Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
హలో జెంట్స్.. ఆడవారి భావప్రాప్తి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
శృంగారంతో శారీరక ఆనందంతో పాటు మానసిక ఆనందం కలుగుతుంది. శృంగారం మనసును తేలికపరుస్తుంది. శృంగారం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన తగ్గిస్తుంది. అయితే శృంగారం వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ.. దాంట్లో అత్యధిక తృప్తి అంటే భావప్రాప్తి పొందినప్పుడే ఈ లాభాలన్నీ కలుగుతాయి. అయితే స్త్రీల భావప్రాప్తి గురించి చాలా మంది పురుషులకు తెలిసిందే కొంతే.. తెలియాల్సింది తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది.

శృంగారంలో స్త్రీల ఉద్వేగం గురించి పట్టించుకునే పురుషులు చాలా చాలు తక్కువే. చాలా మంది పురుషులు తమకు కోరికలు రాగానే.. వాటిని తీర్చుకోవడానికి మీద పడిపోతారు. సెంచరీ కొట్టాలన్న తొందరలో, ఆపుకోలేని ఆత్రుతలో కేవలం రెండు రన్స్ కు ఔట్ అయిపోతారు. శృంగారంలో ప్రతిసారి కేవలం పురుషులు మాత్రమే భావప్రాప్తి పొందుతారని నివేదికలు చెబుతున్నాయి. శృంగారంలో చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే భావప్రాప్తి పొందుతున్నట్లు పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
శృంగారాన్ని అనుభవించి, ఆస్వాదించి పొందే తీవ్రమైన ఉద్రేకమే భావప్రాప్తి. సాధారణంగా పురుషులు చాలా త్వరగా ఉద్రేకం చెందుతారు, అంతే త్వరగా భావప్రాప్తి పొందుతారు. చిత్తు కాగితానికి నిప్పు అంటిస్తే ఎంత త్వరగా అది వ్యాపిస్తుందో.. పురుషుల ఉద్రేకంగా అలాగే ఉంటుంది. కానీ మహిళల ఉద్రేకం మాత్రం కర్రను కాల్చినట్లుగా ఉంటుంది. వెలిగించడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఎక్కువ సేపు వెలుగుతూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే.. మహిళలే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
పురుషులు భావప్రాప్తి పొందిన తర్వాత మరోసారి మూడ్ లోకి రావడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ మహిళలు మాత్రం బహుళ భావప్రాప్తి పొందుతారని పరిశోధనలు చెబుతున్నాయి. శృంగారంలో మహిళలు ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా భావప్రాప్తిని పొందగలరు.
మహిళలను ప్రభావవంతంగా లేదా త్వరగా ఉద్రేకానికి తీసుకురావడానికి, వారికి భావప్రాప్తి కలిగించడానికి క్లిటోరస్ టెక్నిక్ నేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు. క్లిటోరిస్ ఉద్దీపన ద్వారా భావప్రాప్తిని కలిగించవచ్చు. క్లిటోరిస్ శృంగార కాంక్షను ప్రేరేపిస్తుంది. ఉద్రేకాన్ని కలిగిస్తుంది. క్లిటోరిస్ ఉన్నదే శృంగారం కోసం. అది ఆ పని తప్పా మరో పని చేయదు. అలాంటి క్లిటోరిస్ ను శృంగారంలో భాగం చేయాలంటున్నారు నిపుణులు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications