Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Relationship Tips: ఇలా చేస్తే మీ భాగస్వామికి ఈజీగా మూడ్ తెప్పించవచ్చు
వైవాహిక జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మొదట్లో ఉన్న ఆకర్షణ, కోరికలు రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంటాయి. అలా అని జీవిత భాగస్వామితో సంతోషానికి, సంతృప్తికి దూరం కావాల్సిన అవసరం లేదు. వైవాహిక జీవితంలో కోల్పోయిన సెక్సువల్ స్పార్క్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
పని ఒత్తిడి, వ్యాపారంలో ఆందోళనలు, బాధ్యతలు, పిల్లల పెంపకం ఇలా చాలా కారణాల వల్ల భాగస్వాముల మధ్య శృంగారం ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే రొమాంటిక్ గా ఉండటం, రొమాన్స్ చేయడం, శృంగార మెసేజ్‌లు, రీల్స్ పంపడం లాంటి వాటి పనులతో భాగస్వామిలో శృంగార కాంక్షను రేకెత్తించవచ్చు. భార్యనైనా, భర్తనైనా మూడ్‌లోకి తీసుకురావడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రొమాంటిక్ మెసేజ్‌లు, రీల్స్, షార్ట్స్ పంపించండి:
పనిలో ఉన్నా, ఇతర చోట ఉన్నా మీ పార్ట్‌నర్‌కు ఒక రొమాంటిక్ మెసేజ్ పంపించండి. ఇన్‌స్టా రీల్, యూట్యూబ్ షార్ట్స్ ఇలా ఏదో ఒకటి శృంగారభరితంగా ఉండేది అయి ఉండాలి. ఇలా ఏదైనా రొమాంటిక్ మెసేజ్ అందుకున్న వారికి మూడ్ లేకపోయినా మెల్లిగా మూడ్ లోకి రప్పించొచ్చు. భర్త లేదా భార్యతో సరసాలు ఆడటానికి ఇదో గొప్ప మార్గం.
2. మీ భాగస్వామికి ఇష్టమైన దుస్తులు వేసుకోండి:
పని అయిపోగానే ఇంటికి వచ్చినా లేదా ఇంట్లోనే ఉంటూ పని చేస్తున్నా.. భర్తలైతే ఎప్పుడూ ఒక షార్ట్, చిరిగిపోయిన టీషర్ట్, చెరిగిన జుట్టు, లేదంటే లుంగీ.. భార్యలైతే నైటీ, చెరిగిన జుట్టుతో ఉంటే ఒకరిని చూస్తే మరొకరికి మూడ్ ఎక్కడి నుండి వస్తుంది. అందుకే వారికి ఇష్టమైన దుస్తుల్లో కనిపించడానికి ప్రయత్నించాలి.
వారికి ఎలా ఉంటే ఇష్టమో అలాంటి డ్రెస్సులు వేసుకోవడం, అలా రెడీ కావడం లాంటివి చేయడం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు. భార్యలైతే మంచి రొమాంటిక్, ఎరోటిక్ డ్రెస్సులు వేసి ఎక్స్‌పోజ్ చేసి భర్తలకు ఈజీగా మూడ్ తెప్పించొచ్చు.
3. లవ్ నోట్స్ రాసి వాళ్లకు కనిపించేలా పెట్టడం:
ఫోన్ సెక్స్ ఇష్టం లేకపోతే పాతకాలంలో చేసినట్లు లవ్ లెటర్స్ కాకపోయినా కనీసం లవ్ నోట్స్ రాయొచ్చు. చిన్న చిన్న సందేశాలను నోట్స్ రూపంలో రాసి మీ జీవిత భాగస్వామికి కనిపించేలా పెట్టాలి. ఈ పద్ధతి పాతదానిలా ఉన్నప్పటికీ చాలా బాగ్ వర్కౌట్ అవుతుంది. మంచి రొమాంటిక్ సందేశం కానవసరం లేదు. కనీసం నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు లాంటి నోట్స్ రాసినా వారిలో మెల్లిగా కోరికలు మొదలవుతాయి.

4. వెనక నుండి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం:
మీ భాగస్వామి ఏదైనా పనిలో ఉన్నప్పుడు మెల్లిగా వెళ్లి వెనకనుండి వాటేసుకోండి. గట్టిగా కౌగిలించుకుని మెడపై ముద్దులు పెట్టండి. వారు ముఖంపై, వీపుపై, పెదాలపై మీరు కోరుకున్న చోట, వారికి కోరికలు వస్తాయనిపించే చోట ముద్దు పెట్టుకోండి. ఇలాంటి రొమాంటిక్ పనుల వల్ల భాగస్వామిలో శృంగార కోరికలు రగిలించవచ్చు.
5. బైక్‌పై, కారులో వెళ్తుంటే రొమాంటిక్‌గా ఉండండి:
పెళ్లై భార్యాభర్తలు ఇంట్లోనే, పడగ్గదిలోనే శృంగారం చేస్తే కుదరదు. ఇంట్లో హాల్ లో, కిచెన్ లో, బాల్కనీలో, టెర్రస్ పై రొమాంటిక్ పనులు చేయాలి. బైక్ పై వెళ్తుంటే ఏదైనా రొమాంటిక్ గా ఉండండి. కారులో వెళ్తుంటే ఏదైనా శృంగారభరితమైన సాంగ్ వస్తుంటే వారిని సెక్సువల్ గా తాకండి.



Click it and Unblock the Notifications