Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
ఇంట్లో భార్య ఎన్నో పనులను చేస్తుంది. అమ్మగా, ఇంటి ఇల్లాలుగా, భార్యగా ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకుంటుంది. ఇక కొంతమంది భార్యలు అటు ఆఫీస్ పని అయిపోయిన తరువాత కూడా ఇంటి పనులను చూసుకుంటూ తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి భార్యలు కలిగిన భర్తలు వైఫ్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలనేదానిపై తపన పడుతుంటారు. ఇది అలాంటి భర్తల కోసమే కాబట్టి ఇందులో చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టి మీ భార్యతో మరింత సంతోషంగా గడపండి.
గౌరవం
మీ భార్యకు గౌరవం దక్కే విధంగా ప్రవర్తించాలి. ఏదైనా ప్రశ్నించేటప్పుడు లేదా నిలదీద్దామనుకునే సందర్భంలో ఆచితూచి ఆలోచించి అందరి ముందు మీ భార్యను అవమానించకుండా జాగ్రత్త పడాలి.

తప్పును అంగీకరించడం
మనిషి తప్పులు చేయడం సహజం. వివాహబంధంలో భార్యాభర్త ఇద్దరూ తప్పు చేస్తారు. కొన్ని సందర్భాల్లో భర్త తప్పే ఉంటుంది. పురాణాల ప్రకారం, కొందరు పండితులు చెబుతున్నట్లు భార్తకే భార్యపైన పైచేయి ఉంటుందని చెబుతుంటారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా భర్త తప్పు ఉంటే భార్య ముందు తన తప్పును అంగీకరించాలి.
ఇంటిపనుల్లో సాయం
ఇంటి పనులను భార్యే చెయ్యాలి అనే నియమం ఉన్నది ఉన్నట్టు పాటించవద్దు. మీ భార్యకు ఇంటి పనుల్లో సహాయపడితే ఇద్దరూ కలిసి పనిచేసుకొని మరింత దగ్గరౌతారు. అలా పనుల్లో సహాయపడితే కొత్త రకమైన ఫీలింగ్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు. అహంకారాన్ని వదిలేసి కలిసి సంసారంలో ముందుకు సాగాలి.
తగ్గాలి
మీ భార్యతో గొడవపడినప్పుడు గొడవను పెద్దది కాకుండా ప్రయత్నం చేయాలి. నేను మగాడిని నేనెందుకు తగ్గాలనే తత్వాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ తగ్గాలో తిలిసినవాడే అసలైన భర్త అనిపించుకొని మీ భార్యతో మరింత హ్యాపీగా గడపండి.
రొమాన్స్
ఇద్దరి మధ్య రొమాన్స్ ఉన్నప్పుడే లైఫ్ బోరింగ్‌గా కాకుండా హ్యాపీగా గడిచిపోతుంది. సాధ్యమైతే అప్పుడప్పుడు మీ భార్యపై రొమాంటిక్‌గా కవితలు చెప్పండి. ఇద్దరూ కలిసి వీకెండ్స్, హాలిడేస్‌లో బయటకు వెళ్లి హనీమూన్ ట్రిప్‌లా ఎంజాయ్ చేయండి. వయసు ఎంత పెరిగినా భార్యా భర్యల అనుబంధం ప్రేమ పెరుగుతూనే ఉండాలి.
సర్‌ప్రైజ్ గిఫ్టులు
బహుమతులతో మీ సతీమణిని సర్‌ప్రైజ్ చేయండి. బహుమతి ఇవ్వాలంటే పెళ్లి వార్షికోత్సవమో, పుట్టినరోజో కానవసరం లేదు. మీ భార్యకు ఇష్టమైన వస్తువును బహుమతిగా తెచ్చి సర్‌ప్రైజ్ చేయండి. తనకు ఇష్టమైన వంటకాన్ని మీరే మీ చేతులతో వండండి. ఇలాంటి చేయడం వల్ల మీ బంధం మరింత తియ్యగా మారుతుంది.
ఐలవ్‌యూ
కళ్లల్లోకి చూసి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని సందర్భం కలిగినప్పుడు మీ భార్యకు చెబుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ భార్యపై మీకున్న ఆప్యాయత, ప్రేమ, ఇష్టం, ఎమోషన్ అన్నీ నేరుగా ఆమెకు చేరిపోతాయ్.



Click it and Unblock the Notifications