Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకోవడం సహజం. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు. తప్పు నీదంటే నీది అని వాదించుకుంటారు. ఇక ఆ గొడవ ఇద్దరిమధ్య ప్రతీ రోజూ జరుగుతూనే ఉంటుంది. ఎవ్వరూ తగ్గకుండా గొడవలు పెరిగి పెరిగి తీవ్రమయ్ ఇద్దరూ శాశ్వతంగా విడిపోవడానికి కారణమౌతుంది. గొడవవచ్చినప్పుడు ఇద్దరు సర్దుకుపోవాలి. ఎవరి తప్పులను వారు గ్రహించుకోవాలి.

తప్పులు సహజం
ఇద్దరూ తప్పులు చేయడం సహజం. తప్పులు చేయకుండా ఎవ్వరూ ఉండరు. కానీ తప్పు చేసినప్పుడు తప్పైందని ఒప్పుకోకుండా మీతప్పులనే పదేపదే మాటలు, చేతలతో బయటకు చూపిస్తున్నప్పుడు అప్పుడు తప్పు వారిదేనని మీరు అర్థం చేసుకోవాలి.
ఇద్దరూ కలిసి తాము తప్పుచేసినట్లు భావిస్తే గొడవలు పెరగకుండా ఉంటుంది. కానీ కొందరి అలా కాకుండా తప్పులన్నింటికీ ఒకరిపైనే నెట్టేసే వారివల్లే కలతలు తీవ్రమౌతాయ్.
వ్యక్తిగత స్వేఛ్ఛ
భార్యా భర్తలకు వ్యక్తిగత స్వేచ్ఛ చాలా అవసరం. ఎవ్వరి వ్యక్తిగత హక్కులు వారికి ఉంటాయ్. కానీ దానికి కూడా హద్దులుంటాయ్. హద్దులు దాటకుండా వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించాలి. మీ భాగస్వామికి వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వాలి. అలా ఇవ్వని సందర్భంలోనే ఇద్దరి మధ్య వైషమ్యాలు, కలతలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అతిఆలోచన
అతిగా లోతుగా ఆలోచించకూడదు. మీ భాగస్వామికి సంబంధించిన విషయాలను ఎక్కువ లోతుగా ఆలోచించకుండా సాధారణంగా చూడాలి. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ప్రతీతి పెద్ద సమస్యలా మారుతుంది. అప్పుడు ఇద్దరి మధ్య సంతోషానికి చోటు ఉంటుదు. ఏ తప్పూ చేయకున్నా సరే తప్పు చేసినట్లు కనబడుతుంది.
ఇంటి పనులు
ఇంట్లో పనుల్ని ఇద్దరూ కలిసి చేసుకున్నప్పుడే కష్టాన్ని పంచుకొని ఆనందంగా ఉంటారు. నేను ఉద్యోగం మాత్రమే చేస్తాను ఇంటి పనులను నువ్వే చూసుకోవాలి అని అనే భార్యా, భర్తల వల్ల కూడా కలహాలు పెరిగిపోతున్నాయ్. ఇద్దరూ కలిసి ఇంటి పనులన్నీ కలిసి చేసుకున్నప్పుడే అనుబంధం బలపడుతుంది.
అహంకారం
జీవిత భాగస్వాములు పెళ్లైన తరువాత భర్తపై భార్య, భార్యపై భర్త అహంకారాన్ని తగ్గించుకోవాలి. నీకన్నా నాకె ఎక్కవ తెలుసు, నీకన్నా తెలివితేటలు నాకే ఉన్నాయ్, నీ జీతంకన్నా నా నెలసరి జీతమే ఎక్కువ, నువ్వు చెప్పింది నేను ఎప్పటికీ వినను లాంటి పట్టింపులు మొండితనం వల్ల భార్యభర్తలు తరచుగా గొడవ పడుతుంటారు. ఇద్దరూ అహంకారాన్ని తగ్గించుకున్నప్పుడే మీమధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.



Click it and Unblock the Notifications