Latest Updates
-
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం
Relationship Tips: హేయ్ బ్రో! పడకగదిలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి
శృంగారం ఈ అనిర్వచణీయమైన అనుభూతిలో దంపతులు ఇద్దరూ సుఖం, భావప్రాప్తి పొందడం అంత సులవైన విషయమేమీ కాదు. మరీ అంత కష్టమైన విషయం కూడా కాదు. శృంగార సమయంలో శారీరకంగా, మానసికంగా అందులో లీనమైపోయి, ఒకరినొకరు ఆస్వాదించడానికి కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలి.
శృంగారాన్ని చాలా మంది దాని క్వాలిటీతో కాకుండా క్వాంటిటీతో కొలుస్తారు. ఎక్కువసార్లు, ఎక్కువ సేపు చేస్తే చాలా సుఖపడవచ్చని అనుకుంటారు. అయితే శృంగారంలో సంతృప్తి పొందడానికి ఇదొక్కటే సరిపోదు. దానిని ఆస్వాదించడం కూడా తెలిసి ఉండాలి.

వారంలో రెండు, మూడు సార్లు శృంగారంలో పాల్గొన్నప్పటికీ అది సంతోషంగా, సంతృప్తిగా ముగియాలి. అయితే పురుషుల్లో సెక్సువల్ స్టామినా పెంచడానికి, వారిలో కోరికలు రగిలించి, కీలు గుర్రంలా మారడానికి కొన్ని చిట్కాలు పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పడకగదిలో లైంగిక పనితీరును మెరుగుపరచడానికి ఇలా చేయండి
1. లైంగిక శక్తిని మెరుగుపరచడానికి వ్యాయామం:
లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి కార్డియోవాస్కులర్ ఎక్సర్‌సైజు. సెక్స్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. క్రమం తప్పకుండా చేసే కార్డియో వ్యాయామాల వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రతి వారం కనీసం 75-150 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేయాలి. స్విమ్మింగ్, రన్నింగ్ వంటి కార్యకలాపాలు లిబిడోను పెంచడానికి అద్భుతంగా పని చేస్తాయి.
ఎండ్యురెన్స్: స్విమ్మింగ్, బైకింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు ఎండ్యురెన్స్ ను పెంపొందిస్తాయి.
స్ట్రెంత్: బరువులు ఎత్తడం, సాగే బ్యాండ్‌లను ఉపయోగించడం, పుషప్‌లు చేయడం ద్వారా కండరాలు బలోపేతం అవుతాయి.
ఫ్లెక్సిబిలిటీ: ఏదైనా వ్యాయామం చేసే ముందు శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి సహాయపడే వ్యాయామాల వల్ల గాయాలు కాకుండా ఉంటాయి.
2. పోషకాహారాలు తినాలి:
కొన్ని ఆహారాలు రక్త ప్రసరణను పెంచడానికి, శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కార్బోహైడ్రేట్లు, పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ -డి తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ లెవల్స్‌ను మెయింటైన్ చేయడంలో సహాయపడతాయి. పోషకాల వల్ల శక్తి ఎక్కువ సేపు ఉంటుంది.
3. మెలటోనిన్ స్థాయిలు పెంచుకోవాలి:
మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తక్కువ మెలటోనిన్ స్థాయిలు ఉన్న వారిలో అంగస్తంభన సమస్యలు వస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. శరీరం సహజంగా మెలటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. పిస్తా వంటి ఆహారాల ద్వారా కూడా మెలటోనిన్ అందుతుంది.
4. ఒత్తిడిని తగ్గించుకోవాలి:
అనేక ఆరోగ్య సమస్యలకు మూలం ఒత్తిడి. ఒత్తిడి వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల లైంగిక కోరికలు, పనితీరు దెబ్బతింటుంది. ఒత్తిడి అంగస్తంభన లేదా ఉద్వేగం చేరుకునే మీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఒత్తిడి వల్ల లైంగిక పనితీరుకు హాని కలిగించే మద్యపానం, ధూమపానం వంటి అనారోగ్య అలవాట్లను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వ్యాయామం ఒక గొప్ప మార్గం.
5. అనారోగ్య అలవాట్లను మానేయాలి:
మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్ల వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడటంతో పాటు లైంగిక పనితీరు దెబ్బతింటుంది. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల అంగస్తంభన సమస్యలు వస్తాయి.
6. స్టార్ట్-స్టాప్ టెక్నిక్‌ను ప్రాక్టీస్ చేయాలి:
సెక్స్ సమయంలో స్టామినాను స్ఖలనం కూడా ప్రభావితం చేస్తుంది. శృంగారం మొదలు పెట్టిన 1, 2 నిమిషాల్లోనే స్ఖలనం జరిగితే దాని వల్ల దంపతులు ఇద్దరికీ సుఖం ఉండదు. దాని వల్ల స్టామినా కూడా లేదని అనిపిస్తుంది. అయితే దీని కోసం స్టార్ట్-స్టాప్ టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications