Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Ram Navami 2025: మంచి కొడుకుగా అవ్వడం ఎలా? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
హిందువులకు ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. విష్ణువు ఏడవ అవతారమైన రాముడు జన్మించిన రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా చైత్ర మాసంలోని శుక్ల పక్షమి తొమ్మిదవ రోజున (నవమి తిథి) శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. 2025లో శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీన వస్తుంది. శ్రీరాముడు కేవలం ఒక పేరు కాదు ఒక ఆదర్శం కూడా. ఆయన జీవితంలోని ప్రతి క్షణం మనకు ప్రేరణ కలిగిస్తుంది. ఒక ఆదర్శ కుమారుడిగా రాముడు చూపిన బాట నేటికీ ప్రతి కొడుకుకు గర్వకారణం. ప్రతి తల్లిదండ్రులు తమ కొడుకు శ్రీరాముడిలా ఉండాలని కోరుకుంటారు..పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉండాలని కోరుకుంటారు. అయితే రాముడిలాంటి కొడుకుగా మారడం అంత కష్టం కాదు.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడేలా ఉండాలనుకుంటున్నారా? అయితే శ్రీరామునిలోని కొన్ని ఉత్తమ లక్షణాలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మీరు తప్పకుండా ఆదర్శ పుత్రుడు అవ్వొచ్చు. ఆదర్శ పుత్రుడు అవ్వడం అంటే కేవలం మంచి మాటలు చెప్పడం కాదు, మంచి పనులు చేయడం,సంయమనంతో మెలగడం, బాధ్యతను గుర్తించడం, ప్రేమను పంచడం కూడా ముఖ్యమే. రాముడిలా ఆదర్శ పుత్రుడు అవ్వాలంటే ఏం చేయాలో వివరంగా ఇక్కడ చూడండి.

విధేయత
శ్రీరాముడు తన తండ్రి దశరథుని మాటను శిరసావహించి రాజ్యాన్ని వదులుకొని వనవాసానికి ఎటువంటి ప్రశ్నలు లేకుండా అంగీకరించాడు. తాను యువరాజునా లేదా తన హక్కులు ఏమిటి అని అతను ఆలోచించలేదు. తల్లిదండ్రుల మాటలను గౌరవంగా విని వారిని అర్థం చేసుకునేవాడే మంచి కొడుకు. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు చెడు జరగాలని కోరుకోరని మీరు అర్థం చేసుకోవాలి. వారు మీ తరపున ఒక నిర్ణయం తీసుకుంటుంటే వారు దానిలో మీ మంచిని చూస్తారు. కాబట్టి వారి నిర్ణయాలను గౌరవించండి,వారిని అర్థం చేసుకోండి. ఇది మీ ప్రేమను, గౌరవాన్ని వారికి తెలియజేస్తుంది.
కుటుంబ గౌరవం
శ్రీరాముడు తన వ్యక్తిగత సంతోషం కంటే కుటుంబ ప్రతిష్టకే ఎక్కువ విలువనిచ్చాడు. మీ చర్యలు మీ కుటుంబానికి గర్వకారణంగా ఉండాలి. మీ ప్రవర్తనతో తల్లిదండ్రులు తల ఎత్తుకు నిలిబడేలా ఉండాలి తప్ప నలుగురిలో తల దించుకునే విధంగా చేయకూడదు. రాముడు తన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. తన తండ్రి కోరిక మేరకు తన సోదరుడి కోసం తన రాజ్యాన్ని వదులుకుని వనవాసానికి వెళ్ళాడు. తల్లి కైకేయిని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు. సీతాదేవి కోసం రావణుడితో యుద్ధం చేశాడు. కుటుంబం గౌరవాన్ని మొదటి స్థానంలో ఉంచడం మంచి కొడుకు లక్షణం. మంచి కొడుకు ఎల్లప్పుడూ తన కుటుంబం పేరు, గౌరవం గురించి శ్రద్ధ వహిస్తాడు.
ఓర్పు, సహనం
శ్రీరాముడి జీవితం కష్టాలమయం. అయోధ్య రాజుగా పట్టాభిషేకానికి కొన్ని గంటల ముందు బహిష్కరణకు గురై, తన భార్య సీతను అపహరించబడి, రావణుడితో పోరాడి, ఇన్ని కష్టాలు ఎదురైనా శ్రీరాముడు ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. సంయమనం, సహనాన్ని పాటించాడు. మీ సంయమనం మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది. మంచి కొడుకు జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోడు.
నిష్కళంకమైన ప్రవర్తన
సత్యం, నిజాయితీ, కరుణ రాముడి ఆభరణాలు. మీరు కూడా ఈ విలువలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఎప్పుడూ నిజాయితీగా ఉండండి, అందరితో ప్రేమగా మెలగండి. మీ మంచి ప్రవర్తన మిమ్మల్ని అందరికీ ఆదర్శంగా నిలబెడుతుంది.
బాధ్యత
కొడుకుగా, సోదరుడిగా, భర్తగా రాముడు తన బాధ్యతలన్నింటినీ పూర్తి నిబద్ధతతో నిర్వర్తించాడు. మీ బాధ్యతలను గుర్తించండి, వాటిని శ్రద్ధగా పూర్తి చేయండి. మీ కర్తవ్య నిర్వహణ మీ తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications