Latest Updates
-
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది?
మనతో ఉంటూనే వెన్నుపోటు పొడిచే వారిని ఎలా గుర్తించాలో తెలుసా? వారిలో ఈ లక్షణాలే ఉంటాయి!
సమాజంలో మనం వివిధ వ్యక్తిత్వాలున్న మనుషులను కలుస్తాం. వారిలో ఎవరు మంచి వారు, ఎవరు చెడ్డవారో మనం కనిపెట్టడం చాలా కష్టం. మనం కలిసే వారిలో కొందరు మన శ్రేయస్సు కోరుకుంటే, మరికొందరు మనకు హాని కలిగించాలని చూస్తుంటారు. ఎప్పుడు ఎలాంటి అవకాశం దొరుకుతుంది? మనల్ని ఏ విధంగా అణగదొక్కాలి అనే ఆలోచనల్లోనే ఉంటారు. అయితే మనం ఎవరితోనైతే సావాసం చేస్తామో.. వారిలో మనల్ని మోసం చేసే వ్యక్తులతో దూరంగా ఉండడమే చాలా మంచిది. ఇది మన మానసిక ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు ఎంతో అవసరం. అలాగే మనం జీవితంలో ఎదిగేందుకు.. మోసాలకు గురవకుండా ఉంటుంది.
కానీ మనకు హాని చేసే వ్యక్తులను గుర్తించడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వారు మనతో మంచిగా నటిస్తూనే మనల్ని మోసం చేస్తారు. మన చుట్టూనే తిరుగుతూనే మనల్ని నట్టేట ముంచేస్తారు. మన శత్రువులను సైతం మనం సులభంగా కనుక్కోవచ్చు కానీ.. ఇలాంటి వ్యక్తులను కనుక్కోవడం మాత్రం చాలా కష్టం. అందుకే ఈ కథనంలో మేము.. మన చుట్టూ తిరుగుతూనే మనల్ని నట్టేట ముంచేసే వ్యక్తులను ఎలా గుర్తించాలి, వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది వివరించాము. ఈ స్టోరీని పూర్తిగా చదివి మీరూ తెలుసుకోండి.

1. మాట మార్చేవారు:
సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరంటే మాట మార్చేసే వ్యక్తులు. ఎవరైతే వ్యక్తులు సులభంగా మాటలను మార్చేస్తారో వారిని నమ్మకం పామును నమ్మడం కంటే ప్రమాదం. ఎందుకంటే వారు మనతో మనకు అనుకూలంగా మాట్లాడి, మన వద్ద ఉన్న సీక్రెట్స్ తీసుకొని.. మరొక వ్యక్తి వద్ద వారికి అనుకూలంగా మాటలను మార్చేయగలుగుతారు. ఇలా చేసే వ్యక్తులతో కచ్చితంగా ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే వారు మనల్ని ఏ క్షణమైనా మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వ్యక్తులను గుర్తించి, వారితో సంబంధాలను తెంచుకోవడం చాలా ఉత్తమం.
2. వెనుక నుంచి నిందించేవారు:
మన గురించి మంచి చెప్తూనే మన వెనక మనల్ని గోతిలో తోసేసి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనతో ఉంటూ మన లోపాలను తెలుసుకొని.. ఆ లోపాల ద్వారా మనల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. మన ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టి మనకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తారు. ఇది మన జీవితంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి వారితో ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి అవసరం ఉంటుంది.
3. ప్రతిదానికి వ్యంగ్యంగా స్పందించేవారు:
నలుగురిలో వెళ్ళేటప్పుడు మనకు గుర్తింపు అనేది చాలా ముఖ్యం. అలాగే ఆ నలుగురితో కలిసి తిరిగేటప్పుడు మనకు గౌరవం అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఆ నలుగురితో మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో అపహాస్యంగా మాట్లాడడం, మనల్ని వెటకారం చేసే వ్యక్తులతో దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నలుగురిలో మన గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మనల్ని హేళన చేయడంతో పాటు మనల్ని తక్కువ చేసి చూపించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు మనం జోకర్ అయ్యే సూచనలు ఉంటాయి. అందుకే ఇలాంటి వ్యక్తులతో స్నేహాన్ని దూరం చేసుకోవాలి. వారు దగ్గరికి వచ్చినా తెలివిగా వారిని వదిలించుకోవాలి. అప్పుడే నలుగురిలో మనకు గౌరవంతో పాటు హోదా కూడా లభిస్తుంది.
4. ప్రతిదానికి తప్పు పట్టేవారు:
మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిలో లోపాలను పట్టుకొని ఇది తప్పు అని మనల్ని నిలదీస్తే, ఎలా ఉంటుంది చెప్పండి. మన ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. దీని కారణంగా మనం ఆ పనిపైన ఏ మాత్రం ద్రుష్టి సారించలేము. అలాగే మన చేసే చర్యలలో తప్పులు మాత్రమే చూసే వ్యక్తులు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తారు. వారి నిరంతర విమర్శలు మన అభివృద్ధిని అడ్డుకుంటాయి. అటువంటి వారిని దూరంగా ఉంచడం ద్వారా మన సానుకూల దృక్కోణంతో ఉంటాము. అలాగే మన జీవిత అభివృద్ధి కొనసాగుతుంది. మనం ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది.
5. ప్రతిదానికి ఓకే చెప్పేవారు:
మన ప్రతి నిర్ణయానికి సరే అని ఒప్పుకోవడం, ఏం చెప్పిన తల ఊపే వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఎందుకంటే నిజమైన అభిప్రాయం ఇవ్వని వ్యక్తులు మనకు సరైన మార్గదర్శకత్వం అందించరు. సమయానికి మంచి సలహాలు, సూచనలు ఇచ్చే వ్యక్తుల ద్వారా మన అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఆ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులను మన జీవితంలో ఉంచుకోవడం అవసరం.
6. అసూయపడేవారు:
మన విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు మన ఆనందాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. వారి నెగటివ్ ఎనర్జీ మన ప్రగతిని అడ్డుకోగలదు. అటువంటి వారిని గుర్తించి, వారితో దూరంగా ఉండడం మంచిది.
7. బాధ్యతలు తీసుకోని వ్యక్తులు:
తమ తప్పులను ఒప్పుకోని, బాధ్యతలు తీసుకోని వ్యక్తులు మనపై ఆరోపణలు చేయగలరు. ఇలాంటి వారితో సంబంధాలు మన జీవితంలో అనవసర సమస్యలను సృష్టించగలవు. కాబట్టి, వారిని దూరంగా ఉంచడం ఉత్తమం.
8. నెగటివ్ ఆలోచనలు కలిగినవారు:
ప్రతి విషయాన్ని ప్రతికూలంగా చూసే వ్యక్తులు మన సానుకూల దృక్కోణాన్ని తగ్గించగలరు. వారి నెగటివ్ ఆలోచనలు మన మనోభావాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి వారిని దూరంగా ఉంచడం ద్వారా మన ఆనందం మరియు శాంతి పొందగలుగుతాము.
9. గాసిప్ చేయడంలో ఆసక్తి చూపేవారు:
ఇతరుల గురించి అనవసరంగా గాసిప్ చేసే వ్యక్తులు మన విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. వారి అలవాట్లు మన సంబంధాలను దెబ్బతీయగలవు. ఇలాంటి వారిని దూరంగా ఉంచడం మంచిది.
10. సహానుభూతి లేని వ్యక్తులు:
మన భావోద్వేగాలను అర్థం చేసుకోని, సహానుభూతి చూపని వ్యక్తులు మన సంబంధాలలో శూన్యతను సృష్టిస్తారు. అటువంటి వారితో సంబంధాలను పరిమితం చేయడం ద్వారా మన భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ముగింపు:
మన జీవితంలో సానుకూల శక్తిని పెంచుకోవడానికి, పై పేర్కొన్న రకమైన వ్యక్తులను గుర్తించి, వారితో దూరంగా ఉండడం అవసరం. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో, సంతోషకరమైన మరియు సమతుల్య జీవనాన్ని సాధించడంలో సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











