Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ అక్షరాలతో పేరున్న అమ్మాయిలు లక్ష్మీదేవి సొంత వారసులు.. ప్రేమలో నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్లు!
జోతిష్య శాస్త్రంలో పేరు బలానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. పేరు బలం బాగుటుంటే జీవితం బాగుటుందని చెబుతుంటారు. అలాగే ఆ పేరును బట్టి ఒక వ్యక్తి ఎలాంటి వారు? ఏ విధమైన లక్షణాలు కలిగిన వారు అనే చెప్పేస్తుంటారు. అందుకే పెళ్లిలో వధూ వరుల పేర్లను నిశితంగా పరిశీలించి పెళ్లిని ఖరారు చేస్తారు. ఒకవేళ ఆ పేర్లు మ్యాచ్ అవ్వకపోతే పెళ్లిని కూడా రద్దు చేసుకుంటారు. అయితే ఈ అక్షరాలతో పేరు కలిగిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా చెబుతుంటారు.
ఈ అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా, ప్రేమించినా లక్ష్మీదేవి మీపై తాండవం చేస్తుందని నమ్ముతారు. అలాగే ఈ అమ్మాయిలు నిజాయితీపరులని, ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయరని పేర్కొంటూ ఉంటారు. ఇంతకీ ఏ ఏ అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలు మంచి వారు? వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

G పేరుతో ఉన్న అమ్మాయిలు
ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులుగా పరిగణింపబడతారు. అత్త మామలకు కూడా ఈ పేరుతో ఉన్న అమ్మాయిలు అన్ని విధాలుగా అదృష్టాన్ని తెచ్చి పెడతారు. వీరు చాలా నిజాయితీపరులు. తాము నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడరు. అలాగే తమపై నమ్మకం ఉంచిన వ్యక్తులను ఎలాంటి సందర్భంలోనూ మోసం చేయరు. ఈ పేరుతో అమ్మాయిలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువిరిస్తాయి. అన్ని విధాలుగా కలిసి వాస్తుంది.
Kతో పేరున్న అమ్మాయిలు..
K అక్షరంతో పేరున్న అమ్మాయిలు కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వీరు అత్తమామలకు అపురూపమైన అదృష్టాన్ని తెచ్చి పెడతారట. వీరిలో ప్రేమ, దయ గుణం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటుంటారు. వీరిలో నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుందని, కష్టాల్లో కూడా తన అనుకున్న వారివెంటే నడుస్తారని పేరుంది. ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఐశ్వర్యం, సిరిసంపదలు తలతూగుతాయని జోతిష్యులు చెబుతున్నారు. అత్తమామలు మంచిహ్ ప్రేమానురాగాలు పొందుతారు.
L అక్షరంతో ఉన్న అమ్మాయిలు
L అక్షరంతో పేరున్న అమ్మాయిలు కూడా అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా చెప్పుకుంటూ ఉంటారు. వీరి అక్షరంలోనే లక్ష్మీ ఉందని, వీరు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. ఈ అమ్మాయిలు ఎవరి ఇంట్లోకి అడుగుపెడితే వారి ఇంట్లో ఆర్ధిక సంక్షోభాలు అన్నీ తొలిగిపోయి ఆర్ధిక స్థిరత్వం కలుగుతుందని చెబుతారు. వీరి రాకతో భర్త కెరీర్ కూడా మలుపుతిరుగుతుందని నమ్ముతారు. సంపద, ఆరోగ్యం వీరి వల్ల ప్రాప్తి చెందుతుందని, వీరు నిజాయితీగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు.

P అక్షరంతో పేరున్న అమ్మాయిలు
P అక్షరంతో పేరున్న అమ్మాయిలు మీ జీవితంలోకి వస్తే మీ వైవాహిక జీవితం చాలా బాగుటుంది. ఆర్ధిక పరంగా అన్ని విధాలుగా కలిసివస్తుంది. అత్త మామల, భర్త ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. భర్త తన జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారు. సిరి సంపదలు, ఆయురారోగ్యాలు అన్ని ప్రసాదించబడతాయి. ఆర్ధిక స్థిరత్వం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.



Click it and Unblock the Notifications