Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆమె కోసం కెరీర్ వదిలేస్తే.. ఇంట్లో కూర్చుని తింటున్నాడు అంటోందా? మేరీ కోమ్ పై నెటిజన్ల ఫైర్!
మేరీ కోమ్..ఈ పేరు వినని వారు మనదేశంలో చాలా తక్కువ మందే ఉంటారు. బాక్సింగ్ ఫీల్డ్ లో తిరుగులేని శక్తిగా అవతరించిన వ్యక్తి మేరీ కోమ్. భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్..పద్మ శ్రీ, పద్మ విభూషణ్, బాక్సింగ్ లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్, రాజసభ్య మాజీ ఎంపీ కూడా.
ఐదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త కరుంగ్ ఓన్ కోలర్(K Onler Kom) నుంచి విడిపోయిన విషయాన్ని బాక్సర్ మేరీ కోమ్ ఇటీవల ఆప్ కీ అదాలత్ అనే ప్రోగ్రామ్ లో చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సంపాదిస్తేనే మగతనమా..భర్త అంటే డబ్బులు సంపాదించే యంత్రమా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

మేరీ కోమ్ ఏమంది
తన భర్తతో విడిపోవడంపై మేరీ కోమ్ మాట్లాడుతూ..పెళ్లి చేసుకున్నాడు,నేను సంపాదించేదానిని ఖర్చు పెట్టుకునేవాడు,ఒక్క రూపాయి కూడా సంపాదించేవాడు కాదు,అతనికి ఏ ఉద్యోగం లేదు,హోం మినిస్టర్ అతను,నా దగ్గర కోట్ల రూపాయలు కాజేశాడు,నా ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడు,మగాడు ఇలా ఉంటాడా? బాక్సింగ్ ద్వారా నేను కుటుంబాన్ని పోషిస్తుంటే అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా ఇంట్లో తిని,తాగి పడుకుంటూ తన సంపాదనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్ చెప్పింది.
తన కెరీర్ కోసం అతను చేసిన త్యాగం ఏదీ లేదు..ఇందుకే అతనితో విడాకులు తీసుకున్నానంటూ మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
విడాకులు అనేవి వ్యక్తిగతం. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఇతరులకు అనవసరం కానీ విడాకులకు సంబంధించి మేరీ కోమ్..ఆమె అసలు స్త్రీ జాతికి, యంగర్ జనరేషన్ కి మాత్రమే కాదు అసలు భారతీయులలో ఎవరికైనా ఒక స్పూర్తి ప్రదాయిని అయిన ఆమె నోటి వెంట ఇటువంటి మాటలు రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది.
చాలామంది నిపుణులు,నెటిజన్లు సోషల్ మీడియాలో మేరీ కోమ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఇన్నేళ్లలో భారతీయ కుటుంబ వ్యవస్థలో మొగుడు సంపాదిస్తాడు స్త్రీ ఇంట్లో ఉండటమే జరిగింది. ఆమె ఇంటి పనులను, పిల్లల పెంపకాన్ని అతను గౌరవించాడు. ఆమె శ్రమను వెలకట్టలేని త్యాగంగా చూశాడు.
కానీ కాలం మారింది. నేడు స్త్రీలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. పురుషులకు దీటుగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో,పాత్రలు తారుమారైతే.. సమాజం ఎందుకు స్వీకరించలేకపోతోందంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

ఒకవేళ భార్య కెరీర్ కోసం, ఆమె ఉన్నతి కోసం భర్త తన కెరీర్ ను పక్కన పెట్టి, ఇంటి బాధ్యతలు స్వీకరిస్తే.. అతను మగాడు కాకుండా పోతాడా? డబ్బు సంపాదన మాత్రమే మగవాడికి కొలమానమా? మగాళ్లు మాత్రమే సంపాదించాలి, మగాడు సంపాదించడం అనేది ప్రాథమిక కర్తవ్యమా?
ఇన్నేళ్లుగా మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంది అని గొప్పగా చెప్పుకున్నాం. మరి ఇప్పుడు స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటే, దాన్ని త్యాగంగా ఎందుకు చూడలేకపోతున్నాం? దాన్ని చేతకానితనంగా ఎందుకు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకు అనేక మంది పురుషులు బయటకు వచ్చి సక్సెస్ అయ్యారంటే వెనకాల స్త్రీ త్యాగం ఉన్నప్పుడు ఇప్పుడు స్త్రీ సక్సెస్ అయితే ఆమె వెనకాల భర్త త్యాగం ఉంటే దాన్ని గౌరవంగా చూడాలి కదా..దాన్ని గుర్తింపుగా చూడాలి కదా దాన్ని తక్కువగా చూస్తారంటే చులకన చూస్తే అప్పుడు స్త్రీకి ఒక న్యాయం, పురుషుడికి ఒక న్యాయమా అంటూ మేరీ కోమ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
భార్యను ఏటీఎంలా వాడుకునేవాళ్ల పట్ల జాలి చూపనవసరం లేదని మరికొందరు నెటిజన్లు మేరీ కోమ్ కి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.
వివాహేతర సంబంధమే అసలు కారణమా?
ఏదేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2005లో మేరీ కోమ్, ఓన్ కోలర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు జన్మించగా,ఒక పాపని దత్తత తీసుకున్నారు. ఓన్ కోలర్ ఫుట్ బాల్ ఫ్లేయర్,లాయర్ కూడా. 2023లో తాము విడాకులు తీసుకున్నట్లు గతేడాది మేరీకోమ్ ప్రకటించింది.

భర్త ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు గతంలో మేరీ కోమ్ చెప్పింది, బాక్సర్ గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్ ని పణంగా పెట్టి ఇంట్లో పిల్లలను చూసుకున్నా అని ఓన్ కోలర్ అంటున్నారు. అయితే ఆప్ కీ అదాలతో ప్రోగ్రామ్ లో తన భార్య తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఓన్ కోలర్. మేరీ కోమ్ వివాహేతర సంబంధాలే తమ విడాకులకు కారణమైనట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2013లో ఓ జూనియర్ బాక్సర్ తో మేరీ కోమ్ కి ఎఫైర్ ఉండేదని,ఇది తెలిసి తమ మధ్య గొడవ జరిగిందని,పెద్దలు సర్దిచెప్పి రాజీ కుదిర్చారని..అయితే 2017 నుంచి మళ్లీ మేరీ అకాడమీలో పనిచేస్తున్న వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని,దీనికి సంబంధించి వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్ లు తన దగ్గర ఉన్నాయన్నారు.
ఇవన్నీ తెలిసినా తాను సైలెంట్ గా ఉన్నానన్నారు, ఇప్పటికీ తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు ఓ వీడియోలో చెప్పారు. పెళ్లికి ముందు ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన తాను మేరీ కోమ్ బాక్సింగ్ లో బిజీగా ఉంటే..తాను తన కెరీర్ ని వదిలేసి ఇంట్లో పిల్లలను పెంచి పెద్ద చేశానని చెప్పారు.



Click it and Unblock the Notifications