Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Grey Divorce: కొంపలో కుంపటి.. భారీగా పెరుగుతున్న గ్రే డివోర్స్..అసలేంటిది?
ఎన్ని గొడవలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా తోడునీడగా ఉండే బంధం భార్యాభర్తలది. పెళ్లంటే నూరేళ్ల పంట అని మన పెద్దలు అన్నమాటకి ఇప్పుడు పూర్తిగా అర్థాలే మారిపోయాయి. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎంతకాలం కలిసి ఉంటారో వారికే తెలియని పరిస్థితి నెలకొంది. పెళ్లి అయిన కొన్ని గంటల్లోనే విడిపోతున్న జంటలు అనేకం నిత్యం మన చుట్టుపక్కల చూస్తూనే ఉన్నం. విడిపోడానికి లేదా రిలేషన్ తెంచుకోడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇదిలాఉంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గత 10 ఏళ్లుగా 50 ఏళ్లు పైబడిన జంటల్లో ఓ కొత్త ధోరణి మొదలైంది. అదే గ్రే డివోర్స్.
గ్రే డివోర్స్ అంటే ఏంటీ
గత దశాబ్దాకాలంగా 50 ఏళ్లు పైబడిన వృద్ధ జంటలలో విడాకుల కేసులు పెరిగిపోయాయి. ఈ పరిణామాన్ని గ్రే విడాకులు(Grey Divorce)అని పిలుస్తుంటారు. ఈ గ్రే విడాకుల కాన్సెప్ట్ ఆధునిక వివాహానికి ఓ కొత్త నిర్వచనంగా మారుతోంది. అయితే అసలు ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటో తెలియక చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? జీవిత చరమాంకంలో సుదీర్థ బంధాన్ని ఎందుకు తెంచుకుంటున్నారు వంటి ప్రశ్నలకు సమాధానమేంటో ఇక్కడ చూడండి.

గ్రే డివోర్స్ కి కారణాలు
50 ఏళ్లు పైబడిన వయస్సులో కలిసి ఒకరికొకరు అన్నట్లుగా ఉండాలనుకోవడం మానేసి నా దారి నాది నీ దారి నీది అన్నట్లు విడాకులు తీసుకొని విడిపోతున్న వాళ్ల సంఖ్య పెరగడం వెనుక పలు కారణాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. అందులో ముఖ్యమైనది 'ఆయుష్షు'. ప్రజలు ఎక్కువకాలం జీవిస్తుండటంతో తమ జీవితంలో మిగిలిన సమయాన్ని సంతోషంగా నచ్చినవ్యక్తులతో గడపాలని కోరుకుంటున్నారు. అందుకే అసంతృప్త వివాహ బంధంలొ కొనసాగడం కంటే విడిపోడానికే మొగ్గు చూపుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
సామాజిక ధృక్పధంలో మార్పు
గతంలో విడాకులు తీసుకున్నారంటే అదేదో పెద్ద నేరంలా సమాజం వారిని చూసేది. ముఖ్యంగా ఓ మహిళ విడాకులు తీసుకుంది అంటే చాలు ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అని ముద్ర వేసేస్తుంటారు మన సమాజంలో చాలామంది. దాని వెనుక ఉన్న కారణాలు వారికి తెలియనప్పటికీ ఎవరికి తోచింది వారు అనుకునేవాళ్లు. అయితే కొద్దికాలంలగా విడాకుల పట్ల సమాజం దృక్పథం మారింది. గతంలోలా విడాకులను తప్పబట్టటం లేదు. వ్యక్తిగత ఆనందానికే ఎవరికి వారు ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. వాళ్లు ఏమనుకుంటారు..వీళ్లు ఏమనుకుంటారు అని ఆలోచించడం మానేసి తమకు నచ్చింది చేస్తున్నారు. అందుకే వృద్ధాప్యంలో కూడా విడాకులు ఇచ్చి తమకు నచ్చినట్లు బతుకుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక స్వాతంత్ర్యం
ఒకప్పుడు మనదేశంలో చాలావరకు మహిళలను పెద్దగా చదివించేవాళ్లు కాదు..చిన్న వయస్సులోనే వారికి పెళ్లిళ్లు చేసేవాళ్లు. దీంతో వాళ్లే ఇంట్లోని వంటగదికే పరిమితమై కుటుంబసభ్యులకు ఆహారం వండిపెట్టడానికే పరిమితమయ్యేవారు. అయితే కాలంలో మార్పు వచ్చింది. నేడు మహిళలు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. కాదేదీ మహిళలకు అడ్డు అన్నట్లుగా తమ శక్తిని చాటుతున్నారు. ప్రస్తుతం చాలామంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటంతో భర్తపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో అసంతృప్తికరమైన బంధాల నుంచి బయటపడటానికి ఇది కూడా సహాయపడుతుంది.
కమ్యునికేషన్ గ్యాప్
చాలామంది జంటలు తమ భావాలను సరిగ్గా పంచుకోలేకపోవడం వల్ల దూరమవుతున్నారు.
ఆసక్తులలో మార్పులు
వయస్సుతో పాటు ఇష్టాయిష్టాలో కూడా మార్పులు రావడం సహజం. అయితే వాటిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా రిలేషన్ షిప్ బలహీనపడుతుంది. ఇది చివరకు విడాకులకు కూడా దారితీస్తుంది. అదనంగా ఆన్ లైన్ డేటింగ్ రాకతో వృద్ధులు కొత్త సంబంధాలను అన్వేషించడం కూడా సలుభతరమైంది.



Click it and Unblock the Notifications