్ని వీరు పెద్దగా గుర్తించరు. వీరిలో లైంగిక కోరికలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. తమకు నచ్చిన వ్యక్తి చేయి పట్టుకుని జీవితాంతం ప్రశాంతంగా గడపడమే వీరికి ముఖ్యం. అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొన్నా, అది నామమాత్రంగానే ఉంటుంది. బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడనిదే వీరు ఎవరితోనూ శారీరకంగా దగ్గర కాలేరు. ఆశ్చర్యకరంగా వీరికి ఆన్ లైన్ లో ఒక ప్రత్యేక ఫోరమ్ కూడా ఉంది, అందులో దాదాపు 8300 మంది సభ్యులున్నారు.
జెన్-జీలో ఈ మార్పుకు కారణాలేంటి?
నిపుణుల ప్రకారంయువతరం శృంగారంపై ఆసక్తి కోల్పోవడానికి అనేక కారణాలున్నాయి.
అతి పోటీ, మానసిక అలసట: నేటి ప్రపంచం పోటీతో నిండిపోయింది. చిన్నతనం నుండే జెన్-జీ యువత కెరీర్, చదువు అంటూ నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ మానసిక అలసట వారి శక్తిని హరించివేసి, వారి లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆత్మన్యూనత, శరీర రూపంపై ఆందోళన: సోషల్ మీడియా సృష్టించిన అందం ప్రమాణాల వల్ల, జెన్-జీ తమ శరీరాకృతి గురించి తీవ్రమైన అభద్రతాభావంతో ఉంటున్నారు. తాము అందంగా లేమని, భాగస్వామికి నచ్చమేమోనన్న భయం వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ఇది వారిని శారీరక సాన్నిహిత్యానికి దూరం చేస్తోంది.
డిజిటల్ ప్రపంచంలో బంధీలు: స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాకు జెన్-జీ దాదాపు బానిసలుగా మారారు. డిజిటల్ కనెక్షన్లు పెరిగి, నిజ జీవితంలోని బంధాలు బలహీనపడుతున్నాయి. ప్రియమైనవారితో గడపాల్సిన సమయాన్ని కూడా స్క్రీన్లకే అంకితమిస్తున్నారు. దీనివల్ల భావోద్వేగ బంధాలు ఏర్పడక, శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతోంది. అంతేకాకుండా విపరీతంగా పోర్న్ చూడటం కూడా నిజ జీవిత లైంగిక కోరికలను చంపేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్తుపై ఆందోళన
యువతరం శృంగారం పట్ల విముఖత చూపడం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు. ఇది భవిష్యత్తులో జననాల రేటుపై తీవ్ర ప్రభావం చూపి, జనాభా సంక్షోభానికి దారితీయవచ్చని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమలో భావోద్వేగాలకు పెద్దపీట వేయడం మంచిదే అయినా శారీరక సాన్నిహిత్యాన్ని పూర్తిగా దూరం పెట్టడం మానవ జాతి భవిష్యత్తుకే ప్రమాదకరం కావచ్చు.



Click it and Unblock the Notifications