Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
మీ భాగస్వామి సోషల్ మీడియాలో మునిగిపోతున్నారా? ఈ రెడ్ సిగ్నళ్లను గమనించకపోతే సమస్యలు తప్పవు
ఇది సోషల్ మీడియా యుగం. ఔనన్నా.. కాదన్నా.. అది అంగీకరించాల్సిందే. ఇప్పుడు సోషల్ మీడియా వాడని వారిని వెనకపడి పోయారని, ట్రెండ్ ను ఫాలో కావడం లేదని, ఓల్డ్ జనరేషన్ అని అంటున్నారు. చిన్న పిల్లల నుంచి యువతీ యువకులు, మధ్య వయస్కులు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఉంటారు. వారి అభిప్రాయాల, ఆలోచనలకు, లక్ష్యాలకు తగ్గట్లు పోస్టులు చేయడం, కామెంట్లు చేయడం, ఫాలో అవ్వడం చేస్తుంటారు. చాలా మంది సోషల్ మీడియా వల్ల తప్పుడు దారిలో వెళ్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి వికృత పనులకు ఉసిగొల్పుతాయో అప్పుడప్పుడు వార్తల్లో చదువుతూనే ఉన్నాం.

అందుకే సోషల్ మీడియా వాడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు నిపుణులు. దంపతుల విషయానికి వస్తే ఇద్దరిలో ఒకరు రోజూ అదే పనిగా, ఎప్పుడూ చూసినా సోషల్ మీడియాలో మునిగిపోతుంటే జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కొన్ని రెడ్ సిగ్నళ్లను ఎప్పటికప్పుడు గమనించి జాగ్రత్త పడకపోతే సంబంధం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ రెడ్ సిగ్నల్స్ ఏంటో తెలుసుకుందామా..
1. సోషల్ మీడియాలో సింగిల్ అని పేర్కొనడం:
పెళ్లి అయిపోయినా కూడా సోషల్ మీడియాలో సింగిల్ అనే పేర్కొంటుంటే.. దానిని రెడ్ సిగ్నల్ గా చూడాలని అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. మ్యారిట్, కమిటెడ్ అని పేర్కొంటే.. కొత్త వ్యక్తులు తమని ఫాలో కాకపోవచ్చని, కొత్త వ్యక్తులు కలవడానికి ఆసక్తి చూపకపోవచ్చని అనుకుని ఇలా సింగిల్ అనే ఉంచుతారు. అలాగే సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని చూసినా అనుమతించకపోవడం అతి పెద్ద రెడ్ సిగ్నల్ అని భావించాలట.
2. ఇతరుల పోస్టులపై రొమాంటిక్ కామెంట్లు:
ఇతరులతో సరసాలాడటం అది కూడా సోషల్ మీడియాలో సరసాలాడటం అతి పెద్ద రెడ్ సిగ్నల్ అని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి ధోరణి క్రమంగా పెరిగి పెద్దదై వివాహేతర సంబంధాలకు కూడా దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఏదైనా పోస్టుపై మీ భాగస్వామి రొమాంటిక్, ఎరోటిక్ కామెంట్లు పెడుతున్న జాగ్రత్త పడాల్సిందేనట.
3. ప్రైవేట్‌గా ఉండటం, సీక్రెంట్ అకౌంట్లు ఉండటం:
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత ఉంటుంది, ఉండాల్సిందే కూడా. దంపతులైనా, తల్లిదండ్రులు అయినా కూడా కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అది కేవలం మీకు మాత్రమే చెందినది. వ్యక్తిగత గోప్యతను అంగీకరించాల్సిందే. అయితే.. వారు పెట్టే కొన్ని పోస్టులను కనబడకుండా చేసినా, మిమ్మల్ని బ్లాక్ లో ఉంచినా, లేదా సీక్రెట్ అకౌంట్లను మెయింటైన్ చేస్తూ ఇతరులతో వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నా జాగ్రత్త పడక తప్పదు.
4. కొన్ని పోస్టులకు కొందరి ప్రత్యేకంగా ట్యాగ్ చేస్తుండటం:
మనం పెట్టే పోస్టులు అందరూ చూడాలని, లైక్ చేయాలని, కామెంట్లతో ప్రశంసలు కురిపించాలని అనుకోవడం చాలా సహజం. అయితే మరో అడుగు ముందుకేసి.. కొన్ని ప్రైవేట్ పోస్టులను కొందరికి మాత్రమే ట్యాగ్ చేయడం, తరచూ వారిని ట్యాగ్ చేస్తూ ఒకరకమైన పోస్టులు పెట్టడం రెడ్ సిగ్నలే.
5. ఒకటే ప్రొఫైల్‌ను తరచూ చూడటం:
కొందరు తమకు నచ్చిన ప్రొఫైళ్లను, పేజీలను తరచూ చూస్తుంటారు. అందులో కంటెంట్ నచ్చడం వల్ల, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి అలా చేయడంలో పెద్దగా తప్పు అనిపించకపోవచ్చు. కానీ కొందరు కావాలనే కొందరి ప్రొఫైళ్లు తరచూ చూస్తుంటారు. వారి ఏదైనా ఫోటో పెడితే దానిని తరచూ చూస్తుండటం, ఎప్పుడూ అదే పోస్టు చూస్తూ కనిపించడం కచ్చితంగా రెడ్ సిగ్నల్.
6. ఎక్స్ లను ఫాలో అవుతుండటం:
ప్రేమించిన వారిని, ఇష్టమైన వారిని.. పెద్దలు ఒప్పుకోలేదనో, ఆర్థిక పరిస్థితి బాలేదనో, జాబ్ లేదనో ఇలా చాలా కారణాల వల్ల పెళ్లి చేసుకోకపోయి ఉండవచ్చు. అలాంటి వారు పెళ్లి తర్వాత తమ మాజీ ప్రియుల ప్రొఫైళ్లను ఫాలో అవడం, వారు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి పోస్టులపై లైక్ చేయడం, కామెంట్ పెట్టడం, ఛాటింగ్ చేయడం లాంటి వాటిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. రొమాంటిక్ కామెంట్లు, రీల్స్, షార్ట్స్ షేర్ చేసుకోవడం, శృంగారభరితంగా ఛాటింగ్ చేసుకోవడం గమనించినట్లైతే వెంటనే తేరుకుని జాగ్రత్తలు పాటించడం మొదలు పెట్టాల్సిందే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications