Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
శృంగారంలో సంతృప్తి పరచలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి
శృంగారం అంటే ఏదో అలా జరిగిందా అంటే జరిగింది అన్నట్లుగా ఉండొద్దు. దాని వల్ల ఇద్దరూ ఆనందించగలగాలి, సంతృప్తి చెందగలగాలి, ఆఖర్లో మళ్లీ కావాలనిపించేలా ఉండాలి. ప్రారంభం నుండి ఆఖరి వరకు, అయిపోయాక కూడా ఇద్దరూ సెక్సువల్ గా తృప్తి, భావప్రాప్తి పొందాలి.

సెక్స్ అంటే ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా పెనవేసుకుపోయి ఇద్దరూ అనుభవించే మధురమైన అనుభూతి. శృంగారంలో ఇద్దరూ ఒకే వేగంతో కదలాలి, ఒకేలా ఎంజాయ్ చేయాలి, ఒకేలా అనుభూతి చెందాలి. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అయిపోతే.. ఆ శృంగారం వల్ల ఒకరు సంతృప్తి చెందారని, మరొకరి తృప్తి పొందలేరని అర్థం.
ఒకవేళ మీరు మీ భాగస్వామిని సెక్స్ లో సంతృప్తి పరచలేకపోతున్నామని, వారికి శృంగార అనుభూతిని అందించలేకపోతున్నామని మీకు అనిపిస్తే.. వారిని ఎలా సంతృప్తి పరిచి, భావప్రాప్తి పొందేలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కమ్యూనికేషన్ కీలకం:
ఎదుటి వారి మనసులో ఏముందో సరిగ్గా ఎవరూ కనిపెట్టలేరు. కనీసం వారి మనసులో ఏముందో ఒక అంచనా వేయడానికి కూడా మనమేం మానసిక నిపుణులు కాదు. ఎదుటివారికి ఏం కావాలో, వారు ఏమనుకుంటున్నారో ఎలా తెలుసుకోవడం. మాటల ద్వారానే తెలుసుకోవాల్సిందే.
శృంగారం అంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టంగా చేయాల్సిన కార్యం. సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఎదుటివారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని నడుచుకోవాలి. మాటల ద్వారానో, చేతల ద్వారానో వారికేం కావాలో తెలుసుకుని వారికి అది ఇచ్చేస్తే వారు హ్యాపీ. వారు సంతృప్తి చెందారు కాబట్టి మనమూ హ్యాపీ. అందుకే శృంగారం కమ్యూనికేషన్ చాలా కీలకం.
2. రొటీన్‌గా ఉండొద్దు:
వారానికి రెండు లేదా మూడు సార్లు సెక్స్ చేసుకోవడం. ఎప్పుడూ ఒకటే తరహాలో సెక్స్ సాగడం, ఒకే భంగిమలో సంభోగించడం ఇవన్నీ రొటీన్ గా సాగితే శృంగారంలో కొత్త మజా ఎక్కడి నుండి వస్తుంది. అందుకే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రయత్నించాలి.
ఎప్పుడూ బెడ్ రూమేనా ఈసారి కొత్తగా హాల్, కిచెన్, డ్రాయింగ్ రూమ్, బాల్కనీ, టెర్రస్ ఇలా కొత్తగా ప్రయత్నించి చూడండి. అలాగే ఫోర్ ప్లే కొత్తగా ట్రై చేయండి. సంభోగించేటప్పుడు కొత్త భంగిమలు ప్రయత్నించండి. కొత్త దుస్తులు, ఎక్స్‌పోజింగ్ చేసే లాంటివి ట్రై చేస్తే తప్పేం లేదు.
3. ఫోర్ ప్లే చాలా ముఖ్యం:
శృంగారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే ఫోర్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఫోర్ ప్లే ద్వారా దంపతులు ఇద్దరూ మూడ్ లోకి వస్తారు. ఇద్దరిలో తడి మొదలవుతుంది. దీని వల్ల అసలు కార్యం చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ముఖ్యంగా స్త్రీలను సంతృప్తి పరచాలంటే ఫోర్ ప్లే తప్పనిసరి. మహిళల సెక్స్ డ్రైవ్ ఎక్కువ సేపు ఉంటుంది. పురుషులతో పోలిస్తే వారు ఎక్కువ సేపు శృంగారాన్ని ఎంజాయ్ చేయగలరు. అలాంటప్పుడు సంభోగం ఒక్కదాంతోనే వారిని సంతృప్తి పరచడం కష్టం. మీ శృంగార చర్యల్లో ఫోర్ ప్లే ను భాగం చేయండి.
4. సెక్సీ టాక్ ప్రయత్నించండి:
సెక్సీ మాట్లాడటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. శృంగార సమయంలో సెక్సీ పదాలతో మాట్లాడటానికి ప్రయత్నించాలి. అలాంటి కొన్ని పదాల వాడకం వల్ల శృంగార అనుభూతి రెట్టింపు అవుతుంది. స్త్రీ, పురుషులు ఇద్దరూ ఇది ప్రయత్నించి చూడండి. మంచి ఫలితాన్ని చూస్తారు.
5. సెక్స్ ఫాంటసీలు పంచుకోండి:
శృంగారం పట్ల ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. కొత్త భంగిమలు, కొత్త ప్రదేశాలు, డర్టీ ప్రదేశాలు, పోర్న్ చూస్తూ సెక్స్ చేయడం, అద్దం ముందు శృంగారం చేయడం లాంటివి చాలా ఉంటాయి. మీకు ఉన్న సెక్స్ ఫాంటీసల గురించి మీ భాగస్వామికి చెప్పండి. వారు ఓకే మీరు అంటే చెలరేగిపోవచ్చు.



Click it and Unblock the Notifications