Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అందరిలోనూ అసూయ కల్గించే జంటగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!
కొన్ని జంటలు ఎప్పుడు చూసిన చాలా సంతోషంగా ఒకరిపై మరొకరు ప్రేమతో మెలుగుతూ కనిపిస్తుంటారు. చూసిన వాళ్లు ఎవరైనా సరే వారిద్దరి మధ్య అసలే గొడవలే జరగవని అనుకుంటారు. కానీ అలా జరిగే ఛాన్స్ ఉండదు. ఏ ఇద్దరు కూడా ఇలా ఒకే స్వభావంతో ఉండరు. ఉండలేరు కూడా.
ఇలాంటి పరిస్థితుల్లో అభిప్రాయ భేదాల వల్ల సహజంగానే ప్రతి దంపతుల మధ్య కొన్ని గొడవలు వస్తాయి. అయితే వీటిని ఎదుర్కుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. ప్రతీ ఒక జంట ఏదో ఒక సమయంలో ఇలాంటి గొడవలను ఎదుర్కొనే ఉంటారు.

కానీ వీటిని అధిగమించడానికి చాలా కష్టపడాలి. అప్పుడే మీ సంబంధం ఆరోగ్యంగా ఉంటుంది. సంతోషంగా ఉన్న జంటలకు కూడా గొడవలు ఉంటాయి. అయితే ఆ గొడవలు వారి మధ్య ప్రేమను మరింత బలపరుస్తాయి. తెలివైన, సంతోషంగా ఉన్న జంటలు తమ సమస్యలను ఎలా అధిగమిస్తారో తెలుసా..?
1. సమస్యలను పెంచుకోకుండా పరిష్కరించుకోవడం!
వివాదాలు తలెత్తినప్పుడు సంతోషకరమైన జంటలు దానిని పొడిగించే బదులు దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుంటారు. గొడవలో భాగస్వామిని ఓడించాలని చూస్తుంటే సమస్య మరింత పెద్దది అవుతుంది. కానీ గొడవ తగ్గాక దాని గురించి మెల్లిగా మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి.
2. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించడం:
సంతోషంగా ఉన్న జంటలు గొడవ పడినప్పుడల్లా వారిద్దరినీ సంతోష పెట్టే పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. దాంపత్య జీవితం ఇద్దరు వ్యక్తులతో ఏర్పడిందని వారు అర్థం చేసుకుంటారు. అందుకే ఒకరి సంతోషానికి మరొకరు విలువను ఇస్తారు.
3. ఒకరు చెప్పేది మరొకరు వినడం:
సంబంధంలో మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ తరచుగా ఎవరి గురించి వాళ్లే చూసుకుంటారు. ఇతరుల ఆలోచనలను తెలుసుకోవాలనే ఆసక్తి వీరికి ఉండదు. దీనివల్ల వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువవుతాయి. కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే జంటలు తమ భాగస్వామి మాటలను సమాన శ్రద్ధతో వింటారు . అలాగే వాటిని పూర్తిగా విని అర్థం చేసుకుంటారు.
4. తప్పును రిపీట్ చేయకపోవడం:
చాలా మంది జంటలు గొడవ పడినప్పుడు అది ముగిసిన తర్వాత వారు తమ భాగస్వామికి క్షమాపణలు చెబుతారు. కానీ కొన్నాళ్లు కాగానే మళ్లీ అదే తప్పును పునరావృతం చేస్తారు. దీంతో వారి మధ్య వాగ్వాదం మరింత పెరుగుతుంది. అలాగే పరస్పర విశ్వాసం కూడా తగ్గుతుంది. కానీ సంతోషంగా ఉన్న జంటల మధ్య ఏదైనా వివాదం ఉంటే.. వారు మళ్లీ ఆ తప్పును పునరావృతం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
5. పరస్పర గౌరవం:
ఎలాంటి బంధంలో అయినా గౌరవం చాలా ముఖ్యం. గౌరవం లేకుండా సంబంధంలో జీవించడం కష్టం. ఎందుకంటే ఆత్మగౌరవం కంటే మరేదీ ముఖ్యం కాదు. కాబట్టి మీ భాగస్వామిని గౌరవించండి. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ పనీ చేయకండి.
6. అద్భుతమైన కమ్యూనికేషన్:
కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఏదైనా సంబంధంలో అపార్థాలు ఏర్పడతాయి. సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి, మంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కాబట్టి మీరు బిజీగా ఉన్నప్పటికీ మీ భాగస్వామితో మాట్లాడటానికి కొంత సమయాన్ని వెచ్చించండి. దీని వల్ల మీరు వారితో సన్నిహితంగా ఉండగలరు.
7. నమ్మకం, నిజాయితీ:
ప్రతి సంబంధంలో నమ్మకం మరియు నిజాయితీ చాలా ముఖ్యమైనవి. అన్ని సంబంధాలకు పునాది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇది విచ్ఛిన్నమైతే సంబంధం విడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి. అదేవిధంగా సంబంధంలో నిజాయితీగా ఉండటం అవసరం. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి. ఒకరికొకరు నమ్మకంగా ఉండండి.



Click it and Unblock the Notifications