Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్త సంబంధంలో ఉన్నా..మాజీ లవర్ సోషల్ మీడియా చెక్ చేస్తున్నారా?
ప్రేమ అనేది ఒక జర్నీ లాంటిది. ప్రేమ ప్రమాణంలో కలవడం, విడిపోవడం రెండూ ఉంటాయి. ఏదైనా కారణంతో ప్రేమ బంధం ముగిసిందంటే ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ నుంచి బయటపడటానికి పట్టే సమయం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది.
అయితే గతాన్ని దాటి ముందుకు సాగడం అంత ఈజీ కాదు. వారితో గడిపిన మధుర క్షణాలు, తిరిగిన ప్రదేశాలు ఏదో ఒక సందర్భంలో మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. కానీ ఈ జ్ఞాపకాలకు, గూఢచర్యంలా ప్రతిక్షణం వారి సోషల్ మీడియాపై నిఘా పెట్టడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది.

ముఖ్యంగా మీరు కొత్త సంబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా, ఉదయం నిద్ర లేవగానే మీ మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్ ను మీరు చెక్ చేస్తున్నారా? వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? లేదా? ఇలాంటి ప్రశ్నలతో మీ మెదడును తొలిచేస్తుంటే, మీరు శారీరకంగా కొత్త బంధంలో ఉన్నా.. మానసికంగా ఇంకా పాత రిలేషన్ లోనే చిక్కుకుపోయారని అర్థం.
ఇది మోసం కాదా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త బంధంలో ఉంటూ మాజీపై నిఘా పెట్టడం కచ్చితంగా మీ ప్రస్తుత భాగస్వామిని మోసం చేయడమే. ఎందుకంటే మీ మనసులో ఎక్కడో ఒక మూల వారు తిరిగి వస్తారేమో అనే ఆశ ఇంకా బతికే ఉంటుంది. మీ సమయాన్ని, ఆలోచనలను, భావోద్వేగాలను మీ ప్రస్తుత భాగస్వామికి కాకుండా, గడిచిపోయిన బంధానికి పంచుతున్నారు. ఇది ఒకరకమైన మానసిక ద్రోహమే.
ఒకవేళ ఈ విషయం మీ ప్రస్తుత భాగస్వామికి తెలిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తమపై మీకు ప్రేమ లేదని, తమ స్థానం పదిలం కాదని, మిమ్మల్ని నమ్మలేమనే భావన వారిలో కలుగుతుంది. ఇది మీ అందమైన వర్తమానాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తుంది. నమ్మకం అనే పునాదిపై నిర్మించుకున్న బంధాన్ని బలహీనపరుస్తుంది.
కాబట్టి గడిచిపోయిన గతాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మనసులో పదిలపరుచుకోండి అంతేగానీ దాన్ని ప్రతిరోజూ తవ్వుతూ వర్తమానాన్ని నాశనం చేసుకోకండి. మీరు వదిలేసి వచ్చిన దారి వైపు మళ్లీ మళ్లీ తిరిగి చూడకండి.
మీతో కలిసి నడవడానికి వచ్చిన కొత్త తోడుకు పూర్తి సమయాన్ని, ప్రేమను పంచండి. అప్పుడే మీ జీవితం మరింత అందంగా, అర్థవంతంగా మారుతుందని రిలేషన్ షిప్ నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications