Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శృంగారం తరువాత అలసటగా అనిపిస్తుందా.. ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా?
దంపతుల మధ్య శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం. భాగస్వామ్యులు ఇద్దరి మధ్య శారీరక బంధం ఎంత బలంగా ఉంటే.. వారి దాంపత్య జీవితం కూడా అంతే బలంగా ఉంటుంది. శృంగారం వల్ల శారీరక సంతృప్తితో పాటు మానసిక ఆనందం కూడా కలుగుతుంది. అలాగే దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే అవి కూడా తొలిగిపోతాయి.
అయితే కలయిక తరువాత కొందరు ముద్దులు, కౌగిలింతలు, మాటలతో రెచ్చిపోతే.. మరికొందరి అలసిపోయి సేదతీరుతుంటారు. ఇంకొందరు తక్షణమే నిద్రపోతారు. అయితే కలయిక తరువాత అలసట అనేది సాధారణమేనా? లేక శరీరంలో ఏదైనా సమస్య ఉండడం వల్ల అలా జరుగుతుందా? ఏదైనా కారణాలు ఉన్నాయా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎనర్జీ లెవెల్స్ తగ్గడం వల్ల..
కలయిక తరువాత దంపతుల్లో అలసట రావడం అనేది సాధారణ సమస్యే అని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. శృంగారం తరువాత ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయని, దాని వల్ల అలసట వస్తుందని తేలింది. అయితే ఈ ప్రక్రియలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా అలసిపోయే ఛాన్సుందని వెల్లడైంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడంతో పాటు అలసటకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
హార్మోన్ల వల్ల..
శృంగారంలో భాగస్వామ్యులు కలయిక వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మన్ ఎక్కువగా విడుదలై.. ఉండాల్సిన పరిణామం కంటే అధికమవుతుంది. దీంతో పాటు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది. ఈ రెండు హార్మోన్లు శరీరాన్ని విశ్రాంతి పరుస్తాయి. దీని కారణంగా నిద్ర వచ్చినట్లు అవుతుంది. అలసటగా అనిపించి.. కళ్ళు మూత పడుతుంటాయి. ఇవి మాత్రమే కాదు.. ఈస్ట్రోజెన్, టెస్టొసిరాన్ హార్మోన్ల వల్ల కూడా ఈ అనుభూతి కలుగుతుంది.
వ్యాయామం..
సాధారణంగా శృంగారాన్ని ఒక వ్యాయామంగా పరిగణిస్తారు. జిమ్‌లో చేసే వ్యాయామంతో పోలిస్తే శృంగారంలో అధిక మొత్తంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. దీని వల్ల శరీరం అలిసిపోయినట్లు అనిపించడంతో పాటు నిద్ర కూడా వస్తుంటుంది. వ్యాయామం తరువాత అలిసిపోయినట్లు శృంగారం తరువాత కూడా అలిసిపోవడం సాధారణమే.
నిద్రలేమి..
శృంగారం తరువాత అలసట, నిద్రపోవడం అనేది నిద్రలేమి కారణంగా కూడా వస్తుంటాయి. సాధారణంగానే నిద్ర సరిగ్గా లేకపోయినా, నిద్రలేమితో శారీరక శ్రమ చేసినా వెంటనే అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే నిద్రలేమితో శృంగారంలో పాల్గొనే అలసటగా అనిపిస్తుందని నిపుణులు వెల్లడించారు.
మెదడు రిలాక్స్ అవుతుంది..
శృగారంతో కేవలం శారీరక సంతృప్తి మాత్రమే కాదు, మానసిక సంతృప్తి కూడా వస్తుంది. మనకు ఎంత ఒత్తిడి ఉన్నా శృంగారంతో అది పటాపంచలు అవుతుంది. శృంగారం తరువాత మెదడు రిలాక్స్ అవడం, ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతో అలసట, నిద్ర వస్తాయి. అందుకే కొందరు శృంగారం తరువాత తక్షణమే నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తుంటారు.
ఇలా అయితే వైద్యులను సంప్రదించాలి..
శృంగారం తరువాత ఒక అయిదు పది నిమిషాలు లేదా ఒక గంట సేపు నీరసంగా అనిపిస్తే అది పెద్ద సమస్య కాదు. అయితే కలయిక తరువాత కొన్ని గంటలు, కొన్ని రోజుల వరకు నీరసంగా, అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వీటితో పాటు తీవ్రమైన నీరసం, తలనొప్పి, శరీర నొప్పులు, శ్వాస ఇబ్బందులు, జ్వరం ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications