Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మద్యం తాగి శృంగారంలో పాల్గొంటున్నారా? ఏమవుతుందో తెలుసా?
మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మనిషి ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మనిషిని అనారోగ్యానికి గురి చేయడంతో పాటు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగకుండా చేస్తుంది. ఇన్ని ప్రమాదాలు, దుష్ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కొందరు మహిళలు పురుషులతో సమానంగా మద్యం సేవిస్తుంటారు.
పురుషులు, మహిళలు అని కాకుండా ప్రతి ఒక్కరూ మద్యం సేవించడం ప్రమాదకరమే. అయితే మహిళలు మద్యం తాగేందుకు కొన్ని సామాజిక, శారీరక, మానసిక లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కారణం కావచ్చు. కారణం ఏదైనప్పటికీ మహిళలు, లేదా పురుషులు ఆల్కహాల్ అతిగా సేవించడం వల్ల శృంగార సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శృంగార సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మద్యం తాగి శృంగారం చేయడం వల్ల నష్టాలు
మద్యం అతిగా సేవించడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల లైంగిక కోరికలు తగ్గిపోతాయి. అలాగే స్ఖలనం కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల భావప్రాప్తి పొందలేకపోతారు. మద్యం సేవించడం వలన ప్రేరణను నియంత్రించే మెదడు భాగం దెబ్బతింటుంది. దీంతో శృంగారంలో అకాల స్ఖలనం అనే సమస్య ఏర్పడుతుంది.
దీని వల్ల రక్తనాళాలు సంకోచింపజేస్తుంది. దీనివల్ల అంగాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో శృంగారంలో పాల్గొనాలనే ఉత్తేజం తగ్గిపోతుంది. అలాగే సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. మద్యం తాగి శృంగారంలో పాల్గొనడం వల్ల భాగస్వామ్యులు మధ్య విశ్వాసం ఉండదు. అలాగే శృంగారంలో కొన్ని తప్పులు కూడా చేసే అవకాశం ఉంది. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ఛాన్సుంది.
ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం
ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం మద్యం తాగడాన్ని పూర్తిగా మానుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా మద్యం తాగకుండా ఉండాలి. అలాగే పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. దీని వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాతురక్త ప్రసరణ మెరుగుపడుతుంది. యోగ, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని జయించి.. శృంగారంలో విజయవంతం కావొచ్చు. ఇవన్నీ ప్రయత్నించినప్పటికీ ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంపాదించాలి.
మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారుతుంటాయి. ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం అందించబడింది. ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications