Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్‌షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
టాక్సిక్ రిలేషన్‌షిప్ ఇటీవలికాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట ఇది. ప్రేమికులు లేదా భార్యాభర్తల బంధంలో సంతోషం, మానసిక ప్రశాంతత కరువై మానసికంగా ఒత్తిడిని, అంచనాలను పెంచుతూ నిరాశలో కూరుకుపోయేలా చేస్తోంది. ఫలితంగా ఆ బంధం నుంచి విడిపోలేక కలిసి ఉండలేక సతమవుతున్నారు. ఈ క్రమంలో మనస్తత్వ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు..

ప్రేమికులైనా, దంపతులైనా బంధం ఏది అయినా ఒకరిపై మరొకరికి ప్రేమ, నమ్మకం, గౌరవం, భద్రతా భావం, స్వేచ్ఛ ఇవి తప్పనిసరి. వీటిలో ఏది లోపించినా ఆ బంధంలో ఒడుదొడుకులు తప్పవు. అందుకే ఆ రిలేషన్‌ను కొనసాగించాలా వద్దా అనే డైలామాలో పడిపోతూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ప్రధానంగా ఐదు సమస్యలను జంటలు ఎదుర్కొంటున్నారు.
నియంత్రణ- దంపతులైనా, ప్రేమికులైనా అవతలి వ్యక్తిని తమ అధీనంలో ఉంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. తమకు ఇష్టంలేని పనులు తమ భాగస్వామి చేయకూడదని ఆశించడం, ఫ్రెండ్స్, కుటుంబీకులతో మాట్లాడకుండా కంట్రోల్ చేయడం వంటి వాటి ద్వారా ఎదుటి వ్యక్తిని ఇబ్బందులు పెడుతుంటారు. వారి ఇష్టాయిష్టాలకు అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించరు.
గ్యాస్‌లైటింగ్: రిలేషన్‌లో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తారు. భాగస్వామి ఆలోచనలు, నమ్మకాలను తప్పుపడుతూ వారిని పదేపదే అవమానించాలని చూస్తుంటారు. పార్ట్‌నర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైంది కాదంటూ వారి అభిప్రాయాలపైనే అనుమానం కలిగేలా చేస్తుంటారు.
గౌరవం లేకపోవడం: లవర్ లేదా జీవిత భాగస్వామిని తరచూ ఇతరుల ముందు అవమానిస్తుంటారు. అంతేకాకుండా వారిని చిన్నచూపు చూస్తూ చేసిన ప్రతి పనినీ వేలెత్తి చూపిస్తుంటారు. నిరంతరం విమర్శిస్తూ చులకన భావంతో చూస్తుంటారు. వారిని ప్రోత్సహించడం మానేసి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటారు.
భావోద్వేగ అభద్రత: ఏ రిలేషన్ అయినా కపుల్ మధ్య భద్రతా భావం ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 'నేనున్నాను’ అనే నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. కానీ టాక్సిక్ రిలేషన్‌లో ఉన్నంత కాలం భావోద్వేగపరంగా అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. మీ ఎమోషన్స్‌కి విలువ ఇవ్వరు. ఫలితంగా ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.
మార్పు లేకపోవడం: కొందరు భాగస్వామి ప్రవర్తనతో విసిగి వేసారిపోయి తమ బాధను వారితో చెప్పుకొంటారు. కానీ వారు తమ పద్ధతిని మార్చుకోరు. ఇంకా మరింతగా వారిని కుంగదీస్తుంటారు. దీంతో ఇది టాక్సిక్‌గా మారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
అయితే మీరు ఏ రిలేషన్‌లో ఉన్నారో దాని ఆధారంగా టాక్సిక్ రిలేషన్‌ను హ్యాండిల్ చేసుకోవాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. పెళ్లి కానట్లయితే ఇలాంటి బంధాన్ని భరించాల్సిన, కొనసాగించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేని బంధంలో ఎక్కువ కాలం కొనసాగి విలువైన జీవితాన్ని, సమయాన్ని వృథా చేసుకోవద్దని చెబుతున్నారు.
ఇక పెళ్లయిన దంపతుల మధ్య టాక్సిక్ రిలేషన్‌ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వివాహ బంధంలో తల్లిదండ్రులు, అత్తామామలు, పిల్లలు ఇలా చాలా బంధాలు ముడిపడి ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా అది కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ముందుగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన, ఉద్యోగంలో ఒత్తిళ్లు, మాట తీరు వీటిని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. అనంతరం అందుకు అనుగుణంగా భర్త లేదా భార్య మాట తీరు, ప్రవర్తన ఉంటే ఎలాంటి పొరపొచ్చాలు రావు.
ఇలా చేయడం ద్వారా మీ భాగస్వామి తర్వాత ఏం చేస్తున్నారో ఓ అంచనాకి రావొచ్చని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వారి ప్రవర్తన ద్వారా మీరు నిరాశకి గురికావడం లేదా బాధపడటం, ఎమోషనల్ అవడం లాంటి సంఘటనలు ఎదురుకావని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications