Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
Happy Propose Day 2026: ఇలా ప్రపోజ్ చేశారంటే..లవర్ ఫిదా అవడం గ్యారెంటీ!
ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే జరుపుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే వాటంటైన్స్ డే కి వారం ముందు నుంచే వాలంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. వాలంటైన్స్ వీక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)తో ముగుస్తుంది. ఈ వారంలోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది.
వాలంటైన్స్ వీక్ లో రెండవ రోజు(ఫిబ్రవరి 8) అయిన ప్రపోజ్ డే(Propose Day)కి ప్రేమికుల జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. రోజ్ డే నాడు గులాబీ ఇచ్చి స్నేహానికి లేదా పరిచయానికి నాంది పలికిన తర్వాత తమ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టడానికి ఈ రోజును కేటాయించారు.

ఏ వ్యక్తికి అయినా తను ప్రేమించిన వ్యక్తికి ఆ ప్రేమను వ్యక్తపర్చే సందర్భం ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ణాపకం. మీ భావాలను కచ్చితంగా వ్యక్తపరిచే కొన్ని అద్భుతమైన ప్రపోజల్ కోట్స్,విషెస్ ఇక్కడ చూడండి.
ప్రపోజ్ డే విషెస్ ఇలా చెప్పండి
-నా కళ్లలో ఆశను, నా గుండెలో శ్వాసను నింపావు. నా జీవితాంతం తోడుగా ఉంటావా? హ్యాపీ ప్రపోజ్ డే.
-మాటల్లో చెప్పలేనంత ప్రేమ నా మనసులో ఉంది. అది నీకు పంచాలని ఉంది. నా ప్రేమని అంగీకరిస్తావా? హ్యాపీ ప్రపోజ్ డే.
-నా చిరునవ్వుకు కారణం నువ్వే..నా మౌనానికి అర్థం నువ్వే.. నా జీవితానికి గమ్యం నువ్వే.
-ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ నా ప్రపంచం మాత్రం నువ్వే. హ్యాపీ ప్రపోజ్ డే.
-నీతో గడిపే ప్రతి క్షణం ఒక అద్భుతం. ఆ అద్భుతం జీవితాంతం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ప్రపోజ్ డే.
-నా గుండె చప్పుడు నీ పేరునే పలవరిస్తోంది.. వినపడుతోందా? ఐ లవ్ యూ.
-నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో జయిస్తాను. నాతో నడుస్తావా?
-నా గతం ఎలా ఉన్నా, నా భవిష్యత్తు మాత్రం నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను.
-ప్రేమంటే ఏంటో నాకు తెలియదు.. కానీ నిన్ను చూశాకే అది ఎలా ఉంటుందో తెలిసింది. హ్యాపీ ప్రపోజ్ డే.
రొమాంటిక్ విషెస్
-నా మనసు అనే ఇంటికి నువ్వే మహారాణివి(మహారాజువి). ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తావా?
-నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదో తెలుసా? నీ గుండె. అందులో నాకు చోటిస్తావా?
-ఈ రోజు నేను మోకాళ్లపై నిల్చొని అడుగుతున్నా.. నా జీవితాంతం నీ చేతిని పట్టుకోనిస్తావా?
-కాఫీలో షుగర్ లేకపోతే టేస్ట్ ఉండదు.. నా లైఫ్ లో నువ్వు లేకపోతే కిక్ ఉండదు.
-సూర్యుడు లేనిదే ఉదయం లేదు.. నువ్వు లేనిదే నా జీవితం లేదు.
-నా కన్నుల్లో నిండిన రూపం నీది.. నా గుండెల్లో మోగుతున్న రాగం నీది. ఐ లవ్ యూ.
-నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధం.. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వే నా సర్వస్వం. హ్యాపీ ప్రపోజ్ డే.
-దేవుడు నాకు ఇచ్చిన అత్యంత విలువైన వరం నువ్వే. ఆ వరం ఎప్పటికీ నా సొంతమేనా?

స్వీట్ మెసేజెస్
-నువ్వంటే నాకు పిచ్చి.. నా ప్రేమని ఒప్పుకుంటావా?
-లైఫ్ లాంగ్ నాతో గొడవపడటానికి పర్మిషన్ ఇస్తావా? హ్యాపీ ప్రపోజ్ డే.
-నిన్ను చూసిన ప్రతిసారీ మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడిపోతున్నా.
-నా హృదయాన్ని దొంగిలించావు.. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావా?
-నీ స్నేహం కావాలి, నీ ప్రేమ కావాలి, అన్నింటికన్నా మించి నువ్వు కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా?
-నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు.. ఎందుకంటే నువ్వే నా బెస్ట్ ఛాయిస్.
-నా ఇంటికి దీపంలా.. నా జీవితానికి వెలుగులా వస్తావా?
-ప్రేమించడం సులభం.. కానీ ప్రేమను నిలబెట్టుకోవడం కష్టం. ఆ కష్టంలోనూ నీకు తోడుగా ఉంటా. హ్యాపీ ప్రపోజ్ డే.
ప్రపోజల్ కవితలు
-అలలు సముద్రాన్ని విడిచి ఉండలేనట్లు.. నేను నిన్ను విడిచి ఉండలేను.
-పువ్వుకు పరిమళం ఎలాగో.. నా జీవితానికి నీ ప్రేమ అలాగ. హ్యాపీ ప్రపోజ్ డే.
-ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడం ఎంత కష్టమో.. నీపై నాకున్న ప్రేమను చెప్పడం అంత కష్టం.
కొత్తగా ప్రపోజ్ చేసేవారికి
-గూగుల్ లో ఎంత వెతికినా.. నీలాంటి అద్భుతం దొరకదు. అందుకే నిన్ను వదలదలుచుకోలేదు.
-మనం టామ్ అండ్ జెర్రీ లాంటోళ్ళం.. కొట్టుకుంటాం కానీ విడిపోలేం. సో, ఫిక్స్ అయిపోదామా?
-నా పాస్ వర్డ్ లాగా నిన్ను గుండెల్లో సేవ్ చేసుకున్నా.. హ్యాక్ చేయడం ఎవరి వల్లా కాదు. హ్యాపీ ప్రపోజ్ డే.
-నా ATM పిన్ ఎంతో చెప్పను కానీ.. నా గుండె తలుపులు తెరిచే కీ మాత్రం నీ దగ్గరే ఉంది.



Click it and Unblock the Notifications