Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
భార్య భర్తల మధ్య ఎంత వయస్సు తేడా ఉండాలి,ఎందుకు? సైన్స్ ఏం చెబుతుందో చూడండి
ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు వధువు,వరుడిని చూసి నిర్ణయించి చేసేవాళ్లు. అయితే క్రమంగా ప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి. అబ్బాయి,అమ్మాయి వాళ్లే లవ్ చేసుకొని పెద్దలు ఒప్పుకుంటే చెప్పి,వాళ్లు ఒప్పుకోకుంటే చెప్పకుండానే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అయితే ప్రేమ ఏ వయస్సులో పుడుతుంది,ఎప్పుడు పుడుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. ఏ ఏజ్ లో అయినా, ఏ క్షణంలో అయినా ప్రేమ పుట్టే అవకాశం ఉంటుంది. ఇక వయస్సు కూడా అంతే.ఈ వయస్సు వారినే ప్రేమించాలి అనే రూల్ ఏమీ ఉండదు..ఈ రోజుల్లో చాలా మంది తమకన్నా పెద్దవారిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు..కొందరు తమ కన్నా చాలా చిన్నవారికి కూడా పెళ్లి చేసుకుంటున్నారు.
ప్రేమలో వయస్సు నిజంగా పట్టింపు లేదు.. కానీ వివాహం విషయానికి వస్తే సమాజంలోని అనేక నియమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా అనేది వివాహ బంధంలో తరచూ చర్చకు వచ్చే అంశం. దీనికి ఒక నిర్దిష్టమైన సమాధానం లేనప్పటికీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే కొంత స్పష్టత వస్తుంది. మన సమాజంలో సాధారణంగా భర్త తన భార్య కంటే పెద్దవాడై ఉండాలని నమ్ముతారు. కానీ ఇది నిజంగా అవసరమా లేదా? దీని గురించి సైన్స్ ,సమాజం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

సమాజం ఏమంటుంది
మనదేశంలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం వివాహానికి అనువైనదిగా పరిగణించబడుతుంది. సాంప్రదాయకంగా భర్త భార్య కంటే వయస్సులో పెద్దగా ఉండాలనే భావన శతాబ్దాలుగా ప్రబలంగా ఉంది ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహాలలో దీనిని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి కారణాలు అనేక ఉన్నాయి. పురుషుడు ఆర్థికంగా స్థిరపడాలి, కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి అనే భావన. అందువల్ల కొన్ని సంస్కృతులలో భర్త భార్య కంటే 5 నుండి 10 సంవత్సరాలు పెద్దగా ఉండాలని భావిస్తారు. అయినప్పటికీ కొన్ని జంటలలో భార్య భర్త కంటే పెద్దగా ఉండటం కూడా సాధారణమైపోయింది.
భార్య.. భర్త కంటే పెద్దది అయిన వివాహాలు చాలా విజయవంతమయ్యాయి కూడా. బాలీవుడ్ స్టార్ హీర్ షాహిద్ కపూర్-మీరా రాజ్‌పుత్ వంటి చాలా మంది ప్రముఖ జంటలు ఉన్నారు, వీరికి 13 సంవత్సరాల వయస్సు తేడా ఉంది.. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ఈ జంటలలో ప్రియాంక 10 సంవత్సరాలు పెద్దది, వీరికి చాలా వయస్సు అంతరం ఉంది, అయినప్పటికీ ఈ జంటలు విజయవంతమైన వివాహ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ రోజుల్లో ప్రేమ వివాహాల ట్రెండ్ పెరుగుతోంది..ఈ వయస్సు వ్యత్యాసానికి ప్రేమికులు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.
సైన్స్ ఏమంటోంది
సైన్స్ ప్రకారం, వివాహానికి శారీరక,మానసిక పరిపక్వత రెండూ ముఖ్యమైనవి. సైన్స్ ప్రకారం సరైన వయస్సు వ్యత్యాసం అనేది ఇద్దరు భాగస్వాములు మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఎంత పరిణతి చెందారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
శారీరక, మానసిక పరిపక్వత
అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పరిణతి చెందుతారు. బాలికలలో హార్మోన్ల మార్పులు 7- 13 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతాయి. అయితే అబ్బాయిలలో ఈ మార్పులు 9- 15 సంవత్సరాల మధ్య సంభవిస్తాయి. అందువల్ల పురుషుల కంటే స్త్రీల మానసిక అవగాహన, భావోద్వేగ స్థిరత్వం త్వరగా అభివృద్ధి చెందుతాయి.
వివాహానికి సరైన వయస్సు
భారతదేశంలో చట్టబద్ధమైన వివాహ వయస్సు బాలికలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు. చట్టపరంగా భార్యాభర్తల మధ్య మూడు సంవత్సరాల వయస్సు అంతరం ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది.
అయితే ఏ వివాహం అయినా విజయం అవడం ఏజ్ గ్యాప్ పై ఆధారపడి ఉండదు. ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతుంది. భార్యాభర్తల మధ్య వయస్సు తేడా అనేది వారి వ్యక్తిగత విషయం. అవగాహన, ప్రేమ, గౌరవం వంటి అంశాలు ముఖ్యమైనవి. వయస్సు వ్యత్యాసం 3 సంవత్సరాలు అయినా లేదా 15 సంవత్సరాలు అయినా భాగస్వాములిద్దరి ఆలోచనలు, అభిరుచులు, జీవిత లక్ష్యాలు ఒకేలా ఉంటే, ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు ఆదరించుకునే సంబంధం నిజంగా విజయవంతమైనది.



Click it and Unblock the Notifications