Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఒకరు శృంగార కోరికలతో రగిలిపోయి, మరొకరికి కోరికలే లేకపోతే ఏం చేయాలో తెలుసా?
అప్పుడప్పుడే ప్రేమ లేదా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన వాళ్లకు ఒకరంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ, ఇష్టం ఉంటుంది. ఇద్దరూ ఏకాంతంగా సమయం గడపాలని చూస్తుంటారు. కలిసి మాట్లాడడం.. సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంటారు.
ఒక ఏడాది వరకూ ఇద్దరిలోనూ ఆ కోరికలు బలంగా ఉంటాయి. కానీ ఏడాది తర్వాత స్త్రీ, పురుషుల్లో లైంగిక వాంఛల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఒకరికి కోరిక ఎక్కువవడం, మరొకరికి తగ్గి సెక్స్ కు సహకరించకపోతే వారిద్దరి మధ్య అనేక సమస్యలు వస్తాయి. ఇవి దీర్ఘకాలికంగా దంపతుల మధ్య బంధానికి ప్రమాదం వాటిల్లేలా చేస్తాయి.

ఒకరికి కోరికలు ఎక్కువ, మరొకరికి తక్కువ:
ముఖ్యంగా పురుషుల్లో ఈ కోరికలు ఎక్కువగా ఉంటే పెద్దగా ఎవరూ ఏం అనుకోరు. కానీ స్త్రీలలో ఈ కోరికలు ఎక్కువగా ఉంటే మాత్రం ఆమెను దురుద్ధేశంతో చూస్తారు. ఆమె తరచుగా ముద్దులు, కౌగిలింతలు ఇచ్చినా వేరేలా అనుకుంటారు.
కానీ ఇలా కాకుండా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం లేదా సెక్స్ థెరపిస్ట్ వద్దకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా ఈ కింద చెప్పిన వాటిని ఫాలో అయితే సెక్స్ థెరపిస్ట్ వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.
1. మీకు నిజంగా ఏం కావాలి?
సాధారణంగా దంపతుల మధ్య ప్రేమను ఒక్క సెక్స్ మాత్రమే పెంచదు. కలిసి తినడం, ముద్దులు, కౌగలింతలు, ప్రేమగా మాట్లాడడం, ఒకరిపై ఒకరు ప్రేమ, కరుణను కల్గి ఉండడం, సామాజిక కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి వెళ్లడం వంటి వల్ల ప్రేమ పెరుగుతుంది. దీని వల్ల మీకు లైంగిక వాంఛల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ పెద్దగా సమస్యలు ఏర్పడవు.
2. ఎంతసేపు కలిసుండాలనే దానిపై రాజీ పడాలి!
మీ భాగస్వామి వారానికి రెండు సార్లు సెక్స్ కోరుకుంటే.. మరొకరు నెలకు ఒకసారి సంతృప్తి చెందుతారనుకోండి. వారి సగటు నెలకు నాలుగు లేదా ఐదు సార్లు ఉంటుంది. కానీ సగటులు పట్టింపులు కాకుండా మీరిద్దరూ హాయిగా ఉండే ఫ్రీక్వెన్సీని కనుగొనడం మరింత మంచిది.
3. సెక్స్ తేదీలు పెట్టుకోవడం..!
ఇది చాలా కష్టమైనది. కానీ దీని వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కువ కోరికలు కల్గిన భాగస్వామికి ఇది భరోసాను ఇస్తుంది. దీనివల్ల టెన్షన్ పడకుండా ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉంటారు. దీని వల్ల కోరికలు కూడా కాస్త అదుపులో ఉంటాయి.

4. సెక్స్ షెడ్యూల్ డేట్ రోజు మూడ్ లేకపోతే..?
తక్కువ కోరిక కల్గిన భాగస్వాములు ఎల్లప్పుడూ ఈ ప్రశ్న అడుగుతుంటారు. షెడ్యూలింగ్ సెక్స్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి, సంబంధం మెరుగుపడుతుంది. అయితే ఈ తేదీల ఏర్పాటు వల్ల తక్కువ కోరిక కల్గిన వాళ్లు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా మీకు నచ్చని రోజు మీరు ఆగొచ్చు. ఓ ఆరు నెలల పాటు ఇలా తేదీ షెడ్యూల్ చేసుకుంటే సరిపోతుంది.
5. కట్టుబడి ఉండడం మంచిది..!
ఇద్దరి ఇష్టంతో ఏర్పాటు చేసుకున్న సెక్స్ షెడ్యూల్ కు ఇద్దరూ కట్టుబడి ఉండాలి. కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్లు ఇంకా పెంచాలని, తక్కువ ఉన్న వాళ్లు సెక్స్ తేదీను ఎక్కువగా రద్దు చేయడం కానీ చేయకూడదు.
6. ఆ తేదీల్లో ఎవరూ ముందుగా స్పందించినా మంచిదే..!
మీడు షెడ్యూల్ చేసుకున్న తేదీల్లో.. తక్కువ ప్రేమ ఉన్న వాళ్లే ముందుగా వెళ్లి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చేస్తే చాలా మంచిది. స్త్రీ ఇలా చేస్తే తిట్టకుండా.. ఇద్దరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ తేదీలను ఫిక్స్ చేసుకుంది ఇద్దరూ కలిసే కాబట్టి.
7. ఇలా అయితే సెక్స్ థెరపిస్ట్ అవసరం..!
షెడ్యూల్‌ను చర్చించడంలో మీకు సహాయం కావాలంటే లేదా దీర్ఘకాలిక కోరిక వ్యత్యాసం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంటే మీరు కచ్చితంగా సెక్స్ థెరపిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిందే.



Click it and Unblock the Notifications