Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మాజీ లవర్ తో మళ్లీ ప్రేమలో పడుతున్నారా? సన్నిహితంగా ఉండే ముందు ఈ జాగ్రత్తలు మస్ట్!
పాతబడిన కొద్దీ వైన్ కి కిక్కు పెరిగినట్లే పాత ప్రేమలో కూడా ఒక తెలియని మత్తు, గాఢత ఉంటాయి. మనసుకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి.. జ్ఞాపకాల దొంతరల నుండి మళ్ళీ మన జీవితంలోకి అడుగుపెడితే ఆ భావన మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది.
అయితే భావోద్వేగాల్లో మునిగిపోయే ముందు గుర్తుంచుకోవాల్సిన చేదు నిజం ఏంటంటే..గతంలో మీరు మీరు ఇదే వ్యక్తిని వద్దనుకున్నారు, లేదా వారే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు. ఆ గాయం మానిపోయి ఉండొచ్చు కానీ మళ్ళీ వారితోనే తిరిగి ప్రేమ బంధంలో అడుగుపెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

పరిచయమే కదా అని పొరబడకండి
మీ మాజీ లవర్ మీకు పూర్తిగా తెలిసినవారే కావచ్చు కానీ అది గతం. ఇన్నేళ్లలో మనుషులు మారుతారు, వారి మనస్తత్వాలు మారుతాయి. నాకు అంతా తెలుసులే అనే ధీమాతో కాకుండా, వారిలో వచ్చిన మార్పులను గమనించండి.
ఇప్పుడున్న వారి వ్యక్తిత్వం, మీ ప్రస్తుత జీవితానికి సరిపోతుందో లేదో బేరీజు వేసుకోండి. ఆ మార్పు సానుకూలంగా ఉంటేనే ముందడుగు వేయండి.
విడిపోవడానికి కారణం మర్చిపోవద్దు
గతంలో మీ మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? ఆ కారణాన్ని స్పష్టంగా గుర్తుచేసుకోండి. గతంలో బ్రేకప్ కి కారణమైన అవే సమస్యలు,అదే ప్రవర్తన వారిలో ఇప్పటికీ కనిపిస్తుంటే మళ్ళీ ఆ ఊబిలో కూరుకుపోకండి. పాత సమస్యలకు పరిష్కారం దొరికితే తప్ప, ఆ బంధం మళ్ళీ నిలబడదు.ః
స్నేహంతో ఆరంభించండి
మాజీ లవర్ మళ్లీ తిరిగి మీ లైఫ్ లోకి వచ్చారంటే..వెంటనే మొదటి రోజులా ప్రేమలో పడిపోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ ను ఫ్రెండ్ షిప్ తో పూడ్చుకోండి. ఒకరినొకరు మళ్ళీ కొత్తగా అర్థం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి.
అతి ఉత్సాహం.. అతి విశ్వాసం వద్దు
మీ మాజీ లవర్ మీ ముందుకు రాగానే..నువ్వు ఎప్పుడొస్తావని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నా అంటూ మీ వీక్ నెస్ ని బయటపెట్టకండి. అలాగని నేను నీకు మరో అవకాశం ఇస్తున్నాను అనే అహంకారాన్ని కూడా ప్రదర్శించకండి. ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకుని, హుందాగా వ్యవహరించండి. అప్పుడే బంధంలో గౌరవం నిలుస్తుంది.
ఈగోను పక్కన పెట్టండి
ఒక చిన్న మాటతో సమస్య పరిష్కారమ అయ్యేటప్పుడు, పట్టింపులకు పోకండి. అహంకారాన్ని పక్కన పెట్టి, మనసు విప్పి మాట్లాడుకోండి. అవతలి వ్యక్తి కూడా అంతే ఓపెన్ గా ఉన్నారా లేదా అనేది గమనించండి.
తప్పులను సరిదిద్దుకోండి
గతంలో ఏ కారణాల వల్ల గొడవలు వచ్చాయో, వాటిని ఈసారి ఎలా నివారించాలో ముందే చర్చించుకోండి. సర్దుకుపోవడం, అర్థం చేసుకోవడం అనేవి రెండోసారి ప్రేమలో పడేవారికి చాలా అవసరం.
గతాన్ని తవ్వకండి - వర్తమానాన్ని ప్రేమించండి
బ్రేకప్ సమయంలో జరిగిన గొడవలను లేదా విడిపోయిన కాలంలో వారు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? వంటి అనవసరమైన ప్రశ్నలతో వర్తమానాన్ని కలుషితం చేసుకోకండి. పాత గాయాలను రేపడం వల్ల ప్రయోజనం శూన్యం. జరిగిన దాన్ని మర్చిపోయి, ఈ కొత్త ప్రయాణాన్ని ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications