Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అందరూ గౌరవించాలా, అందరి మెప్పూ పొందాలా అయితే వీటిని అలవాటు చేసుకోండి
జీవితంలో విజయం సాధించడానికి, అందరూ గౌరవించేలా ఎదగడానికి ఎలాంటి అంశాలను అలవాట్లుగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక మనిషి విజయతీరాలకు వెళ్లాలన్నా, ఓటమితో కుంగిపోవాలన్న అతని అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. జీవితంలో, వృత్తిలో, వ్యాపారంలో విజయం సాధించిన చాలా మందిలో కొన్ని అలవాట్లు కామన్‌గా ఉంటాయి. ఆ అలవాట్ల వల్లే వారు విజయాలు సాధిస్తారు. మనిషి వ్యక్తిత్వ అభివృద్ధిలో అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

జీవితంలో విజయం సాధించడానికి, అందరూ గౌరవించేలా ఎదగడానికి ఎలాంటి అంశాలను అలవాట్లుగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వారు ఎప్పుడూ పొద్దుపోయే దాకా పడుకోరు:
విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ త్వరగా మేల్కొంటారు. వారు ఎప్పుడూ మంచం మీద ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే పొద్దుపోయే వరకు పడుకుంటే వారి దినచర్య అస్తవ్యస్తంగా మారుతుంది. నిద్రకు కేటాయించాల్సిన సమయాన్ని ఏదైనా పని కొచ్చే అంశానికి కేటాయిస్తారు. అలా అని వారు చాలీచాలని నిద్రతో సరిపెట్టుకోరు. వారికి రోజుకు ఎన్ని గంటల నిద్ర అవసరమో అంతే పోతారు.
రోజూ ఉదయమే మేల్కొంటే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. ఎలాంటి తొందరపాటు లేకుండా సమయానికి జరిపిపోతాయి.

జ్ఞానాన్ని పెంచుకుంటారు:
విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటారు. జ్ఞానమే నిజమైన శక్తి అని వారు గట్టిగా నమ్ముతారు. అందుకో వార్తలను చదవడానికి, తెలుసుకోవడానికి రోజూ సమయం కేటాయిస్తారు. వార్తల ద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. చాలా మంది వార్తలను పట్టించుకోరు. దాని వల్ల అప్‌డేట్‌గా ఉండలేరు.

లక్ష్యాల పట్ల పట్టుదలగా ఉంటారు:
విజయవంతమైన వ్యక్తులు తమ లక్ష్యాల పట్ల పట్టుదలతో ఉంటారు. వారి లక్ష్యాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయరు. లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని వారికి ఇష్టమైన వాటిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీర్ఖకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునేందుకు నిత్యం కష్టపడుతుంటారు.

పనికి రాని విషయాల కోసం సమయాన్ని వృథా చేయరు:
జీవితంలో విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి రోజుకు 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. అయితే ఆ 24 గంటల్లో ఏం చేస్తున్నామన్నదానిపై విజయం ఆధారపడి ఉంటుంది. డబ్బు ఖర్చు చేస్తే తర్వాత మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ సమయాన్ని వృథా చేస్తే దానిని తిరిగి పొందలేం. ఈ విషయం విజయవంతమైన వ్యక్తులకు చాలా బాగా తెలుసు. అందుకే వారు సమయాన్ని సరిగ్గా వాడుకుంటారు.

వ్యక్తులను గుర్తుంచుకుంటారు:
మనిషి సామాజిక జీవి. ఒకప్పుడు కేవలం బతకడానికి కమ్యూనికేషన్ అవసరం అనుకునే వారు. కానీ జీవితంలో విజయం సాధించడానికి కూడా కమ్యూనికేషన్ చాలా అవసరం. ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకోవాలి. వారు బయట కనిపించినప్పుడు పలకరించాలి.



Click it and Unblock the Notifications