Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
ఇలా చేస్తే.. కొన్ని రోజుల్లోనే ఆకర్షితులౌతారు..!
ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మయిని అబ్బాయి ఆకర్షించాలంటే ఒక్కరోజులే అయ్యే పని కాదు. ఎంతో మంది ప్రయత్నించి దీంట్లో విఫలం చెందారు. ఎవరినైనా ఆకర్షించాలంటే డబ్బు వుంటే, అందం వుంటే సరిపోతుంది. చిటికెలో ఆకర్షితులౌతారని అనుకుంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో మొత్తం వేరుగా వుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయ్. ఇక్కడ మీకు అమ్మాయిని ఆకర్షించే కొన్ని పద్ధతులను మీతో పంచుకోబోతున్నారు. ఇది ఆకట్టుకోవడానికి చిట్కాలనుకోవచ్చు.
ఒక అమ్మాయిని వస్తువులా చూడవద్దు. తనకూ మనసుందని భావించాలి. తనకు కుటుంబం, బాధ్యతలు ఉన్నాయని తనకు ప్రత్యేక ఇష్టాలున్నయనే విషయాన్ని గుర్తించాలి. వారికంటూ ఆత్మగౌరవం వుంటుంది. ప్రతీ విషయంలో వారికి గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు వారిని ఆకర్షించగలరు.
కళ్లకు చాలా శక్తి వుంటుంది. అవి చాలా సున్నితమైన భాగాలైనప్పటికీ కళ్లతో మాట్లాడ్డం చాలా ప్రభావాన్ని చూపిస్తాయ్. అమ్మాయి కళ్లల్లోకి చూసి మాట్లాడినప్పుడు మీరు వారిని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు. కళ్లల్లోకి చూడ్డం ద్వారా మీలో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీరు కల్పించినట్లై అట్రాక్ట్ చేయగలుగుతారు.

ఏదైనా సహాయాన్ని కోరండి. అది ఎంత చిన్న సహాయమైనప్పటికీ మీరు అడగడం వల్ల వారి మనసులో కొంత స్థానాన్ని సంపాదించినవారౌతారు. అది ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌కు మొదటి వారధిగా అనుకోవచ్చు. ఎంత చిన్న సాయమైనా సరే అడగడానికి ప్రయత్నించాలి.
వారితో ఎక్కువ మాట్లాడడానికి కంటే ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. ఆమె ఇష్టా అయిష్టాలను తెలుసుకునే సమయం ఇదేనన్న విషయాన్ని మరవకూడదు. మీ అభిరుచులను తెలపండి. ఆమెకు ఇష్టమైనవి కనుక్కోండి. కొంత బంధాన్ని బిల్డప్ చేయడానికి ప్రయత్నించండి.
నిజాయితీ, నిజమైన వ్యక్తిత్వం ద్వారా సులభంగా ఆకట్టుకోగలుగుతారు. ఏ దాపరికాలు లేకుండా మీరు మాట్లాడినప్పుడు మీపై నమ్మకం పెరుగుతుంది. అప్పుడు సులభంగా ఆకట్టుకోగలుగుతారు.
ఆమె పట్ల గౌరవంగా వ్యవహరించాలి. ఆమెకు ఇష్టం లేని పనులు ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దు. వారి ఇష్టాలను గౌరవించాలి. మాటల్లో చేతల్లో కూడా గౌరవం కనిపించాలి. అప్పుడు మాత్రమే ఆకర్షితులౌతారు.
అబద్ధపు వాగ్దానాలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇక జీవితంలో మీపై ఇష్టం ఏర్పడే అవకాశం కూడా వుండదు. సాధ్యమైనం నిజాయితీని, ఉన్నది ఉన్నట్టుగా చూపండి.
మంచి దుస్తులను ధరించాలి. కొంత ఫ్యాషన్ సెన్స్ వుండాలి. శుబ్రథ పాటించాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించేవారికి ఆకర్షితులౌతారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి కూడా ఆకర్షితులౌతారు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె కోసం మీరు సమయాన్ని కేటాయించాలి. ఆమెకు ప్రాధాన్యతనివ్వాలి. సమయం కేటాయించలేకపోతే మీకు ఆకర్షితులవ్వడం చాలా కష్టమని నిర్ధారణకు రావచ్చు.
తన జీవిత లక్ష్యాన్ని గౌరవించాలి. మీకు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. లక్ష్యం లేనివారికి ఆకర్షితులవరనే సత్యాన్ని గుర్తించాలి.
అయితే కొందరు మీరెలాంటి ప్రయత్నాలు చేసిన మీరు కావాలని ఇంప్రెస్ చేయడానికి నటిస్తున్నారన్నవిషయాన్ని కూడా చాలా సులభంగా పసిగట్టే వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆకర్షించేందుకు కేవలం టిప్స్ మాత్రమే. రియల్‌గా, జెంటిల్‌మెన్‌గా ఉన్నవారికి సహజంగా ఎక్కువగా ఆకర్షితులౌతారని అంటున్నారు.



Click it and Unblock the Notifications