Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
సంభోగం సమయంలో ఈ పని చేస్తే..భాగస్వామికి స్వర్గం!..మిమ్మల్ని వదిలిపెట్టరు..
ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఈ పదాలు వినడానికి ఎంత తియ్యగా ఉంటాయో, వాటిని బెడ్ రూమ్ లో ఆచరణలో పెట్టినప్పుడు ఆ బంధం మరింత పటిష్టంగా మారుతుంది. బెడ్ రూమ్ లో మీ భాగస్వామి పట్ల మీరు ఒక సింహంలా ఉండాలి. ఇక్కడ సింహం అంటే కేవలం ఆధిపత్యం కాదు; అది ఒక ప్రశాంతమైన గంభీరత, స్థిరమైన విశ్వాసం, తన సామ్రాజ్యాన్ని ప్రేమతో ఏలే తత్వం. శృంగారం అనేది కేవలం శారీరక కలయిక కాదు, అది రెండు మనసుల మధురమైన సంగమం. ఆ సంగమానికి పునాది వేసేదే ఫోర్ ప్లే లేదా శృంగార క్రీడ.
చాలా జంటలు చేసే పొరపాటు ఏంటంటే.. లోతైన ముద్దు, కాస్త కౌగిలి, ఆపై నేరుగా సంభోగంలోకి వెళ్ళిపోవడం..ఇది కొంతకాలానికి యాంత్రికంగా, విసుగు పుట్టించే ప్రక్రియగా మారిపోతుంది. మీ ప్రేమాయణంలో మాధుర్యాన్ని, కాస్త చిలిపితనాన్ని నింపాలంటే ఫోర్ ప్లే అత్యంత కీలకం. నిపుణులు చెప్పేదాని ప్రకారం ఫోర్ ప్లే అనేది రాత్రి మంచం మీద మొదలయ్యేది కాదు అది ఆ రోజు ఉదయం నుండే మీ చూపులతో, స్పర్శతో, మాటలతో మొదలవ్వాలి. మీ భాగస్వామిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆ క్షణానికి సిద్ధం చేయడమే దీని అసలు ఉద్దేశ్యం.

ప్రేమ మంత్రాలు
శృంగారానికి నాంది పలకడానికి మాటలకంటే శక్తివంతమైన ఆయుధం ఇంకోటి లేదు. మీ భాగస్వామిని వెనుక నుండి ప్రేమగా వాటేసుకుని, వారి చెవి దగ్గరకు చేరి, మంద్రమైన స్వరంతో నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అని గుసగుసలాడండి. మీ మాటల్లో ప్రశంస, కాస్త కొంటెతనం జోడించండి. మీ వెచ్చని శ్వాస వారి మెడపై పడుతుంటే మీ పెదవులతో వారి చెవి తమ్మెలను సున్నితంగా తాకండి. మీ నాలుకతో చిన్న స్పర్శను అందించండి. వారి శరీరం పులకించి, మీ చేతిని గట్టిగా పట్టుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా మీ ముద్దుల ప్రయాణాన్ని భుజాలు, మెడ మీదుగా నడుము వైపు సాగించండి.

స్పర్శతో కవిత్వం
శరీరమే ఒక కాన్వాస్ అయితే మీ పెదవులు, నాలుక కుంచెలు కావాలి. తొందరపాటు అస్సలు వద్దు. మీ భాగస్వామి శరీరంపై మీ నాలుకతో ఒక సున్నితమైన యాత్ర చేయండి. ముఖ్యంగా నాభి, తొడల లోపలి భాగం వంటి సున్నితమైన ప్రదేశాలపై మీ దృష్టి సారించండి. ఈ ప్రయాణాన్ని నెమ్మదిగా, ఆస్వాదిస్తూ సాగించండి. మీ భాగస్వామి కళ్ళలోకి చూస్తూ, వారి స్పందనను గమనిస్తూ ముందుకు వెళ్ళండి. పెదవులతో ముద్దు పెడుతున్నప్పుడు మీ చేతులను ఖాళీగా ఉంచకండి. వారి శరీరంపై సున్నితంగా పాకిస్తూ, వారిలోని కోరికలను తట్టిలేపండి.
నిదానమే ప్రదానం
ఫోర్ ప్లే అనేది అసలు ఘట్టానికి కేవలం నాంది కాద, అదే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం ఎంత ఎక్కువసేపు సాగితే అసలు గమ్యం అంత మధురంగా ఉంటుంది. మధ్యమధ్యలో ఆగి, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చిలిపిగా నవ్వండి. మీ చేతి వేళ్ళతో వారి జుట్టును సవరించండి. ఒకరి శరీరపు వెచ్చదనాన్ని, పరిమళాన్ని పూర్తిగా ఆస్వాదించండి. ఈ చిన్న చిన్న విరామాలు మీ మధ్య ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పద్ధతులను పాటించడం ద్వారా మీరు కేవలం మీ కోరికను తీర్చుకోవడమే కాదు, మీ భాగస్వామికి ఒక మరపురాని అనుభూతిని అందిస్తారు. అప్పుడు మీ శృంగారం కేవలం ఒక శారీరక చర్యగా మిగిలిపోకుండా అది మీ ప్రేమకు, మీ అనుబంధానికి ఒక మధురమైన వేడుక అవుతుంది.



Click it and Unblock the Notifications