Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే!
భార్యాభర్తల బంధం నమ్మకం, గౌరవం, అంతులేని ప్రేమ అనే పునాదులపై నిర్మితమవుతుంది. అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య కూడా అప్పుడప్పుడు అలకలు, చిన్న చిన్న గొడవలు రావడం సహజం. నిజానికి ఇలాంటి చిన్న చిన్న తగాదాలు వారి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. కానీ కోపంలో హద్దులు దాటితేనే అసలు సమస్య వస్తుంది. ఒక్కోసారి ఆవేశంలో భార్యాభర్తలు అనుకునే మాటలు మనసును తీవ్రంగా గాయపరుస్తాయి.
నోటి నుంచి జారిన మాటను, విల్లు నుంచి వదిలిన బాణాన్ని వెనక్కి తీసుకోలేము. అందుకే ప్రముఖ రిలేషన్ షిప్ కోచ్ కోమల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మహిళలకు ఒక చక్కటి సలహా ఇచ్చారు. భార్యలు తమ భర్తలతో సరదాకి కూడా కొన్ని మాటలు అనకూడదని ఆమె సూచిస్తున్నారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే ఏ 4 విషయాలకు దూరంగా ఉండాలో ఇక్కడ చూడండి.

ఇతరులతో పోల్చడం
చాలామంది మహిళలు చేసే అతిపెద్ద పొరపాటు తమ భర్తను ఇతరులతో పోల్చడం. "చూడు.. ఆమె భర్త ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చాడో", "మా నాన్న నన్ను ఎంత బాగా చూసుకునేవారో తెలుసా?", "వాళ్లు ప్రతి వీకెండ్ ట్రిప్స్ కి వెళ్తారు, నువ్వు మాత్రం నన్ను ఎక్కడికీ తీసుకువెళ్లవు" లాంటి మాటలు భర్త మనసును ముక్కలు చేస్తాయి. ఇలాంటి పోలికల వల్ల పురుషులలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. తన భార్యను సంతోషపెట్టలేకపోతున్నాననే న్యూనతా భావం వారిని కుంగదీస్తుంది. ఇది క్రమంగా మీపై ప్రేమ తగ్గడానికి దారితీస్తుంది. ప్రతి వ్యక్తీ విభిన్నం అని గుర్తించి, మీ భర్తను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి.
భర్తను, ఆయన కుటుంబాన్ని అవమానించడం
వివాహ బంధంలో ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవమే అసలైన ఆస్తి. భర్తను చులకన చేస్తూ మాట్లాడటం లేదా ఆయన కుటుంబ సభ్యులను (ముఖ్యంగా అత్తమామలను) విమర్శించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. తన తల్లిదండ్రుల గురించి భార్య పదే పదే చెడుగా మాట్లాడితే ఏ భర్తా తట్టుకోలేడు. అది అతని మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసి ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది.
భర్త కష్టాన్ని గుర్తించకపోవడం, ఎగతాళి చేయడం
కుటుంబ బాధ్యతలను మోస్తూ, భార్యాపిల్లలను సంతోషంగా ఉంచడానికి ప్రతి మగవాడూ పగలు, రాత్రి ఎంతో శ్రమిస్తాడు. అంత కష్టపడి ఇంటికి వచ్చిన భర్తతో నువ్వు నాకోసం ఏం ఉద్ధరించావు? అని అంటే ఆ మాట అతనికి గుండెకోతను మిగులుస్తుంది. అలాగే ఆఫీసు పని ముగించుకుని అలసిపోయి ఇంటికి రాగానే కష్టనష్టాల గురించి, ఫిర్యాదుల గురించి మాట్లాడటం వల్ల అతని మానసిక ప్రశాంతత దెబ్బతింటుంద
పడకగదిలో ఫిర్యాదులు వద్దు
బెడ్ రూమ్ అనేది భార్యాభర్తల మధ్య ప్రేమను, ఏకాంతాన్ని పంచుకునే ప్రదేశం. అక్కడ కేవలం ప్రేమకు మాత్రమే స్థానం ఉండాలి. కానీ కొంతమంది మహిళలు నిద్రపోయే ముందు కూడా భర్తను నిలదీయడం, రోజంతా జరిగిన విషయాలపై గొడవపడటం చేస్తుంటారు. ఇది బంధంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆ సమయాన్ని కేవలం ఆప్యాయతను పంచుకోవడానికి మాత్రమే కేటాయించాలి.



Click it and Unblock the Notifications