Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
Relationship Advice : ఇవి పాటిస్తే.. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు..
రిలేషన్‌షిప్‌లో గొడవలు సహజం.కానీ ఆ గొడవలు మరింత దగ్గరవడానికి కావాలి గానీ ఒకరి మధ్య మరొకరికి దూరం పెరిగేలా ఉండవకూడదు. గొడవలు పెరగకముందే ఇద్దరూ సర్దుకుపోవాలి. ఇద్దరూ గొడవపడుతున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. ఎవరో ఒకరు ఇంకొకరికంటే బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి దంపతులే సంతోషంగా ఉంటారు.
బంధం బలంగా ఉండటానికి కమ్యునికేషన్ చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఆ ఇద్దరూ ఈ రోజు కలిసి భార్యాభర్తలుగానో ప్రేమికులుగానే ఉన్నారు. ఆ కమ్యునికేషనే లేకపోతే ఈ రోజు వారు ఇలా కలిసి ఉండేవారు కాదు. కాబట్టి మాట్లాడటమనే అంశం రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం. ఎక్కువ సేపు పార్ట్‌నర్‌తో మట్లాడకుండా ఉండడం కూడా సరైన విషయం కాది. అది సమస్యను మరింత పెంచుతుందే కానీ తగ్గించదు. కాబట్టి రిలేషన్‌షిప్‌లో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుతారనేది కూడా చాలా ముఖ్యం. రిలేషన్‌షిప్ బలంగా ఉండటానికి ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అనే విషయాలను మేము ఇక్కడ మీకు అందిస్తున్నాం.
పార్ట్‌నర్‌కు మాట్లాడే అవకాశమివ్వండి
మొత్తం మాట్లాడ్డం పూర్తికాకముందే మనం మన భ్యార్య, భర్తతో మధ్యలో మాట్లాడుతుంటాం, గొడవలో వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వము. ఇది పరిస్థితి మరింత దారుణంగా మార్చివేస్తుంది. వారి భావోద్వేగాలను బయటకు చెప్పుకునే అవకాశాన్ని మనం ఇవ్వాలి. వారు పూర్తిగా చెప్పేంత వరకు ఆగి మాట్లాడాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని వారు బహుశా పంచుకోవచ్చు. అందుకోసం వెయిట్ చేసి తరువాత మనం మాట్లాడాలి.

ఎమోషన్స్‌కు విలువ ఇవ్వండి
రిలేషన్‌షిప్‌లో ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్ట్‌నర్ ఎమోషనల్‌గా ఏదైనా చెబుతున్నప్పుడు ఓర్పుగా వినాలి. వారి భావోద్వేగాలను అర్ధం చేసుకోవాలి. ఆ పరిస్థితిలో పార్ట్‌నర్‌తప్పైనప్పటికీ వారి ఎమోషన్స్‌ను గౌరవించాల్సిన బాధ్యత పార్ట్‌నర్‌కు ఉంది.
వాళ్లని వారిలా అంగీకరించాలి
బంధంలో ఇద్దరూ ఒకేలా ఉండరు. భిన్న మనస్తత్వాలు ఉంటాయ్. ఒకరు రుచులు మరొకరి రుచులు వేరువేరుగా ఉంటాయ్. పార్ట్‌నర్‌ను మార్చే ప్రయత్నం చేయవద్దు. వారిని వారిలాగే ఉండనివ్వాలి. వారిని వారిలా అంగీకరించాలి. మీకు నచ్చినట్లు మార్చుకోవడానికి వారు కొంత రెడీగా ఉన్నా పూర్తిగా మానసికంగా అప్పుడే సిద్ధం అవడం కష్టం. కాబట్టి వారి అభిప్రాయాలను, మనస్తత్వాన్ని గౌరవించి వారి అభిరుచులను, వారి తత్వాన్ని యధాస్థితిగా మానం మనస్పూర్తిగా తీసుకోవాలి.
మౌనం ప్రమాదకరం
పార్ట్‌నర్‌తో గొడవ వచ్చినప్పుడు మాట్లాడాలి. చాలా మంది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఏమీ మట్లాడకుండా గోడకు ముఖం వేసుకొనో, టీవీ చూస్తూనో కాలం గుడుపుతారు. పక్కనే భార్యా, భర్తా ఉన్నా అస్సలు మాట్లాడరు. ఇదీ రిలేషన్‌షిప్‌కు చాలా ప్రమాదమని మానిసక నిపుణులు చెబుతున్నారు. ఎన్ని గొదబవలైనా మౌనంవీడి మాట్లాడుకోవాలంటున్నారు. రిలేషన్‌షిప్‌లో మౌనం చాలా ప్రమాదకరం.
క్షమించమని కోరడం
గొడవలో తప్పు పార్ట్‌నర్‌ది అయినప్పటికీ గొడవపడిన తరువాత క్షమాపణలు చెప్పాలి. సారీ అని చెప్పే ఒక మాట ఇద్దరి మనసులనీ తేలికపరుస్తుంది. బంధంలో ఒకరికోసం మరొకరు కొంచెం తగ్గడం మనలో వారికున్న ప్రేమను తెలియజేస్తుంది. ఒకరు తగ్గడం వల్ల పోయేదేమీ లేదు ఒక సారీ మాట తప్ప.



Click it and Unblock the Notifications