Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ విలువ పెరగాలంటే..ఈ తప్పులు అస్సలు చేయకండి
సందర్భం ఏదైనా సరే కొన్నిసార్లు కొందరు వ్యక్తులను చూడగానే మనకు తెలియకుండానే ఒకరకమైన గౌరవం కలుగుతుంది. వాళ్లు పెద్దగా మాట్లాడకోయినా, వారి గురించి గొప్పలు చెప్పుకోపోయినా కూడా వారిలో ఏదో తెలియని ప్రత్యేక ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే వారు ధరించిన దుస్తులు, వారికుండే బిరుదులు,వాళ్లు వాడే ఖరీదైన వస్తువులు వారిని ఇతురుల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి అనుకుంటే పొరపాటే. ఇతరుల నుంచి వారిని ప్రత్యేకంగా నిలబెట్టేదా వారి బిహేవియర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ప్రశాంతత. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నోళ్లు తమ విలువను నిరూపించుకోడానికి ట్రై చేయరు. వాళ్ల మాటలు, చేతలు,ఉనికే వారేంటో లోకానికి చెబుతాయి. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ చేయని ముఖ్యమైన పనులు ఏవో ఇక్కడ చూడండి.
తమ గురించి అతిగా చెప్పారు
గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారికి మిస్టరీ అనేది ఎంత పవర్ ఫుల్ అనేది తెలిసి ఉంటది. కాబట్టి వాళ్లు రహస్యంలో శక్తి ఉంటదని నమ్మి..కలిసిన ప్రతి ఒక్కరితో తమ జీవితంలోని ప్రతి వివరమూ, లక్ష్యాలు, ఎమోషన్స్ షేర్ చేసుకోరు. వారు నమ్మకాన్ని సంపాదించుకున్న వాళ్లతో మాత్రమే ఆచితూచి విషయాలను షేర్ చేసుకుంటారు. అతిగా మాట్లాడటం అనేది అభద్రతాభావం లేదా ఇతరుల ఆమోదం కోరుకునే తత్వానికి నిదర్శనం. కానీ సంయమనం పాటించడం ఆత్మవిశ్వాసానికి,స్వీయ సృహకు గుర్తు. తమ లైఫ్ లోని కొన్ని విసయాలను గోప్యంగా ఉంచడం వల్ల వారు తమ గౌరవాన్ని, ఆకర్షణను రెండింటినీ కాపాడుకుంటారు.

ఇతరులను మెప్పించడానికి శక్తిని వృధా చేయరు
హై క్లాస్ వ్యక్తులు ఇతరుల ఆమోదం కోసం పాకులాడరు లేదా వారిని ఆకట్టుకోవడానికి తమ ఎనర్జీని వేస్ట్ చేసుకోరు. తమ విలువ ఏంటో వారికి బాగా తెలుసు, అందుకే ఇతరుల ముందు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం వారికి ఉండదు. విమర్శలకు లేదా పోటీకి ఎమోషన్ తో స్పందించే బదులు, వారు తమ సెల్ఫ్ డెవలప్ మెంట్ పై, మానసిక ప్రశాంతతపై దృష్టి పెడతారు. వారి శక్తిని కాపాడుకోవడం అంటే.. పనికిరాని సంభాషణల కన్నా అర్థవంతమైన చర్చలను, నెగిటివ్ వాతావరణం కన్నా సానుకూల వాతావరణాన్ని ఎంచుకోవడం.
సంపద గురించి గొప్పలు చెప్పుకోరు
ఉన్నతమైన వ్యక్తులు తమ సంపదను ప్రదర్శించరు.. ఎందుకంటే వారికి ఆ అవసరం ఉండదు. నిజమైన సంపద ప్రదర్శనలో కాదని, సౌకర్యం, సంస్కారం, కృతజ్ఞతలో ఉందని వారికి తెలుసు. తమ ఖరీదైన కార్లు, బట్టలు, ఇళ్ల గురించి వారు ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోరు. వాటిని ప్రైవేట్ గా ఆస్వాదిస్తారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా తమ ఆస్తుల గురించి పదేపదే గొప్పలు చెబుతున్నారంటే అది వారి అభద్రతను సూచిస్తుంది కానీ విజయాన్ని కాదు. వినయం వారి అతిపెద్ద ఆభరణం.

అగౌరవానికి స్పందించరు
ఎవరైనా తమతో అమర్యాదగా లేదా దురుసుగా ప్రవర్తించినప్పుడు ఉన్నతమైన వ్యక్తులు వారితో వాదనకు దిగి తమ స్థాయిని తగ్గించుకోరు. అనవసరమైన డ్రామా కన్నా తమ మానసిక ప్రశాంతతకే ఎక్కువ విలువ ఇస్తారు. అలాంటి వారికి ప్రతిస్పందించడం ద్వారా ప్రతికూలతకు శక్తిని ఇచ్చినట్లు అవుతుందని వారు అర్థం చేసుకుంటారు. అందుకే వారు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి, ఆ వ్యక్తులకు, ఆ పరిస్థితులకు దూరంగా జరగడమే ఉత్తమమని భావిస్తారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది.
అనవసరంగా సారీ చెప్పరు
తప్పు చేయనప్పుడు లేదా అనవసరంగా క్షమాపణలు చెప్పడం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు చూపిస్తుంది. ఉన్నతమైన వ్యక్తులు తాము చేయని తప్పులకు, తమ అభిప్రాయాలకు లేదా తమకంటూ కొన్ని సరిహద్దులు పెట్టుకున్నందుకు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరు. వారు తమ అభిప్రాయాలను గౌరవప్రదంగా, ధైర్యంగా వ్యక్తం చేస్తారు. నిజంగా తప్పు చేసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి వెనుకాడరు. కానీ ప్రతి చిన్న విషయానికీ సారీ చెప్పి తమ విలువను తగ్గించుకోరు. ఇది వారిలో హుందాతనాన్ని పెంచి, ఇతరుల నుంచి గౌరవాన్ని సంపాదించి పెడుతుంది.



Click it and Unblock the Notifications