Latest Updates
-
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..!
ఈ ఒక్క విషయాన్ని గుర్తిస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది..
మన జీవితం ఒక నది ప్రవాహం మాదిరి ఉంటుంది. ఈ ప్రవాహంలో ఎన్నో ఊహించని మలుపులు, ఎత్తుపల్లాలు,ట్విస్ట్ లు ఎదురవుతాయి. ఏదైనా పనిమీద హడావుడిగా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరక్కపోయినప్పుడు కలిగే చిరాకు, ఆఫీసులో ఉన్నతాధికారి అన్న మాటలకు కలిగే బాధ, ఫ్రెండ్ప్ అపార్థం చేసుకున్నప్పుడు వచ్చే ఆగ్రహం.. ఇలాంటి ఎన్నో సందర్భాలు మన రెగ్యులర్ లైఫ్ లో సర్వసాధారణం. ఈ పరిస్థితుల్లో ఎవ్వరైనా కోపానికి, ఆందోళనకు గురవ్వడం సహజమే అని అనుకుంటారు చాలామంది. వాస్తవానికి అసలు నిజం అది కాదు.
మన చుట్టూ ఉన్న పరిస్థితులను, వ్యక్తుల ప్రవర్తనను మనం ఎప్పుటికీ కంట్రోల్ చేయలేం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందించాలనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడే అసలైన స్వేచ్ఛ, శక్తి దాగి ఉన్నాయని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. సమస్య బయట లేదు, మనలోనే ఉంటది. మన భావోద్వేగాల రిమోట్ కంట్రోల్ ను ఇతరుల చేతికి ఇచ్చి, వారు నొక్కినప్పుడల్లా మనం స్పందిస్తున్నాం. ఈ అధికారాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడమే అసలైన పరివర్తన.

ఇతరులకు అధికారం ఇవ్వకండి
ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడో లేదా బాధపెట్టినప్పుడో మనకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక అవతలి వారిని చెడామడా తిట్టేస్తుంటాం..కొన్ని సందర్భాల్లో కొట్టుకోవడం దాకా కూడా పరిస్థితులు వెళ్లాయి..మరికొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తుతుంటాయి. అయితే అసలు మనం ఒక వ్యక్తిపై కోపంగా ఉన్నామంటే.. వారి ప్రవర్తన మనల్ని నియంత్రించడానికి మనం అనుమతిస్తున్నామని అర్థం. మన ఆనందాన్ని, మన శాంతిని వారి చేతుల్లో పెడుతున్నాం. వారు మనకు నచ్చినట్టు ప్రవర్తిస్తే సంతోషం, నచ్చకపోతే కోపం. అంటే మన భావోద్వేగాలకు యజమాని మనం కాదు, వారే అన్నది ఇక్కడ సృష్టమైన విషయం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ చాలా అద్భుతంగా వివరిస్తారు. ఆయన మాటల్లో చెప్పాలంటే..కోపం అంటే మీరు విషం తాగి, అవతలి వారు చనిపోవాలని కోరుకోవడం లాంటిది.
మీరు కోపంగా ఉన్నప్పుడు ఆ వేడి, ఆ ఒత్తిడి, ఆ ప్రతికూల రసాయనాలు మీ శరీరంలోనే విడుదలవుతాయి. దానివల్ల నష్టపోయేది మీరే. మీ బీపీ పెరుగుతుంది, మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, మీ ఆలోచనా శక్తి మందగిస్తుంది. అవతలి వ్యక్తి బహుశా హాయిగా భోజనం చేస్తూ ఉండవచ్చు, కానీ మీరు మాత్రం మీలో మీరే విషాన్ని సృష్టించుకుని బాధపడతారు.
ఇది తెలివైన పనేనా?
సద్గురు ప్రకారం.. మీ లోపల ఏమి జరగాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీ సంతోఫం, మీ బాధ, మీ కోపం.. ఇవన్నీ మీ సృష్టి. మీ ఇంట్లో మీకు నచ్చినట్లుగా వస్తువులను సర్దుకున్నప్పుడు మీ లోపల కూడా మీకు నచ్చిన భావాలను, అనుభూతులను ఎందుకు సృష్టించుకోకూడదు? మన భావోద్వేగాలు మన చేతుల్లో లేవనుకోవడం ఒక భ్రమ మాత్రమే. వాటిని సృష్టించేది మనమే. కాబట్టి మనకు హాని కలిగించే కోపాన్ని ఎందుకు సృష్టించుకోవాలి?
స్పందనకూ, ప్రతిచర్యకూ మధ్య ఉన్న తేడా
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి వెంటనే స్పందించడాన్ని ప్రతిచర్య అంటారు. ఇది ఆలోచన లేకుండా, మెషీన్ లా జరిగిపోతుంది. ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని తిడితే, మీరు వెంటనే వారిని తిట్టడం ఒక ప్రతిచర్య. అయితే..స్పందన అనేది ఢిఫరెంట్. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి వెంటనే స్పందించకుండా ఒక్క సెకను ఆగి, ఆలోచించి, స్పృహతో ఒక నిర్ణయం తీసుకుని ప్రవర్తించడమే స్పందన. ఈ చిన్న టైం గ్యాప్ లోనే అద్భుతమైన స్వేచ్ఛ దాగి ఉంది. ఆ క్షణంలో మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవచ్చు, ఈ పరిస్థితికి నేను కోపంతో స్పందించడం అవసరమా? దీనివల్ల నాకు శాంతి కలుగుతుందా లేక నా శాంతిని నేనే నాశనం చేసుకుంటున్నానా? ఈ స్పృహ వచ్చినప్పుడు, మీరు కోపాన్ని ఎంచుకోరు.. ప్రశాంతతను, వివేకాన్ని ఎంచుకుంటారు.

మీ వాతావరణాన్ని మీరే ఎంచుకోండి
అంతర్గత నియంత్రణ ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరిగ్గా ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. నిరంతరం మిమ్మల్ని విమర్శించే, మీ శక్తిని హరించే, మీ గురించి మంచి అభిప్రాయం లేని వ్యక్తుల మధ్యలో మీరు ఉంటే ప్రశాంతంగా ఉండటం కష్టం. అది నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు ఉంటుంది. కొంతసేపటికి ఆవిరైపోతుంది. మీరు ఎలాంటి అనుభూతిని పొందాలనుకుంటున్నారో, దానికి అనుగుణంగా మీ వాతావరణం లేకపోతే,దాన్ని మార్చుకోవడానికి వెనుకాడకండి. అది మీ ఉద్యోగం కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ రిలేషన్ లో ఎవరైనా కావచ్చు.
విషపూరిత వాతావరణంలో ఉంటూ శాంతిని కోరుకోవడం అంటే..ముళ్లపొదలో ఉంటూ గాయాలు కాకూడదని ఆశించడం లాంటిది. మీ ఎదుగుదలకు, మీ మానసిక ప్రశాంతతకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించుకోవడం మీ బాధ్యత. ఇది స్వార్థం కాదు, ఆత్మగౌరవం.
కోపం, ఆందోళన అనేవి బయట నుండి వచ్చే శత్రువులు కావు. అవి మన లోపల మనమే సృష్టించుకునే భావోద్వేగాలు. వాటిని సృష్టించే శక్తి మనకు ఉన్నప్పుడు, వాటిని నియంత్రించే శక్తి కూడా మనకే ఉంటుంది. మీ కోపానికి కారణం బయటి సంఘటన కాదు, దానికి మీరు ఇస్తున్న ప్రతిచర్య అని గుర్తించండి.
ఇది మీ జీవితం. మీ భావోద్వేగాలు. వాటిని ఇతరుల చేతికి ఇచ్చి కీలుబొమ్మగా మారతారో లేక వాటికి మీరే యజమానిగా నిలిచి మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారో నిర్ణయించుకోవాల్సింది మీరే. ప్రశాంతంగా, ఆనందంగా ఉండటం అనేది ఒక వరం కాదు, అది ఒక ఎంపిక. ఆ ఎంపికను తెలివిగా చేసుకోవాల్సిందే.



Click it and Unblock the Notifications